రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్‌లో కంపెనీ ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను రేపు భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కియా సెల్టోస్ గ్రావిటీ ఎడిషన్ పేరిట కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేయనుంది.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

కొత్త 2021 కియా సెల్టోస్ గ్రావిటీ ఎడిషన్‌తో పాటుగా కంపెనీ రెండు కొత్త వేరియంట్ సెల్టోస్ మోడళ్లను కూడా విడుదల చేయనుంది. ఇందులో సెల్టోస్ ఐఎమ్‌టి హెచ్‌టికె ప్లస్ మరియు టర్బో జిటిఎక్స్ (ఆప్షనల్) వేరియంట్లు ఉన్నట్లు సమాచారం.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

కియా మోటార్స్ ఇప్పటికే తమ సెల్టోస్ గ్రావిటీ ఎడిషన్ మోడల్‌ను కొరియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు స్పెషల్ మోడల్ ఇండియా మార్కెట్లో కూడా విడుదల కానుంది. స్టాండర్డ్ సెల్టోస్‌తో పోల్చుకుంటే ఆ స్పెషల్ ఎడిషన్ కియా సెల్టోస్‌లో అనేక అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఒకప్పుడు నెంబర్ వన్‌గా ఉన్న కియా సెల్టోస్, కొత్త తరం హ్యుందాయ్ క్రెటా రాకతో అమ్మకాల పరంగా వెనుకపడింది. ఈ నేపథ్యంలో, కియా సెల్టోస్‌కి పూర్వ వైభవాన్ని అందించేందుకు కంపెనీ కృషి చేస్తోంది.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

మరోవైపు కియా సెల్టోస్ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. గత రెండేళ్లుగా ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్మడవుతూ, గణనీయమైన వృద్ధని సాధించింది.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

కియా సెల్టోస్ గ్రావిటీ ఎడిషన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ మోడల్‌ను టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్‌గా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో స్వల్వంగా అప్‌గ్రేడ్ చేయబడిన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులను కలిగి ఉంటుంది.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

ఇందులోని డిజైన్ మార్పుల విషయానికొస్తే, ఈ ఎస్‌యూవీలో బెస్పోక్, 3డి ఎలిమెంట్స్‌తో కూడిన క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త డ్యూయల్-టోన్ 18-ఇంచ్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, డోర్ గార్నిష్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్‌తో పాటు అవుట్ సైడ్ మిర్రర్లపై సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

క్యాబిన్ లోపల, ఇంటీరియర్స్‌ను గమనిస్తే కొత్త కియా సెల్టోస్ గ్రావిటీ ఎడిషన్‌లో ప్రత్యేకమైన గ్రే కలర్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కొత్తగా ఫార్వర్డ్ కొల్లైజన్ ప్రివెన్షన్ అసిస్టెన్స్ సిస్టమ్ మరియు రియర్ ప్యాసింజర్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

అంతేకాకుండా, ప్రస్తుత సెల్టోస్‌లో లభించే 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యువిఓ కనెక్టెడ్ కార్ టెక్, ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసి వంటి అనేక ఫీచర్లను ఈ కొత్త స్పెషల్ ఎడిషన్‌లోనూ కొనసాగించవచ్చు. ఇందులో లేన్ కీప్ అసిస్ట్ మరియు హై -బీమ్ అసిస్ట్ ఫంక్షన్ కూడా ఉంటుంది.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

ఇంజన్ పరంగా చూసుకుంటే, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇందులో 1.5-లీటర్ 4-సిలిండర్ న్యాచురల్ పెట్రోల్ వెర్షన్‌లో ఐఎమ్‌టి గేర్‌బాక్స్‌ను ఉపయోగించనున్నారు. ఇది 113 బిహెచ్‌పి పవర్‌ను మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

కాగా, కొత్తగా వస్తున్న సెల్టోస్ జిటిఎక్స్ (ఓ) వేరియంట్ ఈ ప్రోడక్ట్ లైనప్‌లో కొత్త టాప్-ఎండ్ టర్బో-పెట్రోల్ వేరియంట్ కానుంది. ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం. ఈ వేరియంట్‌లో 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.

రేపే కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల - వివరాలు

ఈ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్‌లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందులో 113 బిహెచ్‌పి, 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Kia Motors To Launch New 2021 Seltos Facelift Tomorrow, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X