Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్‌లు ఇవే.. వివరాలు
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్‌లు కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోవడం లేదు. హ్యాచ్‌బ్యాక్‌లు కూడా అత్యధిక సంఖ్యలో అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. గడచిన నవంబర్ 2020 నెలలో హ్యాచ్‌బ్యాక్ విభాగం అమ్మకాల పరంగా ముందజలో ఉంది.
ఈ కథనంలో గడచిన నవంబర్ 2020 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాను మీ ముందుకు తీసుకువస్తున్నాయి. ఎప్పటి లాగే మారుతి సుజుకినే ఈ విభాగంలో కూడా ముందజలో ఉంది. ఈ జాబితాలో మొదటి ఐదు మోడళ్లు ఈ బ్రాండ్‌కి చెందినవి కావటం విశేషం.

గడచిన నవంబర్ 2020 నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ సమయంలో కంపెనీ మొత్తం 18,498 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) ఈ మోడల్ అమ్మకాలు 19,134 యూనిట్లుగా నమోదై 4 శాతం క్షీణతను నమోదు చేశాయి.

మారుతి సుజుకి తమ ప్రీమియం అవుట్‌లెట్స్ నెక్సా ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. నవంబర్ 2020లో కంపెనీ మొత్తం 17,872 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) ఈ మోడల్ అమ్మకాలు 18,047 యూనిట్లుగా నమోదై 1 శాతం క్షీణతను నమోదు చేశాయి.
MOST READ:ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

మారుతి సుజుకి వాగన్ఆర్ గడచిన నెలలో 16,256 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) ఈ మోడల్ అమ్మకాలు 14,650 యూనిట్లుగా నమోదై 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఇకపోతే, భారతదేశపు అత్యంత ఫేవరేట్ కారు అయిన మారుతి సుజుకి ఆల్టో టాప్-10 హ్యాచ్‌బ్యాక్స్ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. గడచి నవంబర్ నెలలో మొత్తం 15,321 యూనిట్ల ఆల్టో కార్లు అమ్మడై, అందుకు ముందు సవంత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇటీవలే మారుతి సుజుకి యొక్క ఆల్టో 4 మిలియన్ (40 లక్షల యూనిట్ల) అమ్మకాల మార్కును చేరుకుంది.
MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 గడచిన నవంబర్ 2020 నెలలో మొత్తం 10,936 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) ఈ మోడల్ అమ్మకాలు 10,186 యూనిట్లుగా నమోదై 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 గత నెలలో మొత్తం 9,096 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ ఇటీవలే ఇందులో ఓ సరికొత్త 2020 మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త హ్యుందాయ్ ఐ20 ఇప్పుడు మునుపటి వెర్షన్ కన్నా మరింత ప్రీమియంగా, స్టైలిష్‌గా అనిపిస్తుంది. ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే 25,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి.
MOST READ:డ్రీమ్ కార్లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

మారుతి సుజుకి అందిస్తున్న ఎస్-ప్రెస్సో గడచిన నవంబర్ 2020 నెలలో మొత్తం 7,018 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒక పొడవైన రైడింగ్ హ్యాచ్‌బ్యాక్, చూడటానికి ఇదొక చిన్నసైజు ఎస్‌యూవీ మాదిరిగా అనిపిస్తుంది. గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేశారు.

ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి సెలెరియో. గడచిన నవంబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం 6,533 యూనిట్ల సెలెరియో కార్లను విక్రయించింది. కాగా, సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి నుంచి రానున్న కొత్త 2020 సెలెరియో పూర్తిగా కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్స్, సరికొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది.
MOST READ:సాధారణ కారుని సోలార్ కార్గా మార్చిన ఘనుడు.. పూర్తి వివరాలు

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా అల్ట్రోజ్ గడచిన నవంబర్ 2020 నెలలో మొత్తం 6260 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలోనే టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ కారులో కొత్త ఎక్స్‌ఎమ్ ప్లస్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధరను రూ. 6.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

ఇకపోతే, చివరిగా టాటా టియాగో గడచి నెలలో 5890 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. టాటా మోటార్స్ అందిస్తున్న ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్లో కంపెనీ సైలెంట్‌గా కొత్తగా ఫీచర్లను జోడించింది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో డోర్ లాక్ డిజైన్ మరియు డోర్ ట్రిమ్స్ డిజైన్‌ను కంపెనీ ఇటీవలే అప్‌డేట్ చేసింది.

నవంబర్ 2020లో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్‌లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మాదిరిగా, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కూడా మంచి పోటీని కలిగి ఉంది. మరోవైపు ఇటీవలి కాలంలో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కొత్త మోడళ్లు వచ్చి చేరుతున్న నేపథ్యంలో, రానున్న నెలల్లో ఈ విభాగంలో అమ్మకాలు ఏవిధంగా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.