Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 1 నుండి పెరగనున్న రెనో కార్ల ధరలు; డిసెంబర్ ఆఫర్లు
కొత్త సంవత్సరంలో రెనో అందిస్తున్న అన్ని కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరి 1, 2021వ తేదీ నుండి భారత్‌లో తాము విక్రయిస్తున్న మొత్తం ప్రోడక్ట్ లైనప్ ధరలను పెంచనున్నామని రెనో ఇండియా ప్రకటించింది.

ప్రస్తుతం రెనో ఇండియా, దేశీయ విపణిలో మూడు మోడళ్లను విక్రయిస్తోంది. అవి: క్విడ్, ట్రైబర్ మరియు డస్టర్. ఈ మూడు మోడళ్ల ధరలను రూ.28,000 వరకు పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఈ ధరల పెరుగుదల మోడల్ మరియు వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మరియు ఇతర అనుబంధ వ్యయాల పెరుగుదల కారణంగా, తమ ఉత్పత్తులను ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ తెలిపింది.
MOST READ:కేవలం 10 నిమిషాల్లో మొత్తం అమ్ముడైన జిఎంసి హమ్మర్ ఈవి పికప్ ట్రక్

ప్రస్తుతం సంవత్సరం ద్వితీయార్ధంలో రెనో ఇండియా తమ ప్రోడక్డ్ లైనప్‌లో కొత్త వేరియంట్లను చేర్చడం వలన భారతదేశంలో తమ అమ్మకాలు బలోపేతం అయ్యాయని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త వేరియంట్లలో డస్టర్ టర్బో మరియు క్విడ్ నియో-టెక్ ఎడిషన్ మరియు ట్రైబర్ ఏఎమ్‌టి వేరియంట్లు ఉన్నాయి.

ప్రస్తుతం , మార్కెట్లో రెనో అందిస్తున్న క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.2.99 లక్షల నుంచి రూ.5.12 లక్షల మధ్యలో ఉండగా, రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి ధరలు రూ.5.12 లక్షల నుంచి రూ.7.34 లక్షల మధ్యలోనూ మరియు డస్టర్ ఎస్‌యూవీ ధరలు రూ.8.59 లక్షల నుంచి రూ.13.59 లక్షల మధ్యలోనూ ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ:2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

కాగా, రెనో ఇండియా భారత మార్కెట్లో తమ నాల్గవ ఉత్పత్తిగా ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. రెనో కిగర్ పేరుతో రానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానుంది. ఇధి ఈ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ఇదిలా ఉంటే,ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ డిసెంబర్ 2020 నెలలో ఇయర్ ఎండ్ ఆఫర్లలో భాగంగా, తమ ఉత్పత్తులపై భారీ మొత్తంలో రూ.70,000 వరకూ డిస్కౌంట్లు మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, వివిధ ప్రయోజనాలు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు మరియు అనేక ఇతర ఆఫర్‌లను కంపెనీ అందిస్తోంది.
MOST READ:హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ డిసెంబర్ నెలలో గరిష్టంగా రూ.70,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పాటుగా పలు రకాల ఫైనాన్స్ ఆప్షన్లు కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2020 వరకూ చెల్లుబాటులో ఉంటాయి.

రెనో క్విడ్
రెనో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌పై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ.45,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి. ఇవే కాకుండా, రెనో క్విడ్‌పై కంపెనీ రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.
MOST READ:ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

రెనో ట్రైబర్
రెనో ఇండియా అందిస్తున్న బడ్జెట్-ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎమ్‌పివి రెనో ట్రైబర్‌పై కంపెనీ గరిష్టంగా రూ.50,000 వరకూ విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి. లభిస్తుంది. రెనో క్విడ్ మాదిరిగానే, ట్రైబర్ ఎమ్‌పివిపై కూడా కంపెనీ రూ.9,000ల కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

రెనో డస్టర్
రెనో అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ డస్టర్ టర్బో వేరియంట్‌పై రూ.70,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో కార్పొరేట్ డిస్కౌంట్ రూ.30,000 మరియు 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ఈజీ కేర్ ప్యాకేజీ ఇవ్వబడుతోంది. ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 వరకు నగదు తగ్గింపు మరియు రూ.20,000 వరకూ లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి.

ఇకపోతే, రెనో డస్టర్ డీజిల్ వేరియంట్లపై కంపెనీ రూ.50,000 వరకూ విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 కార్పోరేట్ డిస్కౌంట్‌తో పాటు, రూ.20,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి. కాకపోతే, డీజిల్ వేరియంట్లపై కంపెనీ ఎలాంటి క్యాష్ డిస్కౌంట్లను ఆఫర్ చేయడం లేదు.