యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, యూరప్ మార్కెట్లలో తమ ఉత్పత్తులను 'డాసియా' అనే సబ్ బ్రాండ్ క్రింద విక్రయిస్తోంది. అక్కడి మార్కెట్లో రెనో తమ స్వంత బ్రాండ్ ద్వారా ప్రీమియం వాహనాలను మరియు డాసియా బ్రాండ్ ద్వారా చవకైన వాహనాలను విక్రయిస్తోంది.

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

సింపుల్‌గా చెప్పాలంటే, భారతదేశంలో రెనో అనుబంధ సంస్థ అయిన నిస్సాన్ తమ స్వంత బ్రాండ్ ద్వారా ప్రీమియం ఉత్పత్తులను మరియు డాట్సన్ అనే సబ్ బ్రాండ్ ద్వారా చవకైన ఉత్పత్తులను అందిస్తున్నట్లుగా అన్నమాట. సరే అదంతా అటుంచి అసలు విషయానికి వస్తే..

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

మనదేశంలో అత్యంత పాపులర్ అయిన రెనో స్మాల్ కార్ క్విడ్‌ను, యూరప్ మార్కెట్లలో డాసియా స్ప్రింగ్ పేరుతో కంపెనీ విక్రయిస్తోంది. డాసియా స్ప్రింగ్ అలియాస్ రెనో క్విడ్ ఈ రెండు మోడళ్లలో కేవలం బ్యాడ్జ్ మినహా మిగిలిన అన్ని ఫీచర్లు మరియు ఇంజన్ ఆప్షన్లు దాదాపు ఒకేలా ఉంటాయి.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

ఫ్రాన్స్‌లో డాసియా స్ప్రింగ్ ఎలక్ట్రిక్ కారును 16,990 యూరోల ధరతో విడుదల చేశారు. ఈ ధరలను భారత కరెన్సీతో పోల్చి చూస్తే, సుమారు రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్యలో ఉంటాయి (ప్రభుత్వ రాయితీలకు ముందు మరియు ఎక్స్-షోరూమ్ ధరలు).

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

రెనో ఇండియా సంస్థ కూడా భారతదేశంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వీటిలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత మార్కెట్లో కూడా రెనో క్విడ్ ఈవీ లాంచ్ కావచ్చనే వార్తలు జోరందుకున్నాయి.

MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

అయితే, పైన పేర్కొన్న ధరల వద్ద మాత్రం ఈ చిన్న కారు విడుదలైతే, ఇక్కడి మార్కెట్లో అది విజయం సాధించడం కష్టమే. ఫ్రాన్స్‌లో మాదిరిగా క్విడ్ ఈవీకి అయ్యే ఖర్చుతో (సుమారు 16 లక్షలు) మన దేశంలో టాటా నెక్సాన్ ఈవీ వంటి పెద్ద కార్లనే కొనుగోలు చేయవచ్చు. కాబట్టి, క్విడ్ ఈవీ ధర ఇందులో సగం ఉంటేనే ఇక్కడ సక్సెస్‌కి ఛాన్స్ ఉంటుంది.

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

ఇక డాసియా స్ప్రింగ్ ఈవీ విషయానికి వస్తే, ఇది డబ్ల్యూఎల్‌టిపి సర్టిఫై చేసిన దాని ప్రకారం, పూర్తి చార్జ్‌పై 230 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఇందులోని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా, స్టార్ట్/స్టాప్ సిటీ ట్రాఫిక్‌లో అయితే 305 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే, బ్రేక్ వేసిన ప్రతిసారి ఇందులోని బ్యాటరీలు తిరిగి చార్జ్ అవుతూ ఉంటాయి.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

ఈ చిన్న కారులో 27.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని సాయంతో ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 44 పిఎస్ పవర్‌ను మరియు 125 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్రాన్ మార్కెట్లో డాసియా స్ప్రింగ్ (రెనో క్విడ్) స్టాండర్డ్ మరియు ప్రీమియం వేరియంట్లలో లభ్యం కానుంది.

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

స్టాండర్డ్ వేరియంట్‌లో మాన్యువల్ ఏసి, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ వంటి ప్రాథమిక ఫీచర్లు లభిస్తాయి. అక్కడి మార్కెట్లో దీని ధర 16,990 యూరోలు (సుమారు రూ .15 లక్షలు)గా ఉంటుంది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

యూరప్‌లో రెన్ క్విడ్ ఈవీ లాంచ్; నెక్స్ట్ మన దేశంలోనే.. ధర తెలిస్తే షాక్!

అలాగే, ప్రీమియం వేరియంట్‌లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి పలు ప్రీమియం ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో ఛార్జింగ్ సమయాన్ని తగ్గించేందుకు 30 కిలోవాట్ల చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. మార్కెట్లో దీని ధర 18,490 యూరోలు (సుమారు రూ .16 లక్షలు)గా ఉంటుంది. డాసియా స్ప్రింగ్ అలియాస్ రెనో క్విడ్ ఈవీ 2022 నాటికి భారత మార్కెట్‌కు రావచ్చని అంచనా.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Electric Version Of Renault Kwid (Dacia Spring) Launched In Europe; Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X