హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఇండియా ఇటీవల సరికొత్త 2020 క్రెటా ఎస్‌యూవీని ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించింది. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే న్యూ క్రెటా పూర్తిగా కొత్త డిజైన్ శైలిలో, అత్యాధునిక ఫీచర్లు మరియు కనెక్టెడ్ టెక్నాలజీతో వచ్చింది.

ప్రస్తుతం ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా పాపులర్ సెల్లింగ్ మోడల్‌గా అగ్రస్థానంలో నిలిచింది. అయితే విపణిలోకి కొత్త మోడళ్ల రాకతో గత మూడు నాలుగు నెలల నుండి క్రెటా సేల్స్ తగ్గుముఖం పట్టాయి.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

కియా సెల్టోస్ ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వచ్చిన మరో కొత్త మోడల్. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ 2019 ఆగష్టులో సెల్టోస్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అనతి కాలంలోనే క్రెటాను కిందకు నెట్టేసింది.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

అయితే, హ్యుందాయ్ మోటార్స్ పాత క్రెటా స్థానంలో లేటెస్ట్ వెర్షన్ క్రెటా ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. అతి త్వరలో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల కానున్న 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ కియా సెల్టోస్‌కు ధీటైన పోటీనిస్తుందా..? మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా..? ఇవన్నీ పక్కనపెడితే.. క్రెటా మరియు సెల్టోస్ ఎస్‌‌యూవీలలో కొనడానికి ఏది బెస్ట్ వంటి పూర్తి వివరాలు ఇవాళ్టి క్రెటా vs సెల్టోస్ కంపారిజన్ స్టోరీలో తెలుసుకుందాం రండి...

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

డిజైన్

పాత క్రెటా ఎస్‌యూవీతో పోల్చుకుంటే 2020 హ్యుందాయ్ క్రెటా డిజైన్ పూర్తిగా మారిపోయింది. ఫ్రంట్ డిజైన్‌లో బ్రాండ్ న్యూ క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, దీనికి ఇరువైపులా C-ఆకారంలో ఉన్న ఎల్ఈడీ లైట్లు, వీటి చుట్టూ మెయిన్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వచ్చాయి. సైడ్ ప్రొఫైల్‌లో కూడా పదునైన మరియు ఆకర్షణీయమైన క్రీజ్ అండ్ క్యారెక్టర్ లైన్స్ వచ్చాయి. ఓవరాల్‌కు కొత్త తరం హ్యుందాయ్ క్రెటా కండలు తిరిగిన రూపంతో ఎంతో స్పోర్టివ్‌గా ఉంది.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

కియా సెల్టోస్ విషయానికి వస్తే, అందర్నీ ఆకర్షించే మొట్టమొదటి అంశం దీని రూపం, ఎక్ట్సీరియర్ పరంగా చూస్తే ఎంతో లగ్జరీగా ఉంటుంది. సిగ్నేచర్ టైగర్ నోస్ ఫ్రంట్ గ్రిల్ మీద వచ్చిన పొడవాటి ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, చతురస్రాకారంలో ఉన్న వీల్ ఆర్చెస్, మరియు స్టైలిష్ రియర్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు వచ్చాయి. కియా సెల్టోస్ ఓవరాల్ డిజైన్‌లో ఎక్కడ కూడా అనసరం అనిపించే ఎక్స్‌ట్రా డిజైన్స్ లేవు, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ప్రీమియం లుక్ దీని సొంతం.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

ఇంటీరియర్ ఫీచర్లు

ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ ఇంటీరియర్ మొత్తం బ్లాక్ థీమ్ కలర్ ఫినిషింగ్‌లో వచ్చింది. మేము సేకరించిన ఫోటోలను పరిశీలిస్తే, డ్యాష్‌బోర్డు మీద అతి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గమనించవచ్చు.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

డ్యూయల్ టోన్ ఫాక్స్ లెథర్ ఇంటీరియర్, కొత్తగా డిజైన్ చేయబడిన స్టీరింగ్ వీల్, పలు రకాల ఎలక్ట్రిక్ కంట్రోల్స్ స్టీరింగ్ వీల్ మీద చూడొచ్చు. దీంతో పాటు 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో హ్యుందాయ్ బ్రాండ్ బ్లూ లింక్ కనెక్టివిటీ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మొబైల్ అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

