Just In
Don't Miss
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి వాయిదా పడిన రెనో ట్రైబర్ టర్బో వేరియంట్ విడుదల - వివరాలు
భారతదేశంలో రెనో ట్రైబర్ టర్బో-పెట్రోల్ వేరియంట్ విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ట్రైబర్ కాంపాక్ట్-ఎంపివి యొక్క పెర్ఫార్మెన్స్ వేరియంట్‌గా ఇందులో ఓ టర్బో-పెట్రోల్ వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు రెనో ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసినదే.

తాజాగా, ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన సమాచారం ప్రకారం, 2021లో ట్రైబర్‌లో ఈ కొత్త ఇంజన్ ఆప్షన్‌ను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. రెనో నుండి రానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్‌లో కూడా ఈ కొత్త ఇంజన్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్‌ను హెచ్‌ఆర్ 10 అనే కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. ఈ ఇంజన్‌ను రెనో మరియు నిస్సాన్ కంపెనీలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. నిస్సాన్ నుండి వచ్చిన మాగ్నైట్ మరియు రెనో నుండి రానున్న కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఈ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.
MOST READ:హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

ఇరు కంపెనీలు కలిసి తయారు చేస్తున్న ఈ 1.0-లీటర్ త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

భారత మార్కెట్లో రెనాల్డ్ డస్టర్ మరియు నిస్సాన్ కిక్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో ఉపయోగిస్తున్న హెచ్ఆర్13 టర్బో పెట్రోల్ ఇంజన్ నుండి అందులో తక్కువ డిస్‌ప్లేస్‌మెంట్ కలిగిన హెచ్ఆర్10 ఇంజన్‌ను తయారు చేస్తున్నారు. కొత్త టర్బో ఇంజన్ రాకతో దేశంలో ట్రైబర్ అమ్మకాలు పెరుగుతాయని రెనో ఆశిస్తోంది.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

రెనో ట్రైబర్ కాంపాక్ట్-ఎమ్‌పివి విషయానికి వస్తే, ఈ సబ్-ఫోర్ మీటర్ వాహనాన్ని సిఎమ్ఎఫ్-ఏ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది 3,990 మిమీ పొడవు, 1,739 మిమీ వెడల్పు, 1,643 మిమీ ఎత్తు, 2,636 మిమీ వీల్ బేస్ మరియు 182 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఎమ్‌పివి ముందు భాగంలో హాలోజన్ బల్బులతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్ ఉంటుంది. ఫాగ్ లైట్ల స్థానంలో బంపర్ దిగువ భాగంలో ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్‌ను అమర్చారు. ట్రైబర్‌కు ప్రీమియం లుక్ ఇవ్వడానికి, కంపెనీ గ్రిల్‌పై, హెడ్‌లైట్ హౌసింగ్ లోపల మరియు డిఆర్‌ఎల్‌ల చుట్టూ క్రోమ్ యాక్సెంట్‌లతో గార్నిష్ చేసింది.
MOST READ:భారత మార్కెట్లో డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ బిఎస్ 6 బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ట్రైబర్ ఎమ్‌పివి ఇంటీరియర్స్‌లో డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్ మరియు సీట్స్ ఉంటాయి. ఇంటీరియర్ ప్రీమియం లుక్‌ని పెంచడానికి డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ట్రిమ్స్‌పై సిల్వర్ యాక్సెంట్స్ కూడా ఉంటాయి. డ్యాష్‌బోర్డ్ సెంటర్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

ప్రస్తుతం రెనో ట్రైబర్ ఎమ్‌పివి కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని 1.0-లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 70 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:దీపావళి ఆఫర్స్ ప్రకటించిన హీరో మోటోకార్ప్

రెనో ట్రైబర్ టర్బో వేరియంట్ విడుదల వాయిదాపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుతం భారత్‌లో టర్బో పెట్రోల్ ఇంజన్లను అత్యంత ప్రాచుర్యం పొందాయి. డీజిల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా కస్టమర్లను టర్బో పెట్రోల్ ఇంజన్లను ఎంచుకుంటున్నారు. రెనో ట్రైబర్ ఈ విభాగంలో అత్యంత సరసమైన ధరకే లభించే బెస్ట్ సెవన్ సీటర్ ఎమ్‌పివి. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, ఇది సౌకర్యవంతంగానే అనిపిస్తుంది మరియు మంచి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కొత్త టర్బో వేరియంట్ అందుబాటులోకి వస్తే అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.