డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

అమెరికన్ కార్ బ్రాండ్ 'ఫోర్డ్ ఇండియా' (Ford India) ఇటీవల భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఫలితంగా, దేశంలో ఫోర్డ్ కార్ల అమ్మకాలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఫోర్డ్ కంపెనీ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని కస్టమర్‌లతో పాటు డీలర్లు మరియు మొత్తం ఆటో పరిశ్రమకు ఆశ్చర్యం కలిగించింది.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

దేశంలో ఫోర్డ్ ప్లాంట్లు మూసివేయటం వలన కార్ల అమ్మకాలు నిలిచిపోవడంతో పాటు క్రమంగా దేశవ్యాప్తంగా ఫోర్డ్ డీలర్‌షిప్ కేంద్రాలు కూడా మూతపడనున్నాయి. కంపెనీ డీలర్లలో కొంత మంది తగ్గించబడతారని మరియు కొద్దిమంది డీలర్లు మాత్రమే కొత్త వాహనాలను విక్రయించబోతున్నారని Ford ఇటీవల తెలియజేసింది. భవిష్యత్తులో కంపెనీ తమ డీలర్‌షిప్‌ లను నిర్వహించడానికి ఒక విధానాన్ని కూడా రూపొందించింది.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

ఫోర్డ్ ఇండియా 2021 నాల్గవ త్రైమాసికంలో గుజరాత్ లోని సనంద్ ప్లాంట్‌ ను మరియు 2022 రెండవ త్రైమాసికంలో చెన్నైలోని ప్లాంట్‌ ను మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 4,000 ఉద్యోగులు కోల్పోయే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఫోర్డ్ దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులను నిలిపివేయాలని మరియు ఇప్పటికే ఉన్న వాహనాల స్టాక్ ను పూర్తిగా విక్రయించేయాలని భావిస్తోంది.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా, ఇటీవలి కాలంలో కొత్తగా ఏర్పాటైన డీలర్లు కూడా నష్టాల బాట పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇప్పటికే ఫోర్డ్ వాహనాలను కలిగి ఉన్న కస్టమర్లు తమ వాహనాల విడిభాగాల లభ్యత గురించి తెలియక అయోమయంలో ఉన్నాయి. అయితే, ఫోర్డ్ ఇండియా మాత్రం తమ కస్టమర్లు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదని చెబుతోంది. కొందరు డీలర్లను నిలుపుకోవడానికి కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటోంది.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

భవిష్యత్తులో కూడా కొన్ని ఫోర్డ్ డీలర్‌షిప్ లకు మద్దతు ఇవ్వడం, తద్వారా వారు తమ కస్టమర్లకు విడిభాగాలను మరియు సేవలను అందించడాన్ని కొనసాగిస్తూనే ఉంటారని కంపెనీ తెలిపింది. భారతదేశాన్ని విడిచివెళ్లాలనే నిర్ణయంతో, సర్వీస్, స్పేర్స్ మరియు వారంటీ సపోర్ట్ తో సహా ఈ విధానాలను Ford ప్రకటించింది. దీని కోసం, కంపెనీ ఢిల్లీ, ముంబై, సనద్, చెన్నై మరియు కోల్‌కతాలో పార్ట్స్ డిపోలను కూడా నిర్వహించబోతోంది, తద్వారా వీటి సరఫరా స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

స్టాక్ క్లియరెన్స్ సేల్..

ఫోర్డ్ కంపెనీ మూసివేయబడుతుందని తెలియగానే, కంపెనీ డీలర్లు ఇప్పుడు తమ స్టాక్ ను క్లియర్ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా, దేశంలోని అనేక Ford డీలర్‌షిప్‌లు స్టాక్ క్లియరెన్స్ అమ్మకాలను అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు నేరుగా డీలర్లను సంప్రదించవచ్చు. వీలైనంత త్వరగా స్టాక్ క్లియర్ చేసేందుకు డీలర్‌షిప్‌లు కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఫోర్డ్ ఇండియా దేశవ్యాప్తంగా 170 డీలర్లను మరియు మొత్తం 391 డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ఈ డీలర్ల వద్ద సుమారు 1000 కార్ల వరకూ స్టాక్ ఉన్నట్లు సమాచారం.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

భారతదేశంలో 2 బిలియన్ డాలర్ల నష్టం

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోర్డ్ భారతదేశంలో గడచిన 10 సంవత్సరాల కాలంలో సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు తెలిపింది. దేశంలో తమ డీలర్‌షిప్‌ల విస్తరణకు ఫోర్డ్ ఇండియా సుమారు రూ. 2,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా వెచ్చించింది. అయితే, స్వతహాగా పెట్టుబడి పెట్టిన డీలర్లు మాత్రం తమ విలువైన పెట్టుబడిని తిరిగి పొందే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

ఫోర్డ్ డీలర్‌షిప్‌ల ద్వారా దాదాపు 40,000 మంది ఉపాధి పొందుతున్నారని FADA నివేదించింది. డీలర్లు తమ వ్యాపార కార్యకలాపాల కోసం ప్రధాన బ్యాంకుల నుండి సుమారు రూ. 150 కోట్ల వరకూ రుణాలు తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ రుణాలను సదరు డీలర్లు ఎలా క్లియర్ చేస్తారో చూడాలి. అంతేకాకుండా, డీలర్ల వద్ద ఇప్పటికే అనేక డెమో (డిస్‍‌ప్లే) వాహనాలు కూడా ఉన్నాయి, మరి వాటిని ఎలా విక్రయిస్తారో చూడాలి.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

ఫోర్డ్ ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్ కోసం అంతర్జాతీయ మార్కెట్ల నుండి కంపెనీకి కొన్ని పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. సమాచారం ప్రకారం, ఫోర్డ్ భారతదేశం నుండి సుమారు 30,000 యూనిట్ల ఎకోస్పోర్ట్ కార్లను ఎగుమతి చేయాల్సి ఉంది మరియు ఇది ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. చెన్నైలోని ఫోర్డ్ ఫ్యాక్టరీలో ఎకోస్పోర్ట్ మోడల్‌ను తయారు చేస్తున్నారు. దీనిని అమెరికా మార్కెట్లో కూడా విక్రయిస్తున్నారు.

డీలర్‌షిప్‌లను తగ్గించనున్న Ford India; స్టాక్ క్లియరెన్స్ సేల్, భారీ డిస్కౌంట్స్..

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీని కూడా కంపెనీ ఈ చెన్నై ప్లాంట్ లోనే తయారు చేసేది. అయితే, కంపెనీ ప్రస్తుతం ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది. కాగా, గుజరాత్ లోని సనంద్ ప్లాంట్‌లో ఆస్పైర్ మరియు ఫిగో మోడళ్లు తయారు చేస్తున్నారు. ఈ రెండు మోడళ్లు భారతదేశం నుండి మెక్సికో మరియు దక్షిణాఫ్రికాలకు ఎగుమతి చేయబడుతాయి. ఆసియా ప్రాంతం (చైనా మినహా), మిడిల్-ఈస్ట్ మరియు ఆఫ్రికా మార్కెట్లలో విక్రయించబడే రేంజర్ మోడళ్ల కోసం ఇంజన్‌ల తయారీకి సనంద్ ఫ్యాక్టరీని కొనసాగించాలని Ford India నిర్ణయించింది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford india to reduce dealerships soon stock clearance sale details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X