Just In
Don't Miss
- Finance
ఏప్రిల్ 1 నుండి రూ.1 కోటి ప్రమాద బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ప్రయోజనాలెన్నో
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Movies
Uppena Collections.. దూసుకుపోతోన్న ఉప్పెన.. ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే?
- News
టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మిత్సుబిషి నుంచి కొత్త ఎస్‌యూవీలు వస్తున్నాయ్..!
జపనీస్ కార్ బ్రాండ్ మిత్సుబిషి, భారత మార్కెట్లో ఎప్పటి నుంచో తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే, ఈ బ్రాండ్ పెద్దగా మార్కెట్లో సక్సెస్ రుచిని చూడలేకపోయిందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం ఈ బ్రాండ్ నుంచి అతి తక్కువ మోడళ్లు అందుబాటులో ఉండటం మరియు వాటి ధరలు కూడా అధికంగా ఉండమే.

ఈ నేపథ్యంలో మిత్సుబిషి భారత మార్కెట్లో తమ బ్రాండ్‌ను రీబిల్డ్ చేసుకునే దిశగా సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి మిత్సుబిషి కార్లు పెర్ఫార్మెన్స్‌కి పెట్టింది పేరు. కార్లలో స్పోర్టీనెస్‌ను కోరుకునే వారికి ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ మిత్సుబిషి. ఈ కంపెనీ ఇప్పుడు భారత్‌లో మరిన్ని కార్లను తీసుకు వచ్చేందుకు ప్లాన్స్ చేస్తోంది.

భారత కార్ మార్కెట్ పరిమాణం నానాటికీ విస్తరిస్తోంది. కొత్త కంపెనీలు మరియు సరికొత్త కార్ల రాకతో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ కళకళలాడుతోంది. గడచిన కొన్నేళ్లలో మిత్సుబిషి తమ లాన్సర్ సెడాన్ కారు మొదలుకొని పాజెరో, అవుట్‌లాండర్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ మూడు మోడళ్లలో పాజెరో స్పోర్ట్ కాస్తంత పాపులరాటీని దక్కించుకుంది.
MOST READ: మలేషియా పోలీస్ ఫోర్స్‌లో చేరిన హోండా సివిక్ కార్లు

ఇండియన్ మార్కెట్లో బిఎస్6 నిబంధనలు అమల్లోకి రావటంతో మిత్సుబిషి ఇప్పుడు మన దేశంలో ఎలాంటి కార్లను విక్రయించడం లేదు. కాకపోతే, త్వరలో విడుదల చేయదలచిన బిఎస్6 వెర్షన్ మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ ఎస్‌యూవీ కోసం మాత్రం కంపెనీ బుకింగ్‌లను ఓపెన్ చేసింది.

ఈ సారి భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశంగా మిత్సుబిషి కొత్త ప్లాన్స్‌తో రాబోతోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, భారత్‌లో మిత్సుబిషి కార్యకలాపాల విస్తరణం కోసం ఇప్పటికే పెట్టుబడిదారుడు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే, మిత్సుబిషి మరిన్ని కొత్త కార్లు మరియు మరింత విస్తృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లతో ఇండియాలో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వటం ఖాయమని తెలుస్తోంది.
MOST READ: భారీగా పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు : ఎంతో తెలుసా

మిత్సుబిషిలో పెట్టుబడి పెట్టదలచిన ప్రముఖ వ్యాపారవేత్త జెంషడ్‌పూర్‌కి చెందిన వ్యక్తి అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తిగా ఆటోమొబైల్ పరిశ్రమలో విడిభాగాలను తయారు చేసిన అనేక ప్రముఖ బ్రాండ్‌లకు సరఫరా చేసే వ్యాపారం కూడా ఉందట. సుమారు రూ.500 కోట్ల మొత్తాన్ని మిత్సుబిషిలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తంతో కొత్త అసెంబ్లీ లైన్‌తో కూడిన తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మిత్సుబిషికి ఇండియాలో ఎలాంటి ప్లాంట్ లేదు. భారత్‌లో విక్రయించే మిత్సుబిషి కార్లను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి అక్కడి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిత్సుబిషి కార్లను ఇక్కడే గనుక అసెంబ్లింగ్ చేయగలితే, ఈ కార్ల ధరలు మరింత అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రారంభ ధశలో భాగంగా మిత్సుబిషి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌లో వ్యాపారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి దశల్లో తమ వాహనాలు ఇక్కడే అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది.
MOST READ: ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుంటే మిత్సుబిషి భారత మార్కెట్లో ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీని అలాగే ఓ టాప్-ఎండ్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు మోడళ్లలు ఈ సెగెంట్లలోని హ్యుందాయ్ క్రెటా, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

మిత్సుబిషి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసిన ఎక్లిప్స్ మరియు ఎక్లిప్స్ క్రాస్ అనే మోడళ్లు ఇండియన్ మార్కెట్‌కు వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
MOST READ: టెస్లా ఖాతాలో మరో విజయం, ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన బ్రాండ్!

ప్రస్తుతం మిత్సుబిషికి భారత్‌లో దేశవ్యాప్తంగా 11 డీలర్‌షిప్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ సంఖ్యను మూడు రెట్లకు పెంచుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మిత్సుబిషి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో పాజెరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్, అవుట్‌ల్యాండర్ మోడళ్లను మాత్రమే కంపెనీ అందుబాటులో ఉంచింది, త్వరలోనే ఈ మోడళ్లలో బిఎస్6 వెర్షన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

మిత్సుబిషి భారత్‌లో రీ-ఎంట్రీ ప్లాన్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో వ్యాపార విస్తరణపై మిత్సుబిషి ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ విషయంలో వస్తున్న వార్తలు నిజమైతే ఇండియన్ కార్ మార్కెట్లో మిత్సుబిషి తన బ్రాండ్ స్థిరత్వాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. మిత్సుబిషి వాహనాలు విశిష్టమైన స్టైల్ మరియు సాటిలేని పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటాయి. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఈ కార్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది.