టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) భారత మార్కెట్లో యారిస్ సెడాన్ ధరలను పెంచినట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపుతో పాటుగా యారిస్ సెడాన్ మూడు వేరియంట్లను కూడా మార్కెట్ నుంచి తొలగించినట్లు కంపెనీ తెలిపింది.

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

టొయోటా యారిస్ వి మాన్యువల్, విఎక్స్ మాన్యువల్ మరియు వి సివిటి ఆటోమేటిక్ సెడాన్ మోడళ్లను కంపెనీ మార్కెట్ నుండి తొలగించి వేసింది. ఇదివరకు టొయోటా యారిస్ సెడాన్ మొత్తం ఏడు మ్యాన్యువల్, ఏడు ఆటోమేటిక్ వేరియంట్లలో మభ్యమయ్యేది. కాగా.. ఇప్పుడు ఇందులో మూడు వేరియంట్లను నిలిపివేయటంతో ప్రస్తుతం ఐదు మాన్యువల్, ఆరు ఆటోమేటిక్ వేరియంట్లలో మాత్రమే యారిస్ లభ్యం కానుంది.

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

గత నెలలోనే యారిస్ ధరలను కంపెనీ పెంచింది, కాగా తాజాగా ఈ మోడల్‌పై మరోసారి ధరను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. తాజా పెంపుతో వేరియంట్‌ను బట్టి రూ.10,000 నుండి రూ.12,000 మేర ధరలు పెరిగాయి. కాగా ధరల పెంపుకు, వేరియంట్లు తొలగించబడటానికి గల కారణాన్ని టొయోటా ఇంకా ధృవీకరించలేదు.

MOST READ: అందుబాటులోకి రానున్న టెస్లా స్మాల్ షార్ట్స్ ; చూసారా ?

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

టొయోటా యారిస్ వి (ఓ) ఆప్షనల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ మోడల్స్ రెండు వేరియంట్ల ధరలు నామమాత్రంగా రూ.1000 మేర పెరిగాయి. జె (ఓ) ఎమ్‌టి మరియు జె (ఓ) సివిటి ధరలు రూ.10,000 పెరిగాయి. రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే జి (ఓ) వేరియంట్ ధర రూ.12000 మేర పెరిగింది.

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

ఇకపోతే జి ఎమ్‌టి, జి సివిటి ధరలు మాత్రం భారీగా రూ.1.20 లక్షలు పెరిగాయి. జె ఎమ్‌టి, జె సివిటి వేరియంట్‌లకు రూ.1.68 లక్షల పెంపు లభిస్తుంది. ధరల పెరుగుదల తరువాత, టయోటా యారిస్ ఇప్పుడు రూ.8.86 లక్షల నుండి రూ.14.30 లక్షల మధ్యలో విక్రయించబడుతోంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ: పొగమంచులో డ్రైవింగ్ చేయడానికి కొత్త టెక్నాలజీ, ఏంటో తెలుసా ?

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో టొయోటా యారిస్ లభిస్తుంది. ఇది రూఫ్-మౌంటెడ్ ఎయిర్-వెంట్స్, యాంబియంట్ ఇల్యూమినేషన్, 8 రకాలుగా సర్దుబాటు చేయగల పవర్ డ్రైవర్ సీటు మరియు గెశ్చర్ కంట్రోల్‌తో తయారు చేసిన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం.

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఏడు 7 ఎయిర్‌బ్యాగులు (ఆప్షనలో ట్రిమ్‌లలో 3), ఎబిఎస్, ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్‌తో పాటుగా ఇన్‌ఫ్రారెడ్ కట్‌ఆఫ్‌తో సౌర శక్తిని గ్రహించే ఫ్రంట్ విండ్‌షీల్డ్‌తో తయారు చేసిన గ్లాస్-హై సోలార్ ఎనర్జీ అబ్జార్బింగ్ (హెచ్‌ఎస్‌ఇఎ) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ: మద్యం మత్తులో మహిళపై కారు నడిపిన పోలీస్ ఇన్స్పెక్టర్, తర్వాత ఏం జరిగిందంటే?

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

టొయోటా యారిస్ ఒకే ఒక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో డీజిల్ వెర్షన్ లేదు. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ సూపర్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

టొయోటాకు సంబంధిత ఇతర వార్తలను గమనిస్తే, టయోటా యారిస్ సెడాన్ ఇప్పుడు ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్‌లో (జిఎమ్)లో కూడా లభ్యం కానుంది. ఇది ప్రస్తుతం సింగిల్ ‘జె' ట్రిమ్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. టొయోటా యారిస్‌ను రూ.9.12 లక్షల ధరలకు (షిప్పింగ్ ఛార్జీలకు ముందు) రిటైల్ చేస్తున్నారు.

MOST READ: మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

టొయోటా యారిస్ ధరల పెంపు, కొన్ని వేరియంట్ల నిలిపివేత - వివరాలు

టొయోటా యారిస్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా తమ యారిస్ సెడాన్ ధరలను మరోసారి పెంచడానికి మరియు ఇందులో కొన్ని వేరియంట్లను మార్కెట్ నుంచి తొలగించడానికి గల కారణాలను ఇంకా తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో టొయోటా బ్రాండ్‌కు యారిస్ ఒక ఎంట్రీ లెవల్ సెడాన్. ఇది కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. కారు మొత్తం ధరను పరిగణలోకి తీసుకుంటే తాజాగా పెరిగిన ధరలు నామమాత్రమే అనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor (TKM) has silently announced a price increase of the Yaris sedan in the Indian market. Along with the price increase, the company has made changes to the sedan variants by removing three trims. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X