సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో తమ సరకొత్త బ్రాండ్ లోగోను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇకపై కియా మోటార్స్ విక్రియంచే అన్ని కార్లపై ఈ కొత్త బ్రాండ్ లోగో కనిపిస్తుంది.

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

తాజాగా, కొత్త కియా బ్రాండ్ లోగోతో కూడిన సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఓ కియా మోటార్స్ డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైంది. కొత్త కియా సోనెట్‌పై లోగో మార్పు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. అయితే, కంపెనీ తమ కియా సోనెట్ వేరియంట్ లైనప్‌లో మాత్రం స్వల్ప మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

ఈ కొరియన్ కంపెనీ తమ సంస్థ పేరును 'కియా మోటార్స్' నుండి 'కియా' గా మార్చడం ద్వారా తన కార్పొరేట్ గుర్తింపును కూడా మార్చాలనే ఉద్దేశ్యంతో, ఈ ఏడాది జనవరిలో తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. కేవలం భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించే అన్ని కియా కార్లపై ఈ కొత్త లోగో కనిపించనుంది.

MOST READ:2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

అప్‌డేటెడ్ కియా లోగోతో కూడిన కొత్త సోనెట్ యొక్క మొదటి చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి ఇది మార్కెట్లో విడుదల అవుతుందని అంచనా. తాజా నివేదికల ప్రకారం, కంపెనీ ఈ మోడల్‌లో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేయవచ్చు. అవి - హెచ్‌టిఎక్స్ పెట్రోల్ డిసిటి మరియు హెచ్‌టిఎక్స్ డీజిల్ ఏటి.

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టడంతో పాటుగా కంపెనీ తమ సోనెట్ లైనప్ నుండి హెచ్‌టికె + పెట్రోల్ డిసిటి, హెచ్‌టికె + డీజిల్ ఏటి మరియు హెచ్‌టిఎక్స్ + డీజిల్ ఏటి వేరియంట్లను డిస్‌కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

హెచ్‌టిఎక్స్ ట్రిమ్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

కియా సోనెట్ మొత్తం మూడు రకాల ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఇందులో ఒకటి 84 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

ఇకపోతే, రెండవది 119 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ (ఐఎమ్‌టి) ఇంటెలిజెంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తుంది.

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

ఈ కారులోని డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇవి రెండు వేర్వేరు ట్యూనింగ్స్‌లో లభిస్తాయి. అందులో మొదటిది 99 బిహెచ్‍‌పి పవర్, 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ వేస్ట్-గేట్ టర్బో (డబ్ల్యుజిటి). ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తుంది.

MOST READ:మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్‌చల్ [వీడియో]

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

ఇకపోతే రెండవది 114 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ వేరియబుల్ జియోమెట్రీ టర్బో (విజిటి) డీజిల్ ఇంజన్. ఇది సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తుంది.

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీలో కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ మొదలైనవి ఉన్నాయి.

సరికొత్త లోగోతో డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్న కియా సోనెట్

ఇంకా ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కియా బ్రాండ్ యొక్క యువో కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్ ఇలా మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Source: Rushlane

Most Read Articles

English summary
Kia Sonet Spotted With New Logo At Dealership; India Launch Expected Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X