కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

భారతదేశంలో ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులర్ అయిన కంపెనీ కియా మోటార్స్. కియా నుంచి విడుదలైన అన్ని వాహనాలు మార్కెట్లో మంచి ప్రజాదరణను పొందాయి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలు చేపడుతున్న కంపెనీల జాబితాలో కియా ముందంజలో ఉంది.

కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

అతి తక్కువ వ్యవధిలో ఇంతటి ఘనత సాధించిన కియా ఇప్పుడు కొనసాగుతున్న 2020 ఆటో ఎక్స్‌పోలో మరలా ఒక కొత్త బ్రాండ్ ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త బ్రాండ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి...

కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

కొనసాదాగుతున్న 2020 ఆటో ఎక్స్‌పోలో కియా మోటార్స్ 'నిరో ఎలక్ట్రిక్ కార్" ని ఆవిష్కరించింది. ఇటీవల కాలంలో కియా మోటార్స్ ఉత్పత్తులు చాల వరకు ఎలక్ట్రికల్ ఉత్పత్తులనే తయారు చేస్తోంది. ఎందుకంటే రాబోయే తరాన్ని గుర్తుంచుకుని వినియోగదారుల అవసరాలను తీర్చడానికి సాంకేతికతతో ఎలక్ట్రానిక్ వాహనాల విభాగంలో తనకంటూ ఒక ప్రతిష్టను గుర్తించుకోవడానికి కృషి చేస్తోంది.

కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

కియా నిరో ఎలక్ట్రిక్ కారు యొక్క ఫీచర్స్ గమనిస్తే ఇందులో 7.0 అంగుళాల స్క్రీన్ కలిగిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే,ఆడియో సిస్టం, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటివి ఉంటాయి. ఇంకా వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ, లెదర్ తో చుట్టబడిన సీట్లు, డే అండ్ నైట్ మోడ్స్, బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది.

కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

భద్రత కోసం కియా ఈ ఎలక్ట్రిక్ మోడల్‌లో పెద్ద సంఖ్యలో ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుది. కియా మోటార్స్ యొక్క భవిష్యత్ భారతీయ తొలి మోడల్ కాబట్టి, ఈ ఎలక్ట్రిక్ కారు ధర మరియు భారత ప్రయోగ తేదీ గురించి ఎటువంటి వివరాలు విడుదల కాలేదు.

కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

ఈ నిరో ఎలక్ట్రిక్ మోడల్‌లో 180 ఏహెచ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారులో 64 కిలోవాట్ల లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారుతో, ఈ ఎలక్ట్రిక్ కారు 201 హెచ్‌పి పవర్ మరియు 291 ఎన్ఎమ్ టార్క్ ని పొందగలదు.

కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

కియా నిరో ఎలక్ట్రిక్ వెహికల్ 4,195 మి.మీ పొడవు, 1,800 మి.మీ వెడల్పు మరియు 1,605 మి.మీ ఎత్తు, 2,600 మి.మీ వీల్‌బేస్ తో ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది. చూడటానికి హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వెహికల్లాగ ఉంటుంది. ఇది చాలా విస్తృతంగా ఉంటుంది.

కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

ఇండియన్ మార్కెట్లో కియా మోటార్స్ కొత్త టెక్నాలజీతో చాలా అప్డేటెడ్ వెర్షన్ తో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. ఇవన్నీ బిఎస్-6 ఉద్గారప్రమాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఇండియా లో చాల సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలనే తయారు చేస్తున్నాయి. రాబోయే తరం ఎలక్ట్రిక్ యుగం అవుతుందంటే అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

కియా మోటార్స్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ చూసారా..?

భారతదేశంలో నిరో ఎలక్ట్రిక్ కారు ప్రారంభించడం గురించి కియా స్పష్టమైన అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో కియా తయారీకేంద్రంలో వీటి ఉత్పత్తి జరుగుతుందని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Kia highlights EV capabilities at Auto Expo 2020 with Soul EV, e-Niro. Read in telugu.
Story first published: Friday, February 7, 2020, 12:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X