కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇటీవలే తమ కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కొత్త (2021) టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ దాని డిజైన్, ఇంటీరియర్స్ మరియు ఫీచర్ల పరంగా సూక్ష్మమైన అప్‌డేట్స్‌ను కలిగి ఉంది, ఈ మార్పులతో ఇది మునుపటి కన్నా మరింత నూతనంగా అనిపిస్తుంది.

టొయోటా ఇన్నోవా క్రిస్టా గత కొంతకాలంగా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమ్‌పివిలో ఒకటిగా కొనసాగుతోంది. మొదటి తరం టొయోటా ఇన్నోవాను 2005లో తొలిసారిగా మార్కెట్లో విడుదల చేశారు. ఆ తర్వాత ఇందులో ఇన్నోవా 'క్రిస్టా' పేరుతో రెండవ తరం మోడల్ 2016లో విడుదల చేశారు. గడచిన 15 సంవత్సరాలుగా టొయోటా ఇన్నోవా భారత మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన ఎమ్‌పివిగా కొనసాగుతోంది.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

టొయోటా ఇప్పుడు తమ పాపులర్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది ధరల సవరణతో పాటు అనేక సూక్ష్మమైన మార్పులను కూడా కలిగి ఉంది. మరి ఈ కథనంలో కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టాకు మరియు దాని మునుపటి తరం మోడల్‌కు మధ్య ప్రధానమైన వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

డిజైన్

డిజైన్ పరంగా కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్‌లో మరీ భారీ మార్పులేవీ లేవు. దీని మొత్తం డిజైన్ సిల్హౌట్ మునుపటి తరం మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కాకపోతే, దీని ఫ్రంట్ ఎండ్ డిజైన్‌ను మాత్రం స్వల్పంగా మార్చారు. కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్‌తో వస్తుంది.

MOST READ:భారత్‌లో అడుగుపెట్టిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌ 5 ఎమ్ కాంపిటీషన్ : ధర & వివరాలు

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

ఇందులో పియానో ​​బ్లాక్‌లో ఫినిష్ చేసిన కొత్త ట్రాపెజోయిడల్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. గ్రిల్ చుట్టూ క్రోమ్ గార్నిష్ ఉంటుంది, ఇది హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లోకి అలాగే ఇరువైపులా చొప్పించినట్లుగా అనిపిస్తుంది. ఫ్రంట్ ఎండ్‌లో ఇప్పుడు ఫాగ్‌ల్యాంప్స్ చుట్టూ ఇప్పుడు ట్రైయాంగిల్ హౌసింగ్ ఉంటుంది, అలాగే దీని ఫ్రంట్ బంపర్‌ను కూడా రీడిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

ఫ్రంట్ ఎండ్‌లో మార్పులతో పాటుగా, కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టాలో ఇప్పుడు 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కొత్త గ్లోస్ బ్లాక్ స్పాయిలర్ మరియు రెండు చివర్లలో స్కిడ్ ప్లేట్స్ ఉంటాయి. కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టాలో ఇప్పుడు స్పార్క్లింగ్ బ్లాక్ క్రిస్టల్ షైన్ అనే కొత్త పెయింట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.

MOST READ:నుజ్జు నుజ్జయిన 25 కోట్ల విలువైన పగని కార్.. ఎలాగో తెలుసా

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

పైన పేర్కొన్న మార్పుల మినహా కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టాలో వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఈ ఎమ్‌పివి సైడ్ అండ్ రియర్ ప్రొఫైల్‌లో పెద్ద మార్పులు లేకుండా ఒకే రకమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్ కారణంగా ఇది దాని ముందు తరం మోడల్ కంటే ఎక్కువ పరిణతి చెందిన రూపాన్ని అందిస్తుంది.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

ఇంటీరియర్లు మరియు ఫీచర్లు

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఇంటీరియర్లను కూడా సూక్ష్మంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో ఇప్పుడు అప్‌డేటెడ్ డాష్‌బోర్డ్ ఉంటుంది. అయితే, ఓవరాల్ క్యాబిన్ రూపం మాత్రం మునుపటి తరం మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కొత్త ఇన్నోవా క్రిస్టా టాప్-ఎండ్ ‘జెడ్‌ఎక్స్' వేరియంట్‌లో కామెల్ టాన్ అప్‌హోలెస్ట్రీని అందిస్తున్నారు. దానికి దిగువ వేరియంట్లలో ఆల్-బ్లాక్ క్యాబిన్‌ లభిస్తుంది.

