ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ కార్పోరేట్ కంపెనీ. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేలే ఉద్యోగులకు ఏకంగా ముడు లక్షల రూపాయల ఇన్సెంటివ్ అందిస్తామని తెలిపింది భారతదేశానికి చెందిన జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group). దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicle) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ తమ కంపెనీలో ఓ కొత్త ఈవీ పాలసీ (EV Policy) ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఈ విధానాన్ని ప్రకటించింది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

ఈ ప్రాజెక్ట్ జనవరి 1, 2022 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. భారతదేశంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. భారతదేశం అంతటా పనిచేస్తున్న జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో వాయు కాలుష్య సమస్యను తగ్గించడానికి, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

దేశంలోని వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించేలా వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి కొనుగోలుపై సబ్సిడీలను మరియు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తున్న సంగతి తెలిసినదే. ఇదే తరహాలో, జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా తన JSW EV Policy లో భాగంగా గ్రీన్ ఇనిషియేటివ్‌గా ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు లబ్ధి చేకూర్చనుంది మరియు వారి ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుపై సుమారు రూ.3 లక్షల ప్రయోజనాన్ని అందిస్తుంది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

సాధారణంగా, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ధరలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఫలితంగా, చాలా మంది ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా సుముఖత చూపరు. ఈ నేపథ్యంలో, జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ యొక్క చొరవ చాలా విస్తృతమైన చర్యగా పరిగణించబడుతుంది. కంపెనీ తమ ఉద్యోగులకు రూ.3 లక్షల ఇన్సెంటివ్ అందిస్తున్నందున వారికి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం సులభం అవుతుంది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

ఇది భారతదేశ పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కలిగించే అంశంగా పరిగణించబడుతుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేకొద్దీ ముడిచమురు దిగుమతులపై వెచ్చించే మొత్తం తగ్గి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగించడం వలన వాహనాల నుండి వెలువడే కాలుష్యం తగ్గి వాయు కాలుష్యం తగ్గుతుంది మరియు పర్యావరణం కూడా మెరుగ్గా ఉంటుంది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ తమ ఉద్యోగులకు అందించే రూ.3 లక్షలకు అదనంగా, తమ అన్ని కార్యాలయాలు మరియు ప్లాంట్ల వద్ద ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు మరియు పార్కింగ్ సౌకర్యాలను కూడా అందించనుంది. ఈ గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులు వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. తమ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా ప్రోత్సహించడమే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఉద్దేశమని జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ తెలిపింది. భారతదేశంలోని ఇతర కార్పోరేట్ కంపెనీలు కూడా సమీప భవిష్యత్తులో ఇలాంటి చర్యలనే తీసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

కాబట్టి ఈ విషయంలో జెఎస్‌డబ్ల్యూ తీసుకున్న నిర్ణయం ఓ చక్కటి ఉదాహరణగా పరిగణించబడుతుంది. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ అనుకూలమైనవి మరియు పొదుపుగా ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణకు కూడా పెద్దగా మెయింటినెన్స్ ఖర్చు ఉండదు. ఈ విషయంలో కూడా డబ్బు ఆదా అవుతుంది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ తీసుకున్న నిర్ణయం పట్ల కంపెనీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రూప్ తీసుకున్న నిర్ణయం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే ప్రభుత్వ చర్యకు మద్దతు ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారతదేశంలో, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, అలాగే ఇథనాల్ మరియు సిఎన్‌జి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగం పట్ల ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ.3 లక్షలు ఇన్సెంటివ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి!

భారతదేశంలో వీలైనంత త్వరగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో కూడిన వాహనాలను ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇటీవల ఆయన ఓ హైడ్రోజన్ పవర్డ్ కారును కొనుగోలు చేశారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారేలా ప్రజలను ప్రోత్సహించేందుకు మంత్రి నితిన్ గడ్కరీ ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆటోమొబైల్ కంపెనీలు మరియు వినియోగదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారవలసిన అవసరాన్ని ఆయన అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.

Most Read Articles

English summary
Jsw group offers rs 3 lakh incentive for employees to buy electric vehicle details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X