పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు; పూర్తి వివరాలు

అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ తన 2021 ఎఫ్-150 పోలీస్ రెస్పాండర్ పికప్ ట్రక్కును ఆవిష్కరించింది. ఈ కొత్త ఫోర్డ్ ఎఫ్-150 పోలీస్ రెస్పాండర్ పికప్ ట్రక్‌ మంచి ఆఫ్-రోడ్ సామర్ధ్యం కలిగి ఉండటమే కాకుండా, లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది. ఈ ట్రక్ ఇప్పుడు పోలీస్ బలగాలకు ఖచ్చితంగా సరిపోయేవిధంగా రూపొందించబడింది.

పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు ; పూర్తి వివరాలు

కొత్త ఫోర్డ్ ఎఫ్-150 పోలీస్ రెస్పాండర్ పికప్ ట్రక్‌లో టార్క్-ఆన్-డిమాండ్ ఆటోమేటిక్ ఫోర్-వీల్-డ్రైవ్ మోడ్ ఉంటుంది. కావున ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ మార్గాలలో పెట్రోలింగ్ అధికారులు సులభంగా ప్రయాణించవచ్చు. ఈ కొత్త పోలీసు పికప్ ట్రక్ సూపర్ క్రూ ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందించబడింది. ఇది ఇప్పుడు పోలీసు బలగాలకు అవసరమయ్యే ఎమర్జెన్సీ రెస్పాండింగ్ మరియు మొబైల్ కమాండ్ సిస్టం చేర్చడానికి రూపొందించబడింది.

పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు ; పూర్తి వివరాలు

ఈ పికప్ ట్రక్ మెరుగైన ట్రాక్షన్ కంట్రోల్, పేలోడ్ సామర్ధ్యం మరియు అంతర్గత ప్రయాణీకుల సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఎఫ్-150 పోలీస్ రెస్పాండర్ మంచి ఆఫ్-రోడ్ పర్ఫామెన్స్ కలిగి ఉంది. కావున ఎలాంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు ; పూర్తి వివరాలు

ఫోర్డ్ రెస్పాండర్ పికప్ ట్రక్కు స్టాండర్డ్ 3.5-లీటర్ ఎకోబూస్ట్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 400 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది. ఇది దాని మునుపటి మోడల్స్ కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది.

పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు ; పూర్తి వివరాలు

ఫోర్డ్ ఎఫ్-150 పోలీస్ రెస్పాండర్ లో అనేక లేటెస్ట్ టెక్నాలజీలు ఉన్నాయి. ఈ ట్రక్కుకు నాలుగు ఫ్లీట్ కీలు లేదా నాలుగు ఫోబ్స్ ఆఫ్ కీలెస్ ఎంట్రీ అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫోర్డ్ ఎఫ్-150 పోలీస్ రెస్పాండర్ పికప్ ట్రక్ క్యాబిన్ లోపల క్లౌడ్ కనెక్టివిటీతో SYNC4 ను ప్రామాణికంగా పొందుతుంది. ఇది సెంటర్ స్టాక్‌లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు వైర్‌లెస్ నవీకరణలతో పొందుపరిచిన మోడెమ్‌తో వస్తుంది.

MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]

పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు ; పూర్తి వివరాలు

ఇది సాఫ్ట్‌వేర్ నవీకరణలను స్వీకరించడానికి ఏజెన్సీలను అనుమతిస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 4 ఇంచెస్ డిస్ప్లే స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ పికప్ ట్రక్ యొక్క క్యాబిన్ లో ఆకర్షణీయమైన సీట్లు కూడా ఉన్నాయి. ఈ పోలీస్ రెస్పాండర్ పికప్ ట్రక్‌లో రెడ్ మరియు బ్లూ, అంబర్ మరియు వైట్ కలర్ ఎల్‌ఈడీ పోలీసు బీకాన్‌లను కంపెనీ ముందే ఇన్‌స్టాల్ చేసింది.

పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు ; పూర్తి వివరాలు

ఇందులో రివర్స్ సెన్సింగ్ సిస్టమ్, ప్రీ-కొలిషన్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కొత్త స్టాండర్డ్ డ్రైవర్-అసిస్ట్ ఫీచర్లతో పాటు, క్రాస్ ట్రాఫిక్ వార్ణింగ్ తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఉంది.

MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు ; పూర్తి వివరాలు

కొత్త 2021 ఫోర్డ్ ఎఫ్-150 రాప్టర్ ముందు భాగంలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ పొందింది. దీనిని కంపెనీ తన కోర్ ఆఫ్ రోడింగ్ డిఎన్‌ఎను అలాగే ఉంచాలని నిర్ణయించింది. ఈ కొత్త మోడల్ మునుపటి మోడల్స్ కంటే చాలా కనెక్టివిటీ మరియు ఆఫ్-రోడ్ బేస్డ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford Unveils 2021 F-150 Police Responder. Read in Telugu.
Story first published: Thursday, March 18, 2021, 9:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X