రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ Charzer మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ Omega Seiki లు భాగస్వామ్యంగా ఏర్పడ్డాయి. ఈ రెండు కంపెనీలు కలిసి రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20,000 EV ఛార్జర్ లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇరు కంపెనీలు నిర్వహించిన ఇన్ హౌస్ సర్వేలో ఎలక్ట్రిక్ ఆటోలు శిలాజ ఇంధనాలతో నడిచే ఆటలతో పోలిస్తే, వాటి సగటు ప్రయాణ దూరాన్ని మూడింట రెండు వంతుల మాత్రమే కవర్ చేయగలవని తేలింది.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

ఇందుకు ప్రధాన కారణం ప్రయాణ మార్గంలో తగినన్ని చార్జింగ్ స్టేషన్లు / ఈవీ చార్జర్లు అందుబాటులో లేకపోవడమే. తగినన్ని ఛార్జింగ్ ఎంపికలు లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ ఆటోల డ్రైవర్లు ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఢిల్లీకి చెందిన ఒమేగా సీకి మరియు బెంగుళూరుకి చెందిన చార్జర్ కంపెనీల మధ్య ఏర్పడిన ఈ కొత్త భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఇరవై వేలకు పైగా ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు కానున్నాయి.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

ఈ భాగస్వామ్యం గురించి చార్జర్ సీఈఈ మరియు సహ వ్యవస్థాపకుడు ధీరజ్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ, "ఏదైనా లాజిస్టిక్స్ కంపెనీ కోసం, 'పార్క్ అండ్ ఛార్జ్' ఈవీ హబ్ లను కనుగొనడం మరియు నిర్వహించడం కోసం మూలధనం మరియు కార్మికులు మరియు శ్రామిక శక్తిని విస్తృతంగా ఉపయోగించడం చాలా అవసరం. దేశంలో ఈవీ చార్జింగ్ హబ్స్ ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, అంతే కాకుండా, డ్రైవర్‌లు మరియు కంపెనీలు ఈ హబ్‌లకు వెళ్లడం ద్వారా చాలా విలువైన సమయాన్ని కోల్పోతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే తాము ఈ విభాగంలోకి ప్రవేశించామ"ని ఆయన చెప్పారు.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

ఈ చార్జర్ నెట్‌వర్క్ సాయంతో ఫ్లీట్ ఆపరేటర్లు తమ ఖర్చులో దాదాపు 46 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చని, అంతేకాకుండా తమ ఫ్లీట్ లో 10 రెట్లు వేగవంతమైన వృద్ధిని సాధించవచ్చని, అలాగే ఎలక్ట్రిక్ ఫ్లీట్ ఆపరేటర్లు నెలకు 55 గంటల అనవసర ప్రయాణాన్ని కూడా తగ్గిస్తుందని మరియు పెరిగిన ఫ్లీట్ సమయం కారణంగా 40 శాతం ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని ఆయన చెప్పారు.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

ఈ సందర్భంగా, Omega Seiki మొబిలిటీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ, ఒమెగా సీకి మొబిలిటీలో, స్థిరమైన లాస్ట్-మైల్ లాజిస్టిక్స్‌కు మారడం ద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్ ను తగ్గించే పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి తాము అంకితభావంతో ఉన్నామని, దేశవ్యాప్తంగా తాము 30,000 లకు పైగా ఈవీ కార్గో త్రిచక్ర వాహనాలను పరిచయం చేసే లక్ష్యంతో ఉన్నామని అన్నారు.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

రాబోయే రెండేళ్ళలో ఈ లక్ష్యాన్ని సాధించడానికి, తమ ఫ్లీట్ డ్రైవర్‌లు పగటిపూట ఏ సమయంలోనైనా ఛార్జింగ్ స్టేషన్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతించే బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి తాము కూడా కృషి చేస్తున్నామని, ఇందులో మొదటి దశలో భాగంగా, తాము చార్జర్ కంపెనీతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు. ఛార్జర్‌తో దేశవ్యాప్తంగా విస్తృతమైన ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

ఎలక్ట్రిక్ వాహనాల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మరియు ఈవీ లను వేగంగా స్వీకరించే మార్గంలో ఏవైనా అడ్డంకులను తొలగించడానికి తాము బృందంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. Omega Seiki మొబిలిటీ సంస్థ ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఎలక్ట్రిక్ త్రీవీలర్లను విక్రయిస్తోంది. వీటిలో Rage మరియు Rage+ మోడళ్లు ఉన్నాయి.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

ఇందులో Rage మరియు Rage+ రెండూ కూడా L5N కేటగిరీ వాణిజ్య వాహనాలు మరియు ఇవి లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. ఈ రెండు త్రిచక్ర వాహనాలలో ఉపయోగించే పవర్‌ట్రెయిన్‌లు మరియు బ్యాటరీ ప్యాక్‌లు డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ IP 65 రేటింగ్‌లను కలిగి ఉంటాయి. వీటిలో Rage ఎలక్ట్రిక్ త్రీవీలర్ గరిష్టంగా 6.83 బిహెచ్‌పి పవర్ ను మరియు 80 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 6 kWh బ్యాటరీ ప్యాక్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

Rage త్రీవీలర్ యొక్క గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 70 నుండి 80 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. రేజ్ యొక్క బ్యాటరీ ప్యాక్ ను 3 నుండి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీపై కంపెనీ 2 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని అందిస్తోంది. రేజ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్ యొక్క బరువు సుమారు 400 కిలోలుగా ఉంటుంది.

రెండేళ్లలో 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Charzer మరియు Omega Seiki

ఇక రేజ్+ విషయానికి వస్తే, ఇది భారీ మరియు శక్తివంతమైన త్రీ-వీలర్. Rage+ యొక్క బ్యాటరీ ప్యాక్ 7.5 kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 6.83 బిహెచ్‌పి పవర్ ను మరియు 80 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ బ్యాటరీ చార్జింగ్ సామర్థ్యాలు కూడా Rage ఎలక్ట్రిక్ త్రీవీలర్ మాదిరిగానే ఉంటాయి. Rage+ మొత్తం బరువు 480 కిలోలుగా ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ (ఏది ముందైతే అది) ని అందిస్తుంది.

Most Read Articles

English summary
Charzer and omega seiki to install 20000 ev chargers in 2 years in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X