5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

ఫ్రెంచ్ దిగ్గజం రెనో క్విడ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ తరువాత ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం తీసుకొచ్చిన రెండవ మోడల్ రెనో ట్రైబర్. సబ్-4-సీటర్ సెగ్మెంట్లోనే మూడు వరుసల సీటింగ్‌తో తీసుకొచ్చి భారీ విజయాన్ని అందుకుంది. క్విడ్ తర్వాత రెనో కంపెనీకి ఆ తరహా సక్సెస్ సాధించిపెట్టిన మోడల్ రెనో ట్రైబర్, ఒక రకంగా చెప్పాలంటే క్విడ్ కంటే కూడా ట్రైబర్ మోడల్ రెనోకు ఎంతో ముఖ్యమైన మోడల్.

5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

కేవలం 4.95 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన రెనో ట్రైబర్ సేల్స్ పరంగా రెనో ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ప్రతినెలా అగ్రస్థానంలో నిలుస్తోంది. రెనో ట్రైబర్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం.. రెనో ట్రైబర్‌లో బెస్ట్ వేరియంట్ ఏది? ఇవాళ్టి స్టోరీలో వేరియంట్ల వారీగా ధరలు, ఫీచర్లు మరియు ఏ వేరియంట్ బెస్ట్ అనేది తెలుసుకుందాం రండి...

5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

రెనో ట్రైబర్ సాంకేతికంగా 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది. ఇందులో ఎలాంటి డీజల్ ఇంజన్ ఆప్షన్స్ లేవు. కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 72బిహెచ్‌పి పవర్ మరియు 92ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

సీటింగ్ లేఔట్ విషయానికి వస్తే, ఇది 5-సీటర్ లైఫ్ మోడ్, 7-సీటర్ ట్రైబ్ మోడ్, 4-సీటర్ సర్ఫ్ మోడ్ మరియు 2-సీటర్ క్యామ్ మోడ్. ఇలా నాలుగు విభిన్న సీటింగ్ లేఔట్లోకి సీటింగ్ కాంబినేషన్‌ను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది రెనో ట్రైబర్.

5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

మైలేజ్ పరంగా ఈ సెగ్మెంట్లో రారాజు అని చెప్పాలి. ఏఆర్ఏఐ మేరకు రెనో ట్రైబర్ 7-సీటర్ ఎంపీవీ లీటర్‌కు 20కిమీల మైలేజ్ ఇస్తుంది. ఫ్యామిలీతో లాంగ్ డ్రైవింగ్ వెళ్లేందుకు 625-లీటర్ల అద్భుతమైన స్టోరేజ్ కెపాసిటీ కలదు.

5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

రెనో ట్రైబర్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. వేరియంట్ల వారీగా రెనో ట్రైబర్ ఎంపీవీ ధరలు ఇలా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఇవ్వబడ్డాయ.

  • రెనో ట్రైబర్ RXE ధర రూ. 4.95 లక్షలు
  • రెనో ట్రైబర్ RXT ధర రూ. 5.49 లక్షలు
  • రెనో ట్రైబర్ RXL ధర రూ. 5.99 లక్షలు
  • రెనో ట్రైబర్ RXZ ధర రూ. 6.49 లక్షలు
  • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

    రెనో ట్రైబర్ RXE వేరియంట్లోని ఫీచర్లు

    • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు
    • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
    • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
    • డ్రైవర్ కోసం లోడ్ లిమిటర్ మరియు ప్రి-టెన్షనర్
    • స్పీడ్ అలర్ట్ వార్నింగ్
    • డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్
    • రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
    • వీల్ ఆర్చ్ ప్లాస్టిక్ క్లాడింగ్
    • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?
      • బాడీ కలర్ బంపర్లు
      • డ్యూయల్ డోన్ డ్యాష్‌బోర్డ్
      • ఎల్ఈడీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
      • బ్లాక్ ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే మరియు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్
      • ఫ్రంట్ పవర్ విండోలు
      • మొదటి వరుసలో ఏసీ వెంట్స్
      • అడ్జెస్ట్ చేసుకునే వీలున్న రెండో వరుస సీట్లు
      • 60:40 నిష్పత్తిలో మడిపే అవకాశం ఉన్న రెండో వరుస సీట్లు
      • సెంటర్ కన్సోల్ మీద ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ రిలీజ్ బటన్
      • మొదటి వరుసలో 12V పవర్ సాకెట్
      • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

        రెనో ట్రైబర్ RXL వేరియంట్లోని ఫీచర్లు

        RXE వేరియంట్లో లభించే ఫీచర్లతో పాటు RXT వేరియంట్లో అదనంగా లభించే ఫీచర్లు

        • బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్
        • కారు చుట్టూ అంచుల వద్ద ప్లాస్టిక్ క్లాడింగ్
        • డోర్ల మీద బ్లాక్ డీకాల్స్
        • బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల B మరియు C-పిల్లర్లు
        • బాడీ కలర్ ఫినిషింగ్ గల సైడ్ మిర్రర్లు
        • క్రోమ్ ఎలిమెంట్స్ గల ఫ్రంట్ గ్రిల్
        • పియానో బ్లాక్ ఫినిషింగ్ గల డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్
        • శాటిన్ ఔట్‌లైన్ గల సైడ్ ఎయిర్ వెంట్స్
        • శాటిన్ ఔట్‌లైన్ గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
        • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?
          • ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే వీలున్న టిల్ట్ స్టీరింగ్ వీల్
          • రెండు మరియు మూడో వరుస కోసం ఏసీ వెంట్స్
          • రెండవ మరియు మూడో వరుస సీట్లకు రియర్ అసిస్ట్ గ్రిప్
          • సెంటర్ కన్సోల్ మీద కూల్డ్ స్టోరేజ్
          • రిమోట్ సెంట్రల్ లాకింగ్
          • మ్యాన్యువల్‌గా అడ్జెస్ట్ చేసుకునే సైడ్ మిర్రర్లు
          • బ్లూటూత్ కనెక్టివిటీ గల ఆర్&గో మ్యూజిక్ సిస్టమ్డ్
          • డ్యూయల్ ఫ్రంట్ స్పీకర్లు
          • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్
          • ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్స్
          • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

            రెనో ట్రైబర్ RXT వేరియంట్లోని ఫీచర్లు

            RXE, RXL వేరియంట్లలో లభించే ఫీచర్లతో పాటు RXT వేరియంట్లో అదనంగా లభించే ఫీచర్లు

            • 8-ఇంచుల మీడయా-నవ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
            • వెనుక వైపున 2 స్పీకర్లు
            • పగలు మరియు రాత్రి వేళల్లలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్
            • రియర్ క్యాబిన్ లైటింగ్
            • అప్పర్ గ్లోవ్ బాక్స్
            • కూల్డ్ లోయర్ గ్లోవ్ బాక్స్
            • డ్రైవర్ సీట్ కింద సీట్ డ్రాయర్
            • ప్యాసింజర్ వైపున వ్యానిటీ మిర్రర్
            • రెండో వరుసలో 12V ఛార్జింగ్ సాకెట్
            • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?
              • ట్రిపుల్ ఎడ్జ్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్
              • 50కేజీల లోడ్ కెపాసిటీ గల రూఫ్ రెయిల్స్
              • ముందు మరియు వెనుక వైపున స్కిడ్ ప్లేట్లు
              • ముందు వైపున క్రోమ్ ఫినిషింగ్ గల ఎయిర్ వెంట్స్
              • క్రోమ్ సెమీ ఔట్‌లైన్ గల ఎల్ఈడీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
              • ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే
              • ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్లు
              • ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోలు
              • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

                రెనో ట్రైబర్ RXZ వేరియంట్లోని ఫీచర్లు

                RXE, RXL మరియు RXT వేరియంట్లలో లభించే ఫీచర్లతో పాటు RXZ వేరియంట్లో లభించే ఫీచర్లు

                • ముందు వైపున 2 ట్వీటర్లు
                • పుష్-బటన్ స్టార్ట్/స్టాప్
                • రియర్ వాషర్, వైపర్ మరియు డీఫాగర్
                • ఆటో అప్/డౌన్ డ్రైవర్ విండో
                • రియర్ వ్యూవ్ కెమెరా
                • డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్
                • మూడో వరుసలో 2V సాకెట్
                • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?
                  • నాలుగు ఎయిర్ బ్యాగులు
                  • అల్లాయ్ వీల్స్
                  • పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు
                  • సిల్వర్ సొబగులు గల డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డు
                  • క్రోమ్ ఫినిషింగ్ గల బ్రేక్ బటన్, గేర్ రాడ్, ఫ్రంట్ ఏసీ వెంట్స్ మరియు పుష్-బటన్ ఔట్‌లైన్
                  • ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ చుట్టూ పియానో బ్లాక్ ఫినిషింగ్
                  • డోర్లకు లోపలివైపున సిల్వర్ ఫినిష్ హ్యాండిల్స్ మరియు స్టీరింగ్ వీల్
                  • 3డీ స్పేసర్ ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే
                  • 5 లక్షలకే రెనో ట్రైబర్ 7-సీటర్: ఇంతకీ ఏ వేరియంట్ బెస్ట్?

                    ధరలు మరియు ఫీచర్లను పరిశీలిస్తే ఒక్కో వేరియంట్ మధ్య రూ. 50 వేలు తేడా ఉంది. మిడ్ మరియు టాప్ వేరియంట్లుగా ఉన్న RXT మరియు RXZ వేరియంట్లలో దాదాపు అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్,సేఫ్టీ మరియు సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అద్దెకు నడుపుకోవడానికైతే తొలి వేరియంట్లను ఎంచుకోవచ్చు ఫ్యామిలీ అవరాసలకైతే ఓ లక్షా.. లక్ష్నర ఎక్కువైనా మిడ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో ఏదో ఒకటి ఎంచుకోవడం బెస్ట్. అన్ని వేరియంట్లలో 7 మంది ప్రయాణించే సీటింగ్ లేఔట్ లభిస్తోంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Triber: Which variant to buy. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X