అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) అందిస్తున్న Swift (స్విఫ్ట్) కారు అంటే మీకు ఇష్టమా? ఒకవేళ మీరు ఆ కారుని కొనాలని చూస్తున్నట్లయితే, దాని సేఫ్టీ గురించి మరొక్కసారి ఆలోచించండి.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 చిన్న కార్లలో హీరో అనిపించుకునే Maruti Suzuki Swift, సేఫ్టీలో మాత్రం జీరో అనిపించుకుంది. ఈ కారు కోసం ఇటీవల లాటిన్ ఎన్‌క్యాప్ (Latin NCAP) క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో తయారైన Swift 'సున్నా స్టార్ రేటింగ్' (Zero Rating)ను పొందింది.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

ఈ క్రాష్ పరీక్షలో ఉపయోగించిన Swift కారుని భారతదేశంలోని గుజరాత్ లో ఉన్న Maruti Suzuki ప్లాంట్ లో తయారు చేశారు. లాటిన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో తయారైన Swift వయోజన భద్రత విషయంలో 15.53 శాతం మరియు పిల్లల భద్రత విషయంలో సున్నాగా రేట్ చేయబడింది.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

అదే సమయంలో, ఇది పాదచారులకు సంబంధించిన భద్రత విషయంలో 66 శాతం మరియు ఇతర భద్రతా లక్షణాల విషయంలో 7 శాతం రేటింగ్ ను పొందింది. లాటిన్ ఎన్‌క్యాప్ నివేదికలో, ఈ కారు యొక్క పేలవమైన సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ మరియు పరీక్ష సమయంలో పేలవమైన డోర్ పనితీరు కోసం గాను Swift కి జీరో స్టార్ రేటింగ్ ఇవ్వబడింది.

అంతే కాకుండా, ఈ కారు వెనుక ప్రభావ రక్షణ పనితీరు కూడా సంతృప్తికరంగా లేదని ఈ నివేదిక పేర్కొంది. Swift కారులో ప్రయాణీకుల హెడ్ ప్రొటెక్షన్ కోసం అందించే సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఇందులో లేవు మరియు దీనిని లాటిన్ ఎన్‌క్యాప్ పెద్ద లోపంగా పరిగణించింది.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా Swift కారును 6 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) తో విక్రయించబడుతుందని, లాటిన్ అమెరికాలో విక్రయించే మోడళ్లలో సైడ్ బాడీ, హెడ్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ESC వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లేవని లాటిన్ ఎన్‌క్యాప్ తెలిపింది.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

అంతే కాకుండా, లాటిన్ అమెరికన్ కస్టమర్లు కార్లలో ఈ ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను ఎలాంటి అధనపు డబ్బు చెల్లించకుండానే అడగవచ్చని లాటిన్ ఎన్‌క్యాప్ పేర్కొంది. ఇవి పరిపక్వ ఆర్థిక వ్యవస్థల మార్కెట్లలో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా పరిగణించబడే ప్రాథమిక వాహన భద్రతా లక్షణాలు అని ఏజెన్సీ తెలిపింది.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

Maruti Suzuki మునుపటి సేఫ్టీ రేటింగ్‌లు కూడా చెడ్డవే!

క్రాష్ టెస్ట్‌లలో Maruti Suzuki అందిస్తున్న కార్లు గతంలో కూడా పేలవమైన ప్రదర్శనను కనబరచాయి. గత 2014 గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో కూడా Swift సున్నా స్టార్ రేటింగ్‌ను పొందింది. ఆ సమయంలో, Swift యొక్క బేస్ వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఏబిఎస్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో లేవు. ఇవి కావాలంటే, అధనపు ధర చెల్లించాల్సి వచ్చేది.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

అదే సమయంలో, యూరోపియన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో, ప్రస్తుత 3వ తరం Swift 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ రేటింగ్ Swift యొక్క ప్రామాణిక వేరియంట్‌కు ఇవ్వబడింది, అయితే మరిన్ని ఫీచర్లతో లభిస్తున్న ఆప్షనల్ సేఫ్టీ ప్యాక్ వేరియంట్ మాత్రం ఇందులో 4-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

ఇండియన్ మోడల్ Swift కూడా సురక్షితమైనది కాదు!

గత 2018 లో భారతదేశంలో విడుదలైన అయిన కొత్త Swift కారుని గ్లోబల్ ఎన్‌క్యాప్ మళ్లీ క్రాష్-టెస్ట్ చేసింది. ఈసారి కొత్త-తరం Swift వయోజన భద్రత కోసం 2 స్టార్‌ల సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఆ సమయంలో వచ్చిన గ్లోబల్ ఎన్‌క్యాప్ రిపోర్ట్, ఈ కారు పెద్దల భద్రతకు అంత అనువైనదని కాదని చెప్పింది. Swift బాడీ అస్థిరంగా ఉందని మరియు ఇది ఫార్వర్డ్ లోడ్‌ను తట్టుకోలేకపోతుందని టెస్టింగ్ ఏజెన్సీ నివేదించింది.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

కొత్త తరం 2021 Swift లో లభించే సేఫ్టీ ఫీచర్లు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త తరం 2021 Swift కారులో ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, పాదచారుల రక్షణ, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, ప్రీ-టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిటర్‌తో కూడిన ఫ్రంట్ సీట్ బెల్ట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు బజర్ (డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సైడ్), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తున్నాయి.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

కొత్త తరం 2021 Swift లోని ప్రధాన ఫీచర్లు

ఈ కారులో లభించే ప్రధాన ఎక్స్టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్ఈడి డిఆర్‌ఎల్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, 15 ఇంచ్ ప్రెసిషన్ కట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ కలర్ ఆప్షన్, రియర్ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఫాగ్ లాంప్స్, పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, రియర్ వాష్ అండ్ వైపర్ మరియు డీఫాగర్ వంటివి ఉన్నాయి.

అబ్బే.. ఇలాంటి కారునా మనం కొంటోంది: సేఫ్టీలో Swift కి 'సున్నా' రేటింగ్!

ఇక ఇందులోని ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, బాహ్య ఉష్ణోగ్రత ప్రదర్శన, డ్రైవర్ విండో ఆటో అప్ మరియు యాంటీ పించ్ ఫంక్షన్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, కలర్ ఎమ్ఐడి, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్మార్ట్ ప్లే స్టూడియో అప్లికేషన్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్‌తో కూడిన నావిగేషన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, సర్దుబాటు చేయగల వెనుక హెడ్‌రెస్ట్‌లు మరియు 60:40 ఫోల్డింగ్ రియర్ సీట్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

Most Read Articles

English summary
Made in india maruti suzuki swift scores zero star rating in latin ncap crash test details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X