బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda), తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 11వ తేదీ నుండి ప్రారంభం కాబోయే గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS 2021) వేదికగా, కంపెనీ తమ జెడ్ఆర్-వి (ZR-V) ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేనుంది.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

ప్రాథమిక నివేదికల ప్రకారం, హోండా జెడ్ఆర్-వి (Honda ZR-V) అనేది సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. అంటే, ఇది పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండొచ్చన్నమాట. దక్షిణాసియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని హోండా ఈ కారును తయారు చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో హోండా కార్స్ ఇండియా, భారత మార్కెట్ కోసం ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. బహుశా అది ఇదే కావచ్చని సమాచారం.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

హోండా ఇటీవలే ఇండోనేషియా మార్కెట్లో రెండు కొత్త తరం సెడాన్‌లను విడుదల చేసింది. వీటిలో ఒకటి 11వ తరం హోండా సివిక్ ఆర్ఎస్ (Honda Civic RS) మరియు రెండవది ఆల్-న్యూ హోండా సిటీ (All-new Honda City). ఈ లాంచ్ ఈవెంట్‌లో హోండా ఈ రెండు కార్లతో పాటుగా ఓ కొత్త కారు టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

ఈ టీజర్ వీడియో ప్రకారం, నవంబర్ 11 నుండి 21 వరకు ఇండోనేషియాలో జరిగే గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS 2021) లో హోండా తమ కొత్త కారును ఆవిష్కరించనుంది. ప్రస్తుతం, హోండా భారత మార్కెట్లో విక్రయిస్తున్న హోండా డబ్ల్యూఆర్-వి (Honda WR-V) ఎస్‌యూవీకి రీప్లేస్‌మెంట్ మోడల్‌గా ఈ కొత్త హోండా జెడ్ఆర్-వి (Honda ZR-V) విడుదలయ్యే అవకాశం ఉంది.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

హోండా జెడ్ఆర్-వి దేశీయ విపణిలో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది. జెడ్ఆర్-వి కోసం హోండా విడుదల చేసిన టీజర్ ను చూస్తుంటే, ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ముందు భాగంలో స్పోర్టీ గ్రిల్, సన్నటి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్‌లు, క్రోమ్ గార్నిష్ తో పాటుగా షార్ప్ బాడీ లైన్స్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

కొత్త హోండా జెడ్ఆర్-వి ఎస్‌యూవీని కంపెనీ తమ కొత్త-తరం కాంపాక్ట్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి నిర్మించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, ఇదే ప్లాట్‌ఫామ్ పై కంపెనీ తమ పాపులర్ సెడాన్ హోండా సిటీని కూడా నిర్మిస్తోంది. ఆగ్నేయాసియా మరియు భారతదేశంలోని సబ్-కాంపాక్ట్ సెగ్మెంట్ కోసం జెడ్ఆర్-వి ఎస్‌యూవీని హోండా ఓ గేమ్ ఛేంజర్ మోడల్ గా ఉపయోగించాలని చూస్తోంది.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

జెడ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడవు నాలుగు మీటర్లు, వెడల్పు 1,695 మిమీ మరియు ఎత్తు 1,600 మిమీగా ఉంటుందని సమాచారం. ఈ కొత్త ఎస్‌యూవీ యొక్క డిజైన్ అంశాలను సూచించే స్కెచ్‌లను కూడా హోండా ఇటీవల విడుదల చేసింది. ఈ కొత్త హోండా జెడ్ఆర్-వి వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్ లైన్ తో ఓ కూప్ స్టైల్‌ ఎస్‌యూవీ డిజైన్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటుందని సూచిస్తుంది.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

ఈ అధికారిక టీజర్ వాహనం యొక్క సిల్హౌట్‌ను గీసే రేఖను మాత్రమే బహిర్గతం చేస్తుంది. హెడ్‌లైట్‌ల వరకు విస్తరించే పైభాగంలో ఫ్రేమ్‌తో కూడిన పెద్ద గ్రిల్ ఉంటుంది. ఇందులోని ఆర్ఎస్ (RS) బ్యాడ్జింగ్ ను చూస్తుంటే, ఇది టర్బోచార్జ్డ్ మోడల్‌ను సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కారు వెనుక భాగంలో సిగ్నేచర్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఎల్ఈడి లైట్లు ఉంటాయి.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త హోండా ఎస్‌యూవీ లోపలి భాగం చాలా సరళమైన మరియు ఫంక్షనల్ లేఅవుట్‌ను పొందే అవకాశం ఉంది. ఇందులో మల్టీమీడియా స్క్రీన్, లేటెస్ట్ కనెక్టింగ్ ఫీచర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే సపోర్ట్, సెమీ డిజిటల్‌ లేదా ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు. హోండా తమ ఇతర కార్ల మాదిరిగానే ఈ కొత్త కారును అన్ని రకాల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో అందించే అవకాశం ఉంది.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

ఇక చివరిగా ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, హోండా జెడ్ఆర్-వి (Honda ZR-V) ఎస్‌యూవీలో 90 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయగల 1. 2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇందులో మరింత శక్తివంతమైన 116 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ లేదా సుమారు 122 హార్స్ పవర్ శక్తిని విడుదల చేయగల 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది.

బస్తీ మే సవాల్.. Honda కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది కాస్కోండి.. నవంబర్ 11న ఆవిష్కరణ!

గతంలో ఓ సందర్భంలో Honda Cars India Limited ప్రెసిడెంట్ మరియు సీఈఓ Gaku Nakanishi మాట్లాడుతూ.. హోండా భారతదేశంలో ఎస్‌యూవీ విభాగాన్ని ఆసక్తిగా ఆధ్యయనం చేస్తోందని తాను గతంలోనే వెల్లడించానని, ఇప్పుడు తమ సంస్థ ఓ సరికొత్త ఇండియా ఫోకస్డ్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తుందని ధృవీకరించారు. బహుశా, అది ఈ హోండా జెడ్ఆర్-వి ఎస్‌యూవీ కావచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda teases new compact suv zr v launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X