జిఎమ్‌సి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ - డీటేల్స్

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ అందిస్తున్న 'హమ్మర్' ఎస్‌యూవీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. యుద్ధ ట్యాంక్‌ల మాదిరిగా తయారు చేయబడిన ఈ ఎస్‌యూవీలో కంపెనీ ఇప్పుడు ఓ సరికొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఆవిష్కరించింది.

జిఎమ్‌సి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ - డీటేల్స్

హమ్మర్ ఎలక్ట్రిక్ 2023 సంవత్సరంలో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ గతేడాది కాన్సెప్ట్ రూపంలో వెల్లడించింది. తాజాగా, కంపెనీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఫీచర్లు, బ్యాటరీ రేంజ్ వంటి వివిధ అంశాల గురించి తెలియజేసింది.

జిఎమ్‌సి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ - డీటేల్స్

జిఎమ్‌సి గత సంవత్సరం హమ్మర్ పికప్ వెర్షన్‌ను కూడా ప్రదర్శించి, బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. అయితే, ఈ ఎలక్ట్రిక్ పిక్-అప్ ఇప్పటికీ టెస్టింగ్ దశలోనే ఉంది. హమ్మర్ ఎలక్ట్రిక్ పికప్ అమ్మకాలు కూడా 2023 నాటికి అధికారికంగా ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

జిఎమ్‌సి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ - డీటేల్స్

జిఎమ్‌సి హమ్మర్ ఈవీలో సంస్థ యొక్క 20-మాడ్యూల్ బ్యాటరీ సిస్టమ్‌తో కూడిన అల్టిమా పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 817 బిహెచ్‌పిల శక్తిని మరియు 15,591 న్యూటన్ మీటర్ల వరకు గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, ఇందులోని బ్యాటరీలు పూర్తి ఛార్జీపై ఏకంగా 563 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

జిఎమ్‌సి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ - డీటేల్స్

కొత్త హమ్మర్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈవీ2, ఈవీ2ఎక్స్, ఈవీ3ఎక్స్ మరియు ఎడిషన్ 1 అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో దీని ధరలు 79,995 డాలర్ల నుండి 1,10,595 డాలర్ల మధ్యలో ఉంటాయి. అంటే, మన కరెన్సీలో దీని ధరలు సుమారు రూ.58.66 లక్షల నుండి రూ.81.10 లక్షల మధ్యలో ఉంటాయి.

MOST READ:వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

జిఎమ్‌సి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ - డీటేల్స్

హమ్మర్ ఈవీ ఈ విభాగంలో టెస్లా అందిస్తున్న సైబర్ ట్రక్కుతో పోటీ పడనుంది. మీడియా నివేదికల ప్రకారం, హమ్మర్ ఎస్‌యూవీ మరియు పిక్-అప్ వెర్షన్‌లు వేర్వేరు డిజైన్ సిల్హౌట్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అయితే, ఈ రెండింటి ఓవరాల్ డిజైన్ లాంగ్వేజ్ మాత్రం ఒకేలా ఉంటుంది.

జిఎమ్‌సి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ - డీటేల్స్

హమ్మర్ ఈవీ ఎస్‌యూవీలో పిక్-అప్ వెర్షన్‌లో కనిపించినట్లుగా స్కిడ్ ప్లేట్‌తో చంకీ ఫ్రంట్ బంపర్ అమర్చబడి ఉంటుంది. ఇంకా ఇందులో 'హామ్మర్' బ్యాడ్జింగ్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, రియర్ హంచ్ మరియు సైడ్ క్లాడింగ్‌తో సన్నగా ఉండే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి.

ఈ ఎస్‌యూవీ యొక్క టెయిల్ లైట్లు చూడటానికి హమ్మర్ పిక్-అప్ వేరియంట్‌తో సమానంగా ఉంటాయి. కానీ, ఇందులోని బూట్-మౌంటెడ్ స్పేర్ వీల్ కారణంగా, ఇది వెనుక వైపు నుండి భిన్నంగా కనిపిస్తుంది.

MOST READ:కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

హమ్మర్ ఈవీతో పాటుగా కంపెనీ ఈ మోడల్‌ను కస్టమర్లు తమకు నచ్చినట్లుగా మార్చుకునేందుకు అనేక రకాల యాక్ససరీ ప్యాక్‌లను కూడా అందిస్తుంది. ఇందులో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, 35 ఇంచ్ ఆఫ్-రోడ్ టైర్లతో పాటు అనేక ఆప్షన్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇవి కాకుండా ఎస్‌యూవీతో అండర్‌బాడీ గార్డ్, రాక్ స్లైడర్, అల్ట్రావిజన్ 2, అండర్‌బాడీ కెమెరా వంటి ఉపకరణాలు కూడా అందుబాటులో ఉంచబడతాయి.

జిఎమ్‌సి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ - డీటేల్స్

ఈ ఎస్‌యూవీ బెస్ట్ ఇన్ క్లాస్ 3.2 మీటర్ల పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉండి, విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారణంగా కారు యొక్క స్థిరత్వం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అధిక వీల్‌బేస్ కారణంగా, ఈ కారు చలనంలో ఉన్నప్పుడు మరియు మలుపుల వద్ద చాలా స్థిరంగా ఉంటుంది. హమ్మర్ ఎలక్ట్రిక్ గురించి మరింత సమాచారం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

Most Read Articles

English summary
GMC Hummer Electric SUV Unveiled; Range, Features And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X