భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' భారత మార్కెట్లో తన '740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్' మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ ధర ఇండియన్ ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.42 కోట్లు. ఈ కొత్త కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

దేశీయ మార్కెట్లో ఈ కొత్త బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ మోడల్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సెడాన్ పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించబడుతుంది.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

ఈ 740 ఎల్ఐ ఎమ్ ఎడిషన్ రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి 'టాంజానైట్ బ్లూ మరియు ద్రవిట్ గ్రే' కలర్స్. కొత్త బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ స్పోర్ట్స్ మోడల్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

కొత్త బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ లేజర్‌లైట్ టెక్నాలజీకి అనుగుణంగా ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను కలిగి ఉంటుంది. ఇది అత్యంత అనుకూలమైన మరియు అసమాన రహదారి ఉనికిని అందిస్తుంది. ఈ లగ్జరీ సెడాన్‌లో ఎమ్ స్పోర్ట్ ప్యాకేజీ స్టాండర్డ్ గా అందించబడుతుంది.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

740 ఎల్ఐ ఎమ్ కారు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ స్టాండర్డ్ గా పొందుతుంది. అయితే కొనుగోలుదారులు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ని కూడా ఎంచుకోవచ్చు. ఇందులో ఈ రెండు విభిన్న డిజైన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కావున వినియోగదారుడు తమకు నచ్చినదానిని ఎంచుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

ఈ లగ్జరీ కారు యొక్క ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలి భాగంలో నప్పా లెదర్ లభిస్తుంది. ఇది ప్రత్యేకంగా రూపొందించిన అల్కాంటారా హెడ్‌రెస్ట్ మరియు బ్యాక్‌రెస్ట్ కుషన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో డిజిటల్ 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మరియు 16 ఇంచెస్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ మరియు 16-స్పీకర్ హెర్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ వంటివి కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఐడిల్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ మరియు కీబోర్డ్ మరియు సెంటర్ కన్సోల్‌పై బీఎండబ్ల్యూ ఇండివిడ్యువల్ బ్యాడ్జింగ్‌ ఉంటుంది.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

ఇందులో 10.2 ఇంచెస్ పుల్లీ HD టచ్‌స్క్రీన్‌లు మరియు 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ టాబ్లెట్ వంటివి వెనుక సీట్లో అందించబడ్డాయి. ఈ లగ్జరీ కారులో వివిధ రకాల రియర్ కొలీషియన్ అలెర్ట్, ట్రాఫిక్ వార్పింగ్ పార్కింగ్ అసిస్ట్ మరియు లేన్ చేంజ్ అలెర్ట్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అటెన్టివెన్స్ అసిస్టెన్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నర్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఎలక్ట్రిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ మరియు క్రాష్ సెన్సార్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంటు వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన BMW 740LI M స్పోర్ట్ ఇండివిజువల్ ఎడిషన్; వివరాలు

బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్ ఇప్పుడు 3-లీటర్, 6 సిలిండర్, డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 340 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 - 5,200 ఆర్‌పిఎమ్‌ మధ్య 450 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది మరియు పవర్ వెనుక చక్రాలకు మాత్రమే పంపబడుతుంది. ఈ కారు కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం అవుతుంది. ఇందులో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకో, ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ మరియు అడాప్టివ్ డ్రైవింగ్ మోడ్‌లు.

Most Read Articles

English summary
Bmw launched 740li m sport individual edition in india price features engine details
Story first published: Wednesday, August 4, 2021, 10:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X