Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ (Kia Motors) దేశీయ మార్కెట్లో తన నాల్గవ మోడల్ అయిన 'కియా కారెన్స్' (Kia Carens) ను పరిచయం చేసింది. ఇది 6 మరియు 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో మార్కెట్లో విడుదల కానుంది. ఈ కొత్త MPV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అయితే కొత్త కియా కారెన్స్ డిజైన్, ఫీచర్స్ మొదలైన అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

Kia Carens డిజైన్:

భారతీయ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న ఈ కొత్త Kia Carens మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఈ MPV స్పోర్టీ డిజైన్ పొందుతుంది. ఈ కొత్త కారు యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది. ఈ MPV ఏడు కలర్స్ ఆప్సన్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

Kia Carens ఇంటీరియర్:

Kia Carens మంచి ఎక్స్టీరియర్ డిజైన్ కలిగి ఉంటుంది, కావున ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. Carens లోపలి భాగం చాలా ప్రీమియం మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని క్యాబిన్‌లో ప్రధానంగా బ్లూ మరియు లైట్ బ్రౌన్ కలర్ థీమ్‌లు ఉపయోగించబడ్డాయి.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

ఇందులోని డ్యాష్‌బోర్డ్ మధ్యలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అయితే లో వేరియంట్ లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతే కాకుండా ఇంటీరియర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉన్నాయి. క్యాబిన్లో 64 కలర్ యాంబియంట్ లైటింగ్ అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా దీనిని చాలా ఆధునికంగా కనిపించేలా చేస్తాయి.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

Kia Carens ఫీచర్స్:

Kia Carens ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, UVO కనెక్టెడ్ కార్ టెక్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటికి ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో హ్యుందాయ్ అల్కాజార్ మాదిరిగానే సీట్-బ్యాక్ ఫోల్డింగ్ టేబుల్‌లను పొందుతుంది.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

Kia Carens సేఫ్టీ ఫీచర్స్:

ఇక కొత్త కియా కారెన్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

Kia Carens ఇంజిన్ ఆప్సన్స్:

Kia కంపెనీ తన కొత్త Carens MPV లో తన సెల్టోస్ మాదిరిగానే మూడు ఇంజన్ ఎంపికలను అందిస్తోంది. ఇందులోని 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

ఇక 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 140 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక మూడవది 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

Kia Carens ధర:

కొత్త Kia Carens MPV ధర విషయానికి వస్తే, కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది వివిధ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలతో ప్రీమియం, ప్రెస్టీజ్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే నాలుగు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది. కావున దీని ధర రూ. 16 లక్షల నుండి రూ. 21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంటుంది.

Kia Carens లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇక్కడ చూడండి

Kia Carens యొక్క ప్రత్యర్థులు:

కొత్త Kia Carens రానున్న కొత్త సంవత్సరం అంటే 2022 మొదటి త్రైమాసికంలో ఫిబ్రవరి లేదా మార్చిలో భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత మహీంద్రా మరాజో మరియు మారుతి XL6, హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారి, మహీంద్రా XUV700 మరియు MG హెక్టర్ ప్లస్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kia carens mpv set to launch next year top things you should know details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X