ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఫలితంగా, దేశంలోకి ప్రవేశించే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా, బ్రిటీష్‌కి చెందిన జాగ్వార్ కార్ బ్రాండ్ తమ సరికొత్త ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది.

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

టాటా మోటార్స్‌కి చెందిన జాగ్వార్ భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఐ-పేస్‌ను మార్చ్ 9, 2021వ తేదీన విడుదల చేయనుంది. జాగ్వార్ ఇండియా తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్‌లో గత జనవరిలోనే ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారును లిస్ట్ చేసింది. ఇటీవలే ఈ కారు ముంబై పోర్టులో అన్‌లోడ్ అవుతూ కనిపించింది.

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

దేశీయ మార్కెట్లో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఎస్, ఎస్‌ఈ, హెచ్‌ఎస్‌ఈ అనే మూడు వేరియంట్లలో అందించనున్నారు. ఇవి మూడు కూడా ఒకే ఒక పవర్‌ట్రైన్ ఆప్షన్ (ఈవి400)తో లభ్యం కానున్నాయి.

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తొలిసారిగా 2018లో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. ఇటీవలే ఇందులో సరికొత్త వెర్షన్‌ను ఆవిష్కరించారు. మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే, ఈ సరికొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అనేక అప్‌గ్రేడ్స్ మరియు కీలకమైన ఫీచర్స్ ఉన్నాయి.

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారులో స్లైడింగ్ రూఫ్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి టెయిల్ లైట్స్, హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్, సైడ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4682 మిమీ పొడవును, 2011 మిమీ వెడల్పును మరియు 1566 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 174 మిమీ మరియు వీల్‌బేస్ 2990 మిమీగా ఉంటుంది. ఈ కొలతలతో ఇది విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ 12 కలర్ ఆప్షన్లలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్‌ను అందించబోతోంది.

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

ఈ కలర్ ఆప్షన్లలో ఫుజి వైట్, కాల్డెరా రెడ్, సాంటోరిని బ్లాక్, యలుంగ్ వైట్, సింధు సిల్వర్, ఫ్రాంజి రెడ్, కాసియం బ్లూ, బోరాస్కో గ్రే, అగర్ గ్రే, పోర్టోఫినో బ్లూ, ఫెర్రల్ పెర్ల్ బ్లాక్ మరియు అరుబా మొదలైనవి ఉన్నాయి.

ఈ కారులోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, 8 రకాలుగా సర్దుబాటు చేయగల లుస్టెక్ స్పోర్ట్స్ సీట్లు, 380 వాట్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 3డి సరౌండ్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, యానిమేటెడ్ డైరెక్షనల్ ఇండికేటర్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

ఇందులోని పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, రెండు యాక్సిల్స్‌లో (ఫ్రంట్ అండ్ రియర్) ఒక్కొక్కటి చొప్పున మొత్తం రెండు సింక్రోనస్ పర్మినెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి మొత్తంగా 395 బిహెచ్‌పిల శక్తిని మరియు 696 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది (ఆల్-వీల్ డ్రైవ్).

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. పూర్తి చార్జ్‌పై ఇది 480 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ (మైలేజ్)ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇండియాలో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీ ఖరారు - వివరాలు

జాగ్వార్ ఐ-పేస్‌లో 90 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని 100 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి 0-80 శాతం నుండి ఛార్జ్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. మరోవైపు, 7 కిలోవాట్ ఏసి వాల్ బాక్స్ ఛార్జర్ ఉపయోగించి చార్జ్ చేసినట్లయితే, 10 గంటల వ్యవధిలో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, February 8, 2021, 17:48 [IST]
English summary
Jaguar i-Pace Electric SUV India Launch Timeline Revealed, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+