కియా సెల్టోస్ విషయానికొస్తే, క్యాబిన్ మొత్తం ఓ లగ్జరీ కారునే తలపిస్తుంది. డ్యాష్‌బోర్డుకు మధ్యలో అందించిన అతి పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కియా సెల్టోస్ టాప్ ఎండ్ వేరియంట్లలో ఫాక్స్ లెథర్ సీట్లు, డ్యూయల్ టోన్ క్యాబిన్, ఆంబియంట్ లైటింగ్, మరెన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

ఇంజన్ స్పెసిఫికేషన్లు

ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ క్రెటా ఎస్‌యూవీ 1.4-లీటర్ పెట్రోల్, 1.6-లీటర్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభిస్తోంది. అయితే, 2020 క్రెటా మోడల్‌లో ఈ ఇంజన్‌లను పూర్తిగా నిలిపేసి, కియా నుండి సేకరించిన సెల్టోస్ లోని ఇంజన్‌లను క్రెటాలో అందించాలనే ఆలోచనలో ఉన్నారు.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

దీనిర్థం, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ రెండు మోడళ్లలో కూడా ఒకే తరహా ఇంజన్ ఆప్షన్లు రానున్నాయి. ఆ ఇంజన్ల విషయానికొస్తే.. 115బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ పెట్రోల్, 115బిహెచ్‌పి ఇచ్చే 11.5-లీటర్ డీజల్ మరియు 140బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.4-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో కియా సెల్టోస్‌లో లభించే అవే గేర్‌బాక్స్‌లను యధావిధిగా అందించే ఛాన్స్ ఉంది. కాబట్టి, కస్టమర్లు క్రెటా మరియు సెల్టోస్ లభించే అన్ని వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకునే వారికోసం, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను సీవీటీ గేర్‌బాక్స్, 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ను ఐవీటీ గేర్‌బాక్స్ మరియు 1.4-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్‌ను 7-స్పీడ్ డీఎస్‌జీ గేర్‌బాక్స్‌ వెర్షన్‌లు అందుబాటులో ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

ధరలు

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో పాత హ్యుందాయ్ క్రెటా ధరల శ్రేణి రూ. 10 లక్షల నుండి రూ. 16 లక్షల మధ్య ఉంది. అయితే, 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ ధర వీటి కంటే ఎక్కువగా ఉంటుంది. దీని ధర సుమారుగా రూ.11 లక్షల నుండి రూ. 17.5 లక్షల మధ్య ఉండవచ్చు. విడుదల సమయానికి దీని ధరలను వేరియంట్ల వారీగా వెల్లడిస్తారు.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

కియా సెల్టోస్ విషయానికి వస్తే, ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.89 లక్షలు మరియు టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 17.34 లక్షల వరకూ ఉంది. గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: రెండింటిలో ఏది బెస్ట్?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ ఎస్‌యూవీలు సమవుజ్జీలనే చెప్పాలి, రెండింటిలో కూడా సమానంగా అనిపించే ఎన్నో అంశాలు ఉన్నాయి. రెండు మిడ్-సైజ్ ఎస్‌యూవీలను ఒకే ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేశారు. మరో విషయం ఏమిటంటే కియా మరియు హ్యుందాయ్ రెండు కంపెనీలు ఉమ్మడి సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

సెల్టోస్ మరియు క్రెటా కార్లలో ఏది మంచిదో తెలియాలంటే..? 2020 వెర్షన్ హ్యుందాయ్ క్రెటా విడుదల వరకూ వేచి ఉండాలి. దాంతో ఇంజన్, వేరియంట్లు మరియు ధరల వారీగా క్లారిటీ వస్తే బెస్ట్ మోడల్ ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
New Hyundai Creta 2020 Vs Kia Seltos Comparison: A Brief Look At What's Different Between The Two. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X