భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే లాంచ్ : ధర & ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా కొత్త ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపేని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ .76.70 లక్షలు (ఎక్స్‌షోరూమ్) కొత్త మెర్సిడెస్-ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే 'మేడ్-ఇన్-ఇండియా' బ్రాండ్ యొక్క మొట్టమొదటి హై ఫెర్ఫామెన్స్ మోడల్. ఎఎమ్‌జి మోడల్ CKD (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్‌గా భారతదేశానికి దిగుమతి అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే లాంచ్ : ధర & ఇతర వివరాలు

మెర్సిడెస్-ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే కోసం బుకింగ్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెరవబడ్డాయి. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా భారతదేశం అంతటా ఏదైనా డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. అధిక పనితీరు గల ఎస్‌యూవీ కోసం డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే లాంచ్ : ధర & ఇతర వివరాలు

జిఎల్‌సి 43 కూపే బ్రాండ్ యొక్క సిగ్నేచర్ పాన్-అమెరికానా గ్రిల్‌ను నిలువు స్లాట్‌లతో ఉండటమే కాకుండా, కేంద్రంగా ఉంచిన త్రీ పాయింటెడ్ మెర్సిడెస్ స్టార్‌తో ముందుకు తీసుకువెళుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో ఒక జత ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో గ్రిల్ ఇరువైపులా ఉంటుంది.

దీనికి కొత్త డిజైన్ ఎల్‌ఈడీ హై పెర్ఫార్మెన్స్ హెడ్‌ల్యాంప్ ఇవ్వబడింది. ఇది 19 అంగుళాల చక్రాలను కలిగి ఉంది, ఇది AMG అక్షరాలతో ప్రామాణికంగా అందించబడుతుంది. వెనుక భాగంలో విస్తృత ఆప్రాన్, డిఫ్యూజర్, రెండు రౌండ్ ట్విన్ టెయిల్ పైప్ ఉన్నాయి, ఇది వాహనానికి స్పోర్టి లుక్ ఇస్తుంది.

MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే లాంచ్ : ధర & ఇతర వివరాలు

దీని కూపే డిజైన్‌ను సైడ్ పార్ట్‌లో చూడవచ్చు, ఈ కారణంగా ఇది వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తంమీద ఇది ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ కారులోని ఇంటీరియర్స్ గమనించినట్లయితే ఇందులో స్పోర్ట్స్ సీట్లు, లెదర్ మరియు రెడ్ స్టిచింగ్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది MBUX టెక్నాలజీతో 10.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

టచ్‌ప్యాడ్, ఎఎమ్‌జి పెర్ఫోమన్స్ స్టీరింగ్ వీల్, నావిగేషన్, 12.3-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రష్డ్ అల్యూమినియం పాడిల్ షిఫ్టర్ ఇవ్వబడ్డాయి. దీనితో పాటు, క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్లు, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు మెమరీ ఫంక్షన్‌తో అందించబడతాయి.

MOST READ:మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే లాంచ్ : ధర & ఇతర వివరాలు

మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపేలో 3.0-లీటర్ వి 6 పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 39 బిహెచ్‌పి శక్తిని మరియు 520 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. బ్రాండ్ యొక్క 4 మెటిక్ సిస్టమ్ స్టాండర్డ్‌గా, ఆల్ వీల్ డ్రైవ్ వాహనం.

మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త మెర్సిడెస్-ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే 3.0-లీటర్ వి 6 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 390 బిహెచ్‌పి మరియు 520 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడింది. శక్తి నాలుగు-చక్రాలకు బ్రాండ్ యొక్క ఫోర్ మాటిక్ సిస్టమ్ ద్వారా పంపబడుతుంది, ఇది స్టాండర్డ్ గా ఇవ్వబడుతుంది.

ఈ కారు కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ సాధిస్తుంది మరియు గరిష్ట వేగం గంటకు 250 కిమీ. మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపే భారత మార్కెట్లో పోర్స్చే మకాన్ ఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:భారత మార్కెట్లో డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ బిఎస్ 6 బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

Most Read Articles

English summary
Mercedes-AMG GLC 43 Coupe Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X