Just In
- 1 hr ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 1 hr ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 3 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 4 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్‌కు బరోడా!
- Finance
మైల్స్టోన్ బడ్జెట్: కొత్త ఉద్యోగాలపై సీఈవోలు ఏమన్నారంటే? ఆ ఖర్చులపై ఆందోళన
- News
ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డ
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడుదలకు ముందే లీకైన 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్' ఫొటోలు, వివరాలు
టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'ఫార్చ్యూనర్'లో కంపెనీ 'లెజెండర్' పేరిట ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ విడుదలకు ముందే, దానికి సంబంధించిన ఫొటోలు మరియు వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

గాడివాడి విడుదల చేసిన స్పై చిత్రాలను గమనిస్తే, భారత మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉన్న టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీని ఇందులో చూడొచ్చు. బెంగుళూరులో ఈ కొత్త వేరియంట్ టెలివిజన్ కమర్షియల్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఫొటోలు లీకైనట్లుగా తెలుస్తోంది.

స్టాండర్డ్ మోడల్ ఫార్చ్యూనర్‌తో పోల్చుకుంటే ఈ ఫార్చ్యూనర్ లెజెండర్ మోడల్‌లో అనేక రకాల మార్పులు చేర్పులు ఉన్నాయి. దీనిని పూర్తిగా రీడిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ కంపెనీ వచ్చే ఏడాది (2021) ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని సమాచారం.
MOST READ:యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఫ్రంట్ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇందులో కొత్త రకం ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్‌ను ఉపయోగించారు. ఈ హెడ్‌ల్యాంప్స్‌లోనే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇందులో బంపర్‌పై డైనమిక్ ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి.

ఇందులోని ఇతర మార్పులలో మందు వైపు సెంటర్‌లో ‘టొయోటా' బ్యాడ్జింగ్‌తో కూడిన కొత్త సన్నటి ఫ్రంట్ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, ఫ్రంట్ బంపర్‌కు ఇరువైపులా చిన్నగా ఉండే ఫాగ్ ల్యాంప్స్ మరియు విభిన్నమైన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బంపర్‌పై క్రోమ్ గార్నిష్ మరియు క్రింది భాగంలో సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్, కొత్త 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

ఇంటీరియర్ ఫీచర్లు గమనిస్తే, టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ అదనపు ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సీట్లపై ప్రీమియం డ్యూయల్-టోన్ అప్‌హోలెస్ట్రీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లేన్-డిపార్చర్ అలెర్ట్, క్రూయిజ్ కంట్రోల్ మరియు మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ స్టాండర్డ్ వెర్షన్ ఫార్చ్యూనర్ కన్నా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యం కానుంది.
MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్‌ను స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌కి ఎగువన విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే ఇది విడుదల కావచ్చని సమాచారం. అదే సమయంలో స్టాండర్డ్ ఫార్చ్యూనర్ ఎస్‌యూనీ కూడా కంపెనీ కొత్తగా అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.

ఫార్చ్యూనర్ లెజెండర్‌లోని అదనపు ఫీచర్ల కారణంగా ఇది స్టాండర్డ్ ఫార్చ్యునర్ కంటే అధిక ధరను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. మార్కెట్లో దీని ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.40 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది భారత మార్కెట్లో ఎమ్‌జి గ్లోస్టర్, ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?
Source:GaadiWaadi