Just In
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 2 hrs ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- Movies
రిలీజ్‌కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
- Sports
రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- News
COVID-19: ముంబాయి, ఢిల్లీని ఐటి హబ్ బీట్ చేస్తోందా ? కరోనా కాటు, ఇక హోటల్స్ దిక్కు !
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెనో-నిస్సాన్ ప్లాంట్ గురించి ఆసక్తికర విషయాలు
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ రెండు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడి వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ రెండు బ్రాండ్లు తమ వాహనాల తయారీ కోసం ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకున్నప్పటికీ, వాటిని వేర్వేరుగా విక్రయిస్తున్నాయి.

చెన్నైలోని ఓరగడం వద్ద రెనో-నిస్సాన్ సంస్థలు సంయుక్తంగా ఓ కార్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఇరు కంపెనీలు ఇటీవల ప్రవేశపెట్టిన నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలతో ఈ ప్లాంట్ ఉత్పత్తి కార్యకాలాపాలు జోరందుకున్నాయి. ఈ కథనంలో రెనో-నిస్సాన్ ప్లాంట్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం రండి.

జపాన్‌కు చెందిన నిస్సాన్ మరియు ఫ్రాన్స్‌కి చెందిన రెనో సంస్థలు ఓ జాయింట్ వెంచర్ (జేవీ)గా ఏర్పడి 2010లో చెన్నైలోని ఓరగడం పారిశ్రామిక ప్రాంతం వద్ద ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ కోసం ఇరు కంపెనీలు సుమారు 4,500 కోట్ల రూపాయల పెట్టుబడిని వెచ్చించారు.
MOST READ:13,000 యూనిట్లు దాటిన హోండా సిబి350 అమ్మకాలు

రెనాల్ట్-నిస్సాన్ కార్ ఫ్యాక్టరీ చెన్నైకి అతి సమీపంలో 640 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడి ఉంది. ఈ కర్మాగారం నిర్వహణ మరియు తయారీతో సహా వివిధ రంగాలలో ప్రత్యక్షంగా వేలాది మందికి మరియు పరోక్షంగా అనేక వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.

చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ రెనో- నిస్సాన్ కార్ ప్లాంట్ సంవత్సరానికి 4 లక్షల కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను కేవలం దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా 69 విదేశీ మార్కెట్లకు కూడా ఇక్కడ నుండి ఎగుమతి చేయబడుతున్నాయి.
MOST READ:సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఈ ప్లాంట్ ఇప్పటివరకు 21 లక్షలకు పైగా కార్లను ఉత్పత్తి చేసింది. ఈ ప్లాంట్‌లో తయారు చేసి, విక్రయించిన మొట్టమొదటి ఉత్పత్తులలో రెనో కొలియోస్ ఎస్‌యూవీ మరియు ఫ్లూయెన్స్ సెడాన్‌లు మొట్టమొదటివి.

ఆ తరువాత ఈ ప్లాంట్ నుండి నిస్సాన్ యొక్క వి ప్లాట్‌ఫామ్‌లో మైక్రా, సన్నీ, పల్స్ మరియు రెనో స్కాలా (నిస్సాన్ సన్నీ కారు యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్) మోడళ్లను ఉత్పత్తు చేశారు. అదేవిధంగా, ఎమ్0 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో (రెనో డస్టర్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్) నిస్సాన్ కిక్స్, రెనో క్యాప్చర్ మరియు రెనో లాజీ వంటి మోడళ్లను కూడా ఉత్పత్తి చేశారు.
MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

అయితే, తక్కువ అమ్మకాల కారణంగా ఇరు కంపెనీలు ఈ కార్లలోని అనేక మోడళ్లను భారతదేశం నుండి ఉపసంహరించడం జరిగింది. కాగా, ఇందులో ఇప్పటిరీ, రెనో డస్టర్, నిస్సాన్ కిక్స్ కార్లు అమ్మకానికి ఉన్నాయి. డాట్సన్ బ్రాండ్ నుండి రెడిగో, గో మరియు గో ప్లస్ కార్లు కూడా ఇదే ప్లాంట్‌లో తయారవుతున్నాయి.

ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా నాలుగు లక్షలు. అయితే ఈ మూడు బ్రాండ్లు (నిస్సాన్, రెనో, డాట్సన్) కలిపి కూడా ఇప్పటి వరకూ సంవత్సరానికి 4 లక్షల కార్లను ఉత్పత్తి చేయలేదు. ప్రస్తుతం రెనో-నిస్సాన్ బ్రాండ్ యొక్క సిఎమ్ఎఫ్-ఎ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించిన క్విడ్ మరియు సిఎమ్‌ఎఫ్-ఎ ప్లస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించబడిన రెనో ట్రైబర్ మోడళ్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది.
MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

అదేవిధంగా, ఇటీవలి కాలంలో నిస్సాన్ ప్రవేశపెట్టిన మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు రెనో ప్రవేశపెట్టిన కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడళ్లకు మార్కెట్ నుండి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ మూడు షిఫ్టులలోనూ కార్ల ఉత్పత్తి కొనసాగుతోంది. ఫలితంగా, ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో పూర్తి స్థాయిలో కార్ల ఉత్పత్తి జరుగుతోంది.

నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనో కైగర్ మోడళ్లకు మార్కెట్ నుండి లభించిన బుకింగ్స్ కారణంగా ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉత్పత్తి కార్యక్రామాలు చురుకుగా సాగుతున్నాయి. అదనపు వాహనాల తయారీ కోసం ఈ ప్లాంట్‌లో కంపెనీ కొత్తగా కొంతమంది తాత్కాలిక సిబ్బందిని కూడా చేర్చుకుంది.

నిస్సాన్ నుండి అత్యంత పాపులర్ అయిన మాగ్నైట్ ఉత్పత్తి కోసం కంపెనీ అదనంగా 1,000 మంది కొత్త సిబ్బందిని తమ ప్లాంట్‌లో నియమించుకుంది. అదేవిధంగా, డీలర్‌షిప్ కేంద్రాలలో పనిచేయడం కోసం 500 మందిని నియమించుకుంది. ఈ కారణాల వలన రాబోయే నెలల్లో నిస్సాన్ వ్యాపారం మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

అంతేకాకుండా, ఈ కార్ ప్లాంట్ రాబోయే సంవత్సరాల్లో తిరిగి లాభదాయక మార్గంలోకి వస్తుందని ఆశిస్తున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమకు డెట్రాయిట్ ఆఫ్ ఆసియాగా ప్రసిద్ది చెందిన చెన్నై, అనేక ఆటోమొబైల్ తయారీ కర్మాగారాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం చెన్నైలో ఫోర్డ్, హ్యుందాయ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి సంస్థల తర్వాత ఈ ప్రాంతంలోని అతిపెద్ద ప్లాంట్లలో రెనో-నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ ఒకటిగా మారింది.