గుడ్ న్యూస్: బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఇప్పుడు మన తిరుపతిలో.. కూడా..!!

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరుగుతున్న సమయంలో వాటికి కావలసిన మౌలిక సదుపాయాలయిన ఛార్జింగ్ స్టేషన్స్ మరియు స్వాపింగ్ స్టేటన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి స్టేషన్స్ మరిన్ని పెంచడానికి మరియు వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండటానికి చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.

భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్స్ మరియు స్వాపింగ్ స్టేషన్స్ చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క స్వాపింగ్ స్టేషన్ కూడా అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు NREDCAP (న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల సంస్థ అయిన RACENergy సహకారంతో, ఈరోజు తిరుపతిలో ఎలక్ట్రిక్ ఆటోలను పైలట్ చేయడానికి అనుకూలంగా ఉండే మొట్ట మొదటి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది.

బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఇప్పుడు మన తిరుపతిలో

ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌ల ప్రారంభంలో న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ రమణా రెడ్డి, జనరల్ మేనేజర్ C. B. జగదీశ్వర రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, NREDCAP రామాంజనేయ రెడ్డి, RACEnergy సహ వ్యవస్థాపకుడు అరుణ్ శ్రేయస్ పాల్గొన్నారు.

తిరుపతి నగరాన్ని జీరో-ఎమిషన్ జోన్‌గా మార్చడానికి ఈ కొత్త బ్యాటరీ మార్పిడి స్టేషన్స్ ఉపయోగపడతాయి. తిరుపతిని హరిత ప్రాంతంగా చేయడంలో ఇది తొలి అడుగు. RACEnergy అందించే ఈ పరిష్కారం డీజిల్ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్‌గా మార్చడంలో సహాయపడుతుంది.

బ్యాటరీలను హాట్-స్వాపింగ్ చేసే అధునాతన సాంకేతికత ఏకీకరణ ప్లగ్గింగ్ కనెక్టర్‌ల యొక్క ఏదైనా మాన్యువల్ జోక్యాన్ని తీసివేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా సురక్షితమైనది మరియు పూర్తిగా సంస్థచే శ్రద్ధ వహించబడుతుంది. ఇందులో కంపెనీ యొక్క రెట్రోఫిట్ కిట్‌లు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లు మరియు RACEnergy ద్వారా తయారు చేయబడిన స్వాప్ చేయగల బ్యాటరీలు లభిస్తాయి.

తిరుపతిలో ప్రారంభించిన ఈ కొత్త బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ లో, డ్రైవర్‌లు తమ డిశ్చార్జ్ అయిన బ్యాటరీలను కేవలం 2 నిమిషాల్లో ఛార్జ్ చేసిన వాటితో మార్చుకోవచ్చు, తద్వారా వాటిని ఆన్‌లో ఉంచవచ్చు. ఇది వారికీ చాలా అనుకూలమగా ఉంటుంది. సమయం కూడా ఎక్కువ వృధా అయ్యే అవకాశం ఉండదు.

ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ S. రమణ రెడ్డి మాట్లాడుతూ, హాట్-స్వాపింగ్ టెక్నాలజీని ఉపయోగించే రెట్రోఫిట్ చేయబడిన ఆటో రిక్షాలతో ఇది మొదటి-రకం పైలట్. ఈ పైలట్ దశ తర్వాత, మేము రాబోయే నెలల్లో 200 వాహనాలకు విస్తరించాలని చూస్తున్నాము అన్నారు. RACEnergy అందించే ఈ ప్రత్యేకమైన పరిష్కారం ద్వారా, డ్రైవ్‌లు రెట్రోఫిట్ కిట్‌లను కొనుగోలు చేయవచ్చు.

ఈ బ్యాటరీ మార్పిడి అనేది డ్రైవర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా వారి ఆదాయాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ బ్యాటరీలు ఉపయోగించడం వల్ల మునుపటికంటే కూడా ఎక్కువ లాభం ఆర్జించవచ్చు అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో RACEnergy సహ వ్యవస్థాపకుడు అరుణ్ శ్రేయస్ మాట్లాడుతూ, తిరుపతిని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి NREDCAP యొక్క విజన్‌కు మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. అంతే కాకుండా మేము రాబోయే నెలల్లో ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని వారు అన్నారు.

ఏది ఏమైనా తిరుపతి నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ రావడం వల్ల వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా నగరాన్ని కాలుష్య కోరల నుంచి కొంత వరకు కాపాడవచ్చు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కావున అప్పటికి వాటికీ కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
First ev swap staiton in tirupati details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X