మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం చెందిన వాహన తయారీదారులలో "మహీంద్రా & మహీంద్రా" తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. మహీంద్రా వాహనాలకు ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచదేశాలతో మంచి పేరుప్రఖ్యాతులున్నాయి. మహీంద్రా కంపెనీ యొక్క ఉత్పత్తులలో ఇప్పటి వరకు మార్కెట్లో తిరుగులేకుండా అమ్ముడవుతున్న వాహనాలలో మహీంద్రా బొలెరో చెప్పుకోదగ్గది.

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

మహీంద్రా కంపెనీ యొక్క మహీంద్రా బొలెరో ఇప్పటికీ ఉత్పత్తిలో ఉంది. మహీంద్రా బొలెరో దేశంలోని గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాలలోని కొనుగోలుదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. చాలా సంవత్సరాల ప్రయోగం తర్వాత కూడా ఇది అదే రూపకల్పనతో అమ్ముడవుతోంది.

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

అయితే మహీంద్రా కంపెనీ తన మహీంద్రా బొలెరో వాహనాన్ని బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసింది. అంతే కాకూండా ఇందులో అధునాతన సేఫ్టీ ఫెచర్స్ కూడా అనుబాటులో ఉన్నాయి. ఇప్పడు కొత్త బొలెరో డిజైన్ మరియు ఫీచర్స్ కూడా అప్డేట్ చేయబడ్డాయి. కావున ఇది మునుపటికంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ:కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో చాలామంది వాహనతయారీదారులు తమ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా యాక్ససరీస్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే, కావున ఈ నేపథ్యంలో భాగంగా లైనప్‌లోని ఇతర ఎస్‌యూవీ కార్ల మాదిరిగానే మహీంద్రా ఇప్పుడు బొలెరో కోసం జెన్యూన్ యాక్సెసరీస్ ప్యాకేజీని విడుదల చేసింది.

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

మహీంద్రా కంపెనీ బొలెరో కోసం విడుదల చేసిన యాక్ససరీస్ ప్యాకేజీలో గ్రిల్, హెడ్‌లైట్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్స్ వంటివి ఉన్నాయి. ఈ యాక్ససరీస్ ప్యాకేజీ ధరను కంపెనీ 1,04,800 రూపాయలుగా నిర్ణయించింది.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ప్రస్తుతం కంపెనీ మహీంద్రా బోలెరోను మూడు డీజిల్ వేరియంట్లలో అందిస్తుంది. అవి బి 4, బి 6 మరియు బి 6(ఓ) అనే వేరియంట్లు. కంపెనీ ఇప్పుడు అన్ని వేరియంట్ల కోసం యాక్ససరీస్ ప్యాకేజీలు అందుబాటులో ఉంచింది. వినియోగదారుడు వేరియంట్ ను బట్టి యాక్ససరీస్ ప్యాకేజ్ ఎంచుకునే అవకాశం ఉంది.

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

మహీంద్రా బొలెరో యొక్క బి 6(ఓ) ట్రిమ్ స్పష్టమైన లెన్స్ టెయిల్ లాంప్‌ను అందిస్తుంది, ఇది, లో వేరియంట్‌లతో అందుబాటులో లేదు. బంపర్‌పై రియర్ పార్కింగ్ సెన్సార్లను కూడా కలిగి ఉంది. మహీంద్రా బోలెరోలో 7 మంది వరకు కూర్చునే సామర్థ్యం ఉన్న మూడు వరుసల సీట్లు ఇవ్వబడ్డాయి.

MOST READ:భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

బొలెరో యొక్క టాప్-ఎండ్ ట్రిమ్ నాలుగు పవర్ విండోస్ మరియు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది. బొలెరో యొక్క ఏ వేరియంట్లలోనూ రియర్ ఎసి వెంట్ లేదు. దీని డాష్‌బోర్డ్‌లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. మహీంద్రా బొలెరో ఇప్పటికీ