Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
ప్రముఖ వాహన తయారీదారు అయిన హ్యుందాయ్ కంపెనీ యొక్క ప్రసిద్ద ఎస్‌యూవీలలో ఒకటి హ్యుందాయ్ క్రెటా. అంతే కాదు. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో కూడా ఒకటిగా స్థానం సంపాదించుకుంది. హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో అనేక ఫీచర్లు ఉన్నాయి. కానీ ఈ ఎస్‌యూవీలో కొన్ని ఫీచర్లు అందించబడలేదు. ఇందులో ఒకటి ఆటోమాటిక్ టెయిల్ గేట్.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి ఆటోమేటిక్ టెయిల్‌గేట్ ఫీచర్ లేదు. కానీ ఈ క్రెటా ఎస్‌యూవీ మాడిఫికేషన్ ద్వారా టెయిల్ గేట్ పొందింది. దీంతో ఆటోమేటిక్ టెయిల్‌గేట్ ఫీచర్ ఉన్న మొట్ట మొదటి క్రెటా ఎస్‌యూవీగా నిలిచింది.

ఇక్కడ మాడిఫై చేయబడిన కారు హ్యుందాయ్ క్రెటా యొక్క అసలు మోడల్. ఆటోమేటిక్ టెయిల్‌గేట్ ఫీచర్ పొందినప్పటి నుండి ఈ ఎస్‌యూవీ హై-ఎండ్ మోడల్‌గా మార్చబడింది. ఇది చూడటానికి మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో ఆటోమాటిక్ టెయిల్ గేట్ అమర్చబడి ఉంది.
MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

ఈ మాడిఫై చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ వీడియోను యూట్యూబ్ ఛానల్ విక్ ఆటో యాక్సెసరీస్ విడుదల చేసింది. ఈ వీడియో ఆటోమేటిక్ టెయిల్‌గేట్ ఫీచర్‌తో ప్రవేశపెట్టిన భారత దేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా కారును అని వెల్లడించింది.

ఆటోమేటిక్ టెయిల్‌గేట్‌తో పాటు, ఎస్‌యూవీలో ట్రై-బీమ్ ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, హై-విజన్ ఫాగ్ లైట్ బల్బ్, 17-ఇంచ్ స్పోక్ అల్లాయ్ వీల్, మ్యాట్రిక్స్ టైప్ ఓఆర్ విఎం, మరియు బంపర్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్‌లో యాంబియంట్ ఎలక్ట్రిక్ లైట్, స్కఫ్ ప్లేట్, ఆడియో కంట్రోల్ ఆన్ స్టీరింగ్ వీల్, లగ్జరీ సీట్లు వంటి ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి.

ఈ ఎస్‌యూవీలో చేసిన అన్ని మార్పులు కేవలం మంచి ఆకర్షణీయమైన లుక్ కోసం మాత్రమే. ఈ ఎస్‌యూవీలోని ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ ఎస్‌యూవీలోని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అలాగే ఉంచారు.
సాధారణంగా హ్యుందాయ్ మూడు ఇంజన్ ఆప్షన్లతో క్రెటా ఎస్‌యూవీని విక్రయిస్తుంది. సివిటి మరియు మాన్యువల్ గేర్ బాక్స్ 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందించగా, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్‌తో సరఫరా చేయబడింది.
MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఇటీవల కాలంలో చాలామంది వాహనప్రియులు తమ వాహనాలను తమకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మనం ఇప్పటికే చాలా మాడిఫైడ్ బైకులు, కార్ల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పడు మనం తెలుసుకున్న మాడిఫైడ్ క్రెటా ఆటోమాటిక్ టెయిల్‌గేట్ కలిగిన మొట్టమొదటి కారు.