మారుతి వ్యాగన్ఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

భారతదేశంలో మారుతి సుజుకి అందిస్తున్న చిన్న కార్లు బడ్జెట్ ధరలకే అందుబాటులో ఉండి, ప్రజల్లో మంచి ప్రాచుర్యాన్ని దక్కించుకున్నాయి. అయితే, ఇప్పుడు టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కార్లు కూడా మంచి డిజైన్, ఫీచర్లు మరియు బిల్డ్ క్వాలిటీతో సరసమైన ధరలకే అందుబాటులో ఉంటున్నాయి.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

మారుతి సుజుకి కార్లు ఎక్కువ మైలేజ్ మరియు స్థలానికి ప్రసిద్ది చెందగా, టాటా మోటార్స్ కార్లు స్టైల్‌తో పాటుగా బలానికి కూడా ప్రసిద్ది చెందాయి. మరి ఈ కథనంలో మారుతి అందిస్తున్న వ్యాగన్ఆర్ మరియు టాటా అందిస్తున్న టియాగో హ్యాచ్‌బ్యాక్ కార్ల ప్రత్యేకతలు మరియు పోలికలు ఏంటో తెలుసుకుందాం రండి.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

1. ఇంజన్ మరియు పవర్

వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో 1197సిసి కె12 ఎమ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 81.80 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 20.53 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని ఇస్తుంది. ఇందులో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

టియాగో

టాటా టియాగో కారులో 1199సిసి 1.2-లీటర్, 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 84.48 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటుగా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. టాటా టియాగో లీటరుకు 23.84 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని ఇస్తుంది.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

2. డిజైన్

వ్యాగన్ఆర్

వ్యాగన్ఆర్ కారును టాల్ బాయ్ డిజైన్ కారు అని పిలుస్తారు ఇది బాక్సీ టైప్ డిజైన్‌ను కలిగి ఉండి పొడవైన డ్రైవర్లు మరియు ప్రయాణీకులకు సైతం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక మినీ ఎస్‌యూవీలా ఉంటుంది. ఈ కారులో ఎల్‌ఈడి హెడ్‌లైట్, టెయిల్ లైట్ వంటి ఫీచర్లు లేవు. కానీ, ఇందులో బాడీ కలర్ సైడ్ మిర్రర్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్ మరియు ఇంటీరియర్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు లభిస్తాయి. దీని వీల్‌బైస్ 2435 మిమీగా ఉంటుంది.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

టియాగో

టాటా టియాగో చాలా సరళమైన డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు వైపు నుండి ఇది షార్ప్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ కారులో హాలోజన్ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్, స్టైలిష్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ స్ట్రిప్, స్టైలిష్ ఆర్15 డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, పియానో ​​బ్లాక్ సైడ్ మిర్రర్స్, కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్ మరియు సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లు మొదలైన ఫీచర్లు ఉంటాయి. ద పొందుతుంది. దీని వీల్‌బైస్ 2400 మిమీగా ఉంటుంది.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

3. ఇంటీరియర్

వ్యాగన్ఆర్

వ్యాగన్ఆర్ లోపలి భాగంలో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డోర్ హ్యాండిల్స్ లోపల సిల్వర్ యక్సెంట్స్, ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ మరియు వెనుక సీట్లపై హెడ్‌రెస్ట్‌లు ఉంటాయి. ఇది డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్ లేఅవుట్‌ని కలిగి ఉంటుంది. ఈ కారులో 341-లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంటుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 32 లీటర్లుగా ఉంటుంది.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

టియాగో

టాటా టియాగో లోపలి భాగంలో కూడా డ్యూయల్ టోన్ లేఅవుట్ ఇంటీరియర్ థీమ్ అందుబాటులో ఉంది. ఇందులో డోర్ పాకెట్స్, బాటిల్ హోల్డర్, టాబ్లెట్ స్టోరేజ్ స్పేస్, గ్లవ్ బాక్స్, పియానో ​​బ్లాక్ ఫినిషింగ్ స్టీరింగ్ వీల్, థియేటర్ డిమ్మింగ్ ల్యాంప్, పియానో ​​బ్లాక్ ఫినిష్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఫాబ్రిక్ సీట్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు కూడా 32 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో 242 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

4. ఫీచర్లు

వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 2-స్పీకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ముందు మరియు వెనుక డోర్ పాకెట్స్, సర్దుబాటు చేయగల ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, ఆళ్ పవర్ విండోస్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

టియాగో

టాటా టియాగో ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో కూడా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా మ్యాప్స్‌ని సపోర్ట్ చేసే 17.78-సెంటీమీటర్ల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు హర్మాన్ స్పీకర్లు, ఇంటిగ్రేటెడ్ రియర్ నెక్ రెస్ట్, సర్దుబాటు చేయగల ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఫోన్ బుక్ యాక్సెస్, కాల్ రిజెక్ట్ ఫంక్షన్, ఎస్ఎమ్ఎస్ రీడ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

5. సేఫ్టీ ఫీచర్లు

వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, డే-నైట్ రియర్ వ్యూ మిర్రర్, సీట్ బెల్ట్ రిమైండర్, ఎబిఎస్-ఇబిడి, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ, రియర్ డిఫాగర్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

టియాగో

టాటా టియాగోలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, డే-నైట్ రియర్ వ్యూ మిర్రర్స్, సీట్ బెల్ట్ రిమైండర్, ఎబిఎస్-ఇబిడి, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ, రియర్ డీఫాగర్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, రియర్ వైపర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

మారుతి వ్యాగనాఆర్ వర్సెస్ టాటా టియాగో: కంపారిజన్

6. ధర

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ధరలు రూ.4.80 లక్షల నుండి రూ.6.33 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

టాటా టియాగో ధరలు రూ.4.99 లక్షల నుండి రూ.6.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Most Read Articles

English summary
Comparison Between Maruti Suzuki WagonR And Tata Tiago: Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X