MOST READ:ఒకే కారుని 77 సంవత్సరాలు ఉపయోగించాడు.. ఇంతకీ అతడెవరో తెలుసా ?

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

కొత్త ఇన్నోవా క్రిస్టాలో ప్రధాన అప్‌డేట్‌గా ఇందులోని కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను చెప్పుకోవచ్చు. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇప్పుడు ‘స్మార్ట్ ప్లేకాస్ట్' అనే 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీలని సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మునుపటి తరం ఇన్నోవాలో లేవు.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

సేఫ్టీ పరంగా చూస్తే, కొత్త ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు ఫ్రంట్ క్లియరెన్స్ సోనార్‌ను కలిగి ఉంటుంది, ఇది ఎమ్ఐడిపై హెచ్చరికను చూపించడం ద్వారా పార్కింగ్ స్థలాల సమయంలో జరిగే ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇందులోని అన్ని ఇతర భద్రతా ఫీచర్లను పాత మోడల్ నుండి ముందుకు తీసుకెళ్లబడ్డాయి. టొయోటా ఇన్నోవా క్రిస్టాలోని కొన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లలో ఏడు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

ఇంజన్ మరియు గేర్‌బాక్స్

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజన్ మరియు గేర్‌బాక్స్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవి మునుపటి తరం మోడల్ నుండి అలానే ముందుకు తీసుకువెళ్లబడ్డాయి. కొత్త ఇన్నోవా క్రిస్టాలో అదే 2.7-లీటర్ పెట్రోల్ మరియు 2.4-లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. ఇవి రెండూ ఇటీవలే బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

ఇందులోని 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ 164 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఫైవ్-స్పీడ్ మాన్యువల్ మరియు సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో లభిస్తుంది. ఇకపోతే ఇందులోని 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 343 ఎన్ఎమ్ టార్క్ (మ్యాన్యువల్ గేర్‌బాక్స్) మరియు 360 ఎన్ఎమ్ టార్క్ (సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్)ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

ధర

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పివి ఇప్పుడు జిఎక్స్, విఎక్స్ మరియు జెడ్‌ఎక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త వేరియంట్ల ప్రారంభ ధర రూ.16.26 లక్షలు కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.24.33 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఇది దాని మునుపటి తరం ఇన్నోవా క్రిస్టా ధరలతో పోలిస్తే, కొత్త తరం మోడల్ సుమారు 60,000 రూపాయల పెరుగుదలను అందుకుంది. పాత తరం ఇన్నోవా క్రిస్టా ధరలు రూ.15.67 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమయ్యేవి.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

పోటీదారులు

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ఎమ్‌పివి విభాగంలో నేరుగా ఎలాంటి పోటీదారులు లేరు. ఇది ప్రీమియం ఎమ్‌పివి విభాగంలో కొనసాగుతుంది. అయితే, మార్కెట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా మరాజో, రెనాల్ట్ ట్రైబర్ వంటి మోడళ్లు దీనికి కాస్తంత పోటీని ఇచ్చే ఆస్కారం ఉంది.

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

పాత vs కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా ఇన్నోవా భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి, ఈ విభాగంలో ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమ్‌పివిగా కొనసాగుతోంది. కొత్తగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టాలో చేసిన మార్పులు సూక్ష్మమైనవే అయినప్పటికీ, ఇది మునుపటి కన్నా మరింత ప్రీమియంగా అనిపిస్తుంది, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది.

Most Read Articles

English summary
Take a look at the comparision between new 2021 Innova Crysta facelift and the old Innova. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X