భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) దేశీయ మార్కెట్లో తమ నాల్గవ మోడల్ 'కియా కారెన్స్' (Kia Carens) ఎమ్‌పివిని అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇతర రెండు కియా మోడళ్లు (సోనెట్ మరియు సెల్టోస్) మాదిరిగానే ఈ కొత్త కారెన్స్ ఎమ్‌పివిని కూడా కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఉన్న కియా ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు పేర్కొంది. ఇక్కడ తయారైన కియా కారెన్స్ ను కంపెనీ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

కియా కారెన్స్ ఎమ్‌పివి భారతదేశంలోనే తయారు కానున్న నేపథ్యంలో, దీని ధర కూడా సరసమైనదిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఈ విభాగంలో నేరుగా టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి ఎమ్‌పివిలకు గట్టిగా పోటీగా నిలిచే అవకాశం ఉంది. భారతదేశంలో కారెన్స్ విజయాన్ని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే, ఈ మోడల్ ఎగుమతుల కారణంగా దాని అమ్మకాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇండోనేషియా మరియు లాటిన్ అమెరికా వంటి దేశాలలో ఇలాంటి 6/7 సీటర్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

కియా మోటార్స్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనంతపూర్ జిల్లాలో ఓ కార్ల తయారీ కేంద్రాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో రెండు షిఫ్టులను నిర్వహిస్తూ, సంవత్సరానికి 3,00,000 కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది దేశీయ మరియు ఎగుమతితో కలిపి కంపెనీ 2,25,000 యూనిట్ల వాహనాలను విక్రయించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే, తాజాగా కారెన్స్ ఎమ్‌పివి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, కంపెనీ తమ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచి, వచ్చే ఏడాది ప్రారంభం నుండి మూడవ షిప్ట్‌ను కూడా ప్రారంభించాలని చూస్తోంది.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

ఈ ప్లాంట్ లో మూడవ షిఫ్టును ప్రారంభించడం ద్వారా కంపెనీ ఏటా 300,000 యూనిట్లకు పైగా వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, రానున్న రోజుల్లో ఈ 3,00,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4,00,000 యూనిట్లకు కూడా పెంచాలని కియా చూస్తోంది. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా వాహనాలను అదించేందుకు కియా ఇండియా మరో ప్లాంట్‌ను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రాబోయే నెలల్లోవెల్లడి కావచ్చు.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

దేశంలో మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు కియా ఇండియా తమ డీలర్‌షిప్‌ లను కూడా విస్తరించాలని చూస్తోంది. కియా ఇండియా 2022 చివరి నాటికి భారతదేశంలోని 225 నగరాల్లో 400 టచ్‌పాయింట్‌లతో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం, కంపెనీ 339 టచ్‌పాయింట్‌లతో 198 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కొత్త లక్ష్యం కియా భారతదేశంలో తన కంపెనీ ఉనికిని గణనీయంగా పెంచుకోవడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లు బ్రాండ్‌ను అనుభూతి చెందడానికి మరియు దానిని ప్రత్యామ్నాయంగా స్వీకరించే అవకాశాన్ని పొందేలా చేయడానికి సహాయపడుతుంది.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

భారతదేశంలోని చిన్న నగరాల్లో కూడా కియా కార్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ ఇటీవల తెలిపింది. తదనుగుణంగా కంపెనీ చిన్న నగరాల్లో కూడా తన ఉనికిని విస్తరించడంపై నిధులను వెచ్చించనుంది. కియా భారత మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రెండేళ్ల సమయంలో కియా సెల్టోస్, కార్నివాల్ మరియు సోనెట్ కార్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, దేశీయ విపణిలో కియా అందిస్తున్న కార్లు వివిధ రకాల పెట్రోల్, డీజిల్ మరియు టర్బో ఇంజన్ ఆప్షన్లతో లభిస్తున్నాయి.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

కియా కారెన్స్ విషయానికి వస్తే, ఇదొక మూడు వరుసల 7-సీటర్ ఎమ్‌పివి. ధర పరంగా ఇది కియా కార్నివాల్ లగ్జరీ ఎమ్‌పివికి దిగువన ప్రవేశపెట్టబడుతుందని భావిస్తున్నారు. మార్కెట్లో దీని ధర సుమారు రూ.16 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఎమ్‌పివి డిజైన్ ను గమనిస్తే, ఇందులో ముందు వైపు కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్‌, సన్నటి ఎల్ఈడి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎక్స్టీరియర్ క్రోమ్ డిజైన్ ఎలిమెంట్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ఫ్లోటింగ్ బాడీ లైన్స్ వంటి అంశాలు ఉన్నాయి.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

ఇంటీరియర్స్ కూడా చాలా ప్రీమియం అప్పీల్ ను కలిగి ఉంటాయి. డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, డ్యాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ డ్యాష్ బోర్డ్ మరియు డోర్ ట్రిమ్స్ పై సిల్వర్ యాక్సెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, విశాలమైన క్యాబిన్ స్పేస్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

అంతేకాకుండా, ఈ కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్లతో కూడిన బోస్ సౌండ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, UVO లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ మొదలైనవి కూడా ఉన్నాయి. హ్యుందాయ్ అల్కాజార్ లో చూసినట్లుగానే కియా కారెన్స్ ఎమ్‌పివిలో కూడా ఫోల్టబుల్ సీట్లు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

ఇక చివరిగా కారెన్స్ ఇంజన్ ఆప్సన్స్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును మూడు ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనుంది. వీటిలో ఒకటి 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇకపోతే, రెండవది 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది 140 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారతదేశంలోనే ఉత్పత్తి కానున్న Kia Carens (కియా కారెన్స్) ఎమ్‌పివి, ఇన్నోవాకి గట్టి పోటీ..!!

ఇక మూడవది 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. కియా కారెన్స్ ఈ విభాగంలో టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎక్స్ఎల్6, ఎర్టిగా, హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Kia carens 7 seater mpv to be produced in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X