Just In
Don't Miss
- Sports
BWF World Tour Finals 2021: టైటిల్‌పై సింధు, శ్రీకాంత్ గురి
- News
ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే
- Movies
పునర్నవితో అందుకే దూరం.. అన్ని మింగాల్సి వచ్చింది: అసలు మ్యాటర్ రివీల్ చేసిన రాహుల్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ రెనో కారు వింటర్‌కి సిద్ధంగా లేదా? అయితే, ఈ సర్వీస్ క్యాంప్ మీ కోసమే..
రెనో ఇండియా దేశంలో 'రెనో వింటర్ క్యాంప్' పేరిట కొత్త వెహికల్ సర్వీస్ అండ్ మెయింటినెన్స్ క్యాంపైన్‌ను ప్రకటించింది. భారతదేశంలోని తమ వినియోగదారులకు ఇబ్బంది లేని యాజమాన్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ సర్వీస్ క్యాంప్ నవంబర్ 23, 2020వ తేదీ నుండి నవంబర్ 29, 2020వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రెనో సర్వీస్ సెంటర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వివరించింది. వారం రోజుల పాటు జరిగే ఈ సర్వీస్ క్యాంప్‌లో 475కి పైగా ఉన్న సర్వీస్ టచ్‌పాయింట్ల ద్వారా అన్ని రెనో కార్ల కోసం సమగ్ర చెక్-అప్‌ను అందించనున్నారు.

దేశంలో కొనసాగుతున్న శీతాకాలంలో ఈ ప్రత్యేక సర్వీస్ క్యాంపైన్ రెనో వాహనాల మెయింటినెన్స్ అవసరాలను తీర్చగలదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి, ఈ పరిస్థితుల్లో వాహనాలు సజావుగా పనిచేయాలంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

రెనో ఇండియా అందిస్తున్న వెహికల్ మెయింటినెన్స్‌తో పాటుగా, కంపెనీ వివిధ రకాల వాహన సేవలపై 50 శాతం వరకూ తగ్గింపును కూడా అందిస్తోంది. వాహనాన్ని శుభ్రపరచడం, క్రిమిసంహారకం (శానిటైజ్) చేయటం మరియు కస్టమర్ డిటేలింగ్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.

దీనికి అదనంగా, రెనో తమ వినియోగదారుల కోసం ఎంపిక చేసిన యాక్ససరీస్‌పై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోండగా, ఎంచుకున్న విడిభాగాలపై 10 శాతం ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా, లేబర్ ఛార్జీలపై 15 శాతం తగ్గింపును మరియు 10 శాతం తగ్గింపుతో అందించే ‘రెనో సెక్యూర్' ఎక్స్‌టెండెడ్ వారంటీ మరియు (ఆర్‌ఎస్‌ఏ) రోడ్-సైడ్ అసిస్టెన్స్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

రెనో వింటర్ సర్వీస్ క్యాంప్‌లో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి, ఇవి దేశంలో మై రెనో యాప్ రిజిస్టర్డ్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందించబడతాయి. ఇందులో ఎంపిక చేసిన బ్రాండ్ల నుండి టైర్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు మరియు ఇంజన్ ఆయిల్ రీప్లేస్‌మెంట్‌పై 5 శాతం తగ్గింపు మరియు విడి భాగాలు, ఉపకరణాలపై తగ్గింపులు ఉన్నాయి.

రెనో డీలర్‌షిప్, సర్వీస్ సెంటర్స్ మరియు ఇతర కస్టమర్ టచ్‌పాయింట్ల వద్ద కంపెనీ ఉద్యోగులు మరియు వినియోగదారుల భద్రత కోసం, ప్రభుత్వం నిర్ధారించిన అన్ని కోవిడ్-19 మార్గదర్శకాలను కంపెనీ పాటిస్తోంది. అంతేకాకుండా, ఈ సర్వీస్ క్యాంప్ సమయంలో రెనో డీలర్‌షిప్‌ను సందర్శించే వినియోగదారులకు కారు పెర్ఫ్యూమ్‌తో పాటు రక్షిత ఫేస్ మాస్క్‌ల ప్యాక్ కూడా కంపెనీ అందిస్తోంది.

ఈ సర్వీస్ క్యాంప్‌లో పాల్గొనే కస్టమర్లకు కంపెనీ అష్షూర్డ్ గిఫ్ట్‌లను కూడా అందిస్తోంది. రెనో దేశవ్యాప్తంగా విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. తాజా నివేదికల ప్రకారం, రెనో 415 సేల్స్ అండ్ 475+ సర్వీస్ టచ్ పాయింట్లను కలిగి ఉంది వీటిలో దేశవ్యాప్తంగా 200+ వర్క్‌షాప్ ఆన్ వీల్స్ కూడా ఉన్నాయి.

రెనో వింటర్ సర్వీస్ క్యాంప్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఈ వింటర్‌లో మీ రెనో కారును సిద్ధంగా ఉంచుకునేందుకు మరియు తగ్గింపు ధరల్లో కారును మరమ్మత్తు చేయించుకునేందుకు రెనో వింటర్ సర్వీస్ క్యాంప్ మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ వింటర్ సర్వీస్ క్యాంప్‌లో కంపెనీ డిస్కౌంట్లను కూడా అందిస్తుంది, ఇది కస్టమర్లు తమ కార్లను సర్వీస్ చేయటానికి డబ్బు ఆదా చేయడానికి సహాయపడుతుంది.