2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా తమ సరికొత్త 2021 యారిస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్లలో టొయోటా వియోస్ పేరుతో విక్రయిస్తున్నారు. కొత్త టొయోటా యారిస్ కారు ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్లలో పెను మార్పులు ఉన్నాయి, అలాగే ఇందులో కొత్త ఫీచర్లు, పరికరాలను కూడా జోడించారు.

2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

ముందుగా కొత్త 2021 టొయోటా యారిస్ కారు బయటి వైపు చేసిన మార్పులను గమనిస్తే, ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న యారిస్ ఫ్రంట్ డిజైన్‌తో పోల్చితే దీని మొత్తం ఫ్రంట్ డిజైన్‌లో అనేక మార్పులు ఉన్నాయి. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, అందులోనే అమర్చిన డేటైమ్ రన్నింగ్ లైట్స్‌ను చిత్రాల్లో చూడొచ్చు. ఇవి మునుపటి కంటే అధునాతనంగా కనిపిస్తాయి.

2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

లెక్సస్ మోడళ్ల నుంచి స్పూర్తి పొంది డిజైన్ చేసిన పెద్ద ‘స్పిండిల్-గ్రిల్' డిజైన్‌ను ఇందులో చూడొచ్చు. అలాగే, బంపర్‌కు ఇరువైపులా స్టయిలిష్‌గా డిజైన్ ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, గుండ్రటి ఎల్ఈడి ఫాగ్‌ల్యాంప్‌లను ఇందులో గమనించవచ్చు.

MOST READ:శ్రామిక్ ట్రైన్స్ వల్ల ఇండియన్ రైల్వే ఎంత వసూలు చేసిందో తెలుసా ?

2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

కొత్త 2021 యారిస్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ మరియు రియర్ ప్రొఫైల్స్‌ని గమనిస్తే, ఇందులో పెద్దగా మార్పు లేదనిపిస్తుంది. ఈ డిజైన్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, అల్లాయ్ వీల్స్ డిజైన్ మాత్రం రిఫ్రెష్ చేశారు. సింపుల్ బాడీ లైన్స్‌‍తో ఇది సరళమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

కొత్త టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్‌లో అనేక కొత్త ఫీచర్లు, పరికరాలను జోడించారు. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్‌ని సపోర్ట్ చేసే సరికొత్త-తరం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు రీడిజైన్ చేసిన అప్‌హోలెస్ట్రీ, ఏడు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

అంతేకాకుండా, ఈ కొత్త మోడల్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, వెనుక సీటులోని ప్యాసింజర్ల కోసం రూఫ్-మౌంటెడ్ ఎసి వెంట్స్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లను ప్రస్తుత వెర్షన్ నుండి అలానే కొనసాగించారు.

2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే అప్‌డేటెడ్ టయోటా వియోస్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో ఒకటి 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరొకటి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్. కొత్త 2021 వెర్షన్‌లో కూడా ఇవే ఇంజన్లను కొనసాగించారు.

MOST READ:డ్రైవర్ భాగస్వాముల కోసం ఓలా 'డ్రైవ్ ది డ్రైవర్' ఫండ్

2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

ఇక భారత మార్కెట్ విషయానికి వస్తే, ప్రస్తుత టయోటా యారిస్ సెడాన్ ఒకేరకమైన ఇంజన్ (1.5-లీటర్ పెట్రోల్)తో లభిస్తోంది. ఈ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 107 బిహెచ్‌పి శక్తిని మరియు 143 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, వచ్చే ఏడాది ఇండియా లాంచ్!

కొత్త 2021 టొయోటా యారిస్ (వియోస్) ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త 2021 టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ (వియోస్ అని కూడా పిలుస్తారు) భవిష్యత్తులో భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది ఇప్పట్లో విడుదల కాకపోవచ్చు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా. భారత మార్కెట్లో టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఈ సెగ్మెంట్లోని ఐదవ తరం హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కోడా రాపిడ్, మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:బైకర్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన జయ బచ్చన్ : ఎందుకంటే ?

Most Read Articles

English summary
Toyota has unveiled the 2021 Yaris facelift, also called the 'Vios' in international markets. The new Toyota Yaris facelift comes with a host of updates in terms of design, added features and a bunch of other subtle changes all around the sedan. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X