కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ సెల్టోస్‌లో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫేస్ట్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మడువుతోంది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

భారత మార్కెట్లో కియా సెల్టోస్‌ను విడుదల చేసి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. గత రెండేళ్లుగా ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్మడవుతూ, గణనీయమైన వృద్ధని సాధించింది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

కియా తమ సెల్టోస్ ఎస్‌యూవీ ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కొద్ది సమయంలోనే ఈ ఎస్‌యూవీకి మార్కెట్ నుండి భారీ డిమాండ్ రావడంతో కంపెనీ గడచిన సంవత్సరం ఇందులో స్పెషల్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. ఇటీవలే కియా మరో కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసినదే.

MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

ఇక 2021 కియా సెల్టోస్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది మరింత రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఇది చూడటానికి ఇంటర్నేషనల్ మార్కెట్లలో లభిస్తున్న మోడల్ మాదిరిగానే కనిపించే అకాశం ఉంది. ఇందులో రిఫ్రెష్డ్ బంపర్స్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో రీడిజైన్ చేసిన హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ మరియు ఫ్రంట్ గ్రిల్ వంటి మార్పులతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. అలాగే, ఇందులో మరిన్ని కొత్త వేరియంట్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టే అకాశం ఉంది.

MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

సైడ్ డిజైన్‌లో కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ మినహా వేరే ఇతర మార్పులు ఉండబోవని తెలుస్తోంది. అంతేకాకుండా, ఓవరాల్ కియా సెల్టోస్ డిజైన్ సిల్హౌట్ కూడా ప్రస్తుత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. సెల్టోస్ దాని అద్భుతమైన డిజైన్ కారణంగా, మంచి రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంటుంది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

కొత్త 2021 కియా సెల్టోస్ కారులో కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సెల్టోస్ ఇంజన్ ఆప్షన్లనే కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోనూ కొనసాగించనున్నట్లు సమాచారం.

MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

కియా సెల్టోస్‌ను రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. ఇందులో మొదటిది 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ 115 బిహెచ్‌పి మరియు 142 ఎన్ఎమ్ టార్క్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

ఇకపోతే, ఇందులో రెండవది 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ పీక్ టార్క్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

సెల్టోస్‌లో రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉంటాయి. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు ఒకేరకంగా 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 114 ఎన్ఎమ్, 250 ఎన్ఎమ్ టార్క్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

కియా సెల్టోస్ కారులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీటుతో వెంటిలేటెడ్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో దీని ధరలు రూ. 9.89 లక్షల నుండి రూ.17.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?

కాగా, ఈ కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది మధ్య భాగం నాటికి మార్కెట్లో విడుదలవుతుందని అంచనా. ఇందులో చేయబోయే అప్‌గ్రేడ్స్ కారణంగా మార్కెట్లోని ప్రస్తుత మోడల్ కంటే దీని ధర సుమారు రూ.30,000 నుంచి రూ.45,000 వరకూ అధికంగా ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
Kia Seltos SUV Facelift Launch Timeline And Expected Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X