2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీదారులలో ఒకటి 'కియా మోటార్స్' (Kia Motors). కియా మోటార్స్ తన కియా కార్నివాల్ (Kia Carnival) యొక్క 2021 అక్టోబర్ అమ్మకాల నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం కంపెనీ మార్కెట్లో 400 యూనిట్ల కియా కార్నివాల్ కార్లను అమ్మినట్లు తెలిసింది.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

Kia Motors దేశీయ మార్కెట్లో తన కొత్త Kia Carnival ను 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. కియా కార్నివాల్ అనేది భారతీయ మార్కెట్లోని కంపెనీ యొక్క రెండవ మోడల్. ఈ మోడల్ భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి ఆదరణ పొందుతోంది. అయితే భారతదేశంలో విక్రయించబడుతున్న ఈ కారు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వెర్షన్ కంటే ఒక తరం వెనుకబడి ఉంది. అయినప్పటికీ కొనుగోలుదారులను ఆకర్షించడంలో మాత్రమే విజయం పొందుతుంది.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

నివేదికల ప్రకారం కంపెనీ ఈ కార్నివాల్ యొక్క 400 యూనిట్లను విక్రయించి మంచి స్పందనను పొందగలిగింది. ఈ కారు యొక్క ధరను దృష్టిలో ఉంచుకుంటే, 400 యూనిట్లు నిజంగా మంచి అమ్మకాలే అని చెప్పాలి. ప్రస్తుతం, కియా కార్నివాల్ ప్రీమియం ట్రిమ్ ధర రూ. 24.95 లక్షలు కాగా, ఇందులోని టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 33.99 లక్షలు. కియా కార్నివాల్ ప్రస్తుతం నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

కొత్త కియా కార్నివాల్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉండి, అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఈ MPV లో 8 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్, OTA మ్యాప్ అప్‌డేట్, UVO సపోర్ట్, ECM మిర్రర్, వెనుక ప్రయాణీకులకు సింగిల్ 10.1 ఇంచెస్ డిస్‌ప్లే, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఈ లిమోసిన్ ప్లస్ మోడల్‌లో హెర్మాన్ కోర్డాన్ ప్రీమియం 8 స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10 వే పవర్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్ వెంటిలేషన్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

కియా కార్నివాల్ ఇప్పుడు అన్ని మోడళ్లలో 18 ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంది. అంతే కాకుండా ప్రీమియం లెదర్ సీట్లు ఇప్పుడు ప్రెస్టీజ్, లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ మోడల్‌లలో అందించబడుతున్నాయి. ఈ కొత్త 2021 MPV ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. దీనితో పాటు ఇది వివిధ కలర్ ఆప్సన్స్ మరియు వివిధ ఇంజిన్ ఎంపికలు మునుపటిలాగే ఉంటాయి.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

ఈ MPV లో 2.2-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 197 బిహెచ్‌పి పవర్ మరియు 440 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కియా కార్నివాల్ MPV పూర్తిగా CKD ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేయబడింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కియా తయారీ కర్మాగారంలో అసెంబుల్ చేయబడుతుంది.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

కియా మోటార్స్ భారతదేశంలో 2021 కార్నివాల్ MPV ని కొత్త లోగో మరియు మెరుగైన మోడల్‌లతో అప్‌డేట్ చేసింది. ఇది ఈ విభాగంలో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైనదిగా ఉంటుంది. కార్నివాల్ MPV కి భారతదేశంలో ప్రత్యక్ష పోటీదారులు లేరు. దేశీయ విపణిలో ఈ ధరకు అందుబాటులో ఉన్న ఏకైక లగ్జరీ MPV కియా కార్నివాల్.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

కియా ఇండియా ఇటీవల తన అక్టోబర్ 2021 నెలవారీ విక్రయాల నివేదికను విడుదల చేసింది. నివేదికల ప్రకారం, కియా ఇండియా గత నెలలో 16,331 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ 21,021 యూనిట్లను విక్రయించింది. ఇది వార్షిక అమ్మకాలలో 22.31% తగ్గుదలని నమోదు చేసింది.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

ఈ ఏడాది సెప్టెంబర్‌లో కియా ఇండియా 14,441 యూనిట్లను విక్రయించింది. గత నెల విక్రయాలతో పోలిస్తే ఇది 13.09% వృద్ధిని నమోదు చేయగలిగింది. కానీ వార్షిక విక్రయాల్లో మాత్రం ఎక్కువ తగ్గుదలను నమోదు చేసింది. కియా ఇండియా దాని సెల్టోస్ మరియు సోనెట్ యొక్క అమ్మకాలతో మొత్తం అమ్మకాలలో మంచి వృద్ధిని పొందగలుగుతోంది.

2021 అక్టోబర్ అమ్మకాలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసిన Kia Carnival: వివరాలు

ఇటీవలే భారత మార్కెట్లో 3 లక్షల కార్లను విక్రయించి కియా ఇండియా ఒక కొత్త మైలురాయిని సాధించింది. కియా ఇండియా భారతదేశంలో అత్యంత వేగంగా 3 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న కార్ల తయారీ సంస్థలలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఆటో మొబైల్ పరిశ్రమ చిప్ సమస్యలను ఎదుర్కొంటోంది. కానీ రాబోయే కొద్ది రోజుల్లో ఈ సమస్య పరిష్కరించబడుతుంది. తరువాత అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

Most Read Articles

English summary
Kia india sold 400 units of carnival in october 2021 details
Story first published: Saturday, November 6, 2021, 18:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X