హ్యుందాయ్ క్రెటా 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్ధ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ "హ్యుందాయ్ క్రెటా" అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఈ విభాగంలోకి ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినా, క్రెటానే కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటోంది.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

తాజాగా, హ్యుందాయ్ క్రెటా మరో అరుదైన అమ్మకాల మైలురాయిని చేరుకుంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాను తొలిసారిగా జులై 2015లో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ మోడల్ అమ్మకాలు 6 లక్షల యూనిట్లను దాటాయి. ఇందులో చివరి లక్ష యూనిట్లను కేవలం 8 నెలల వ్యవధిలోనే విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

ఆగస్ట్ 2020 నాటికే హ్యుందాయ్ క్రెటా 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ అంటే, కేవలం 8 నెలల సమయంలోనే ఈ మోడల్ అదనంగా మరో లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించింది. కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ వంటి పరిస్థితుల్లో కూడా క్రెటా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయంటే, ఈ మోడల్‌కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

మొత్తంగా చూసుకుంటే, ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి ఆరు సంవత్సరాల కన్నా తక్కువ వ్యవధిలోనే 6 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. జూలై 21, 2015న హ్యుందాయ్ క్రెటాను తొలిసారిగా మార్కెట్లో విడుదల చేశారు. గతేడాది ఆరంభంలో ఇందులో ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టారు.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

కొత్త 2020 హ్యుందాయ్ క్రెటా మార్కెట్లో వచ్చిన తర్వాత, దాని రివైజ్డ్ డిజైన్ మరియు ఫీచర్ల కారణంగా అమ్మకాలు మరింత పెరిగాయి. పాత తరం హ్యుందాయ్ క్రెటాను విడుదల చేసినప్పటి నుండి కంపెనీ ఇప్పటి వరకూ మొత్తం 6,06,743 యూనిట్లను భారతదేశంలో విక్రయించింది.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

ఇందులో 3,99,787 యూనిట్లు డీజిల్ వేరియంట్లు ఉన్నాయని, మిగిలిన 2,06,956 యూనిట్లు పెట్రోల్ వేరియంట్లు అని కంపెనీ పేర్కొంది. మొత్తం హ్యుందాయ్ క్రెటా అమ్మకాలలో 66 శాతం అమ్మకాలు డీజిల్ వేరియంట్ల నుండి రాగా, మిగిలిన 34 శాతం అమ్మకాలు పెట్రోల్ వేరియంట్ల నుండి వచ్చాయి. క్రెటాలోని 1.5-లీటర్ యుఎస్ సిఆర్డి డీజిల్ ఇంజన్‌కు మంచి డిమాండ్ ఉంది.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఆప్షనల్) అనే నాలుగు వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఇటీవల, కంపెనీ ఇందులో ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ అనే ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ.13.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

హ్యుందాయ్ క్రెటా విషయానికి వస్తే, మొదటి తరం (2015) మోడల్‌తో పోల్చుకుంటే ఈ రెండవ తరం (20200 మోడల్‌లో అనేక కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో ముందు వైపు సరికొత్త క్యాస్కేడింగ్ గ్రిల్‌, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌ల చుట్టూ కొత్తగా రూపొందించిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు క్రింది భాగంలో ఫాక్స్ సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులను గమనించవచ్చు.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

కొత్త 2020 మోడల్ క్రెటా ఇంటీరియర్స్‌లో కూడా అనేక మార్పులు, ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్, డ్రైవర్ సమాచారం కోసం 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వినోదం కోసం పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది హ్యుందాయ్ యొక్క అఫీషియల్ బ్లూ-లింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో పాటుగా యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను కూడా సపోర్ట్ చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా @ 6 లక్షలు: మిడ్-సైజ్ ఎస్‌యూవీలలోనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్!

అంతేకాకుండా, ఈ కారులో వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ప్యాడల్ షిఫ్టర్స్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆంబియెంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Hyundai Creta SUV Sales Reached 6 Lakh Units Milestone In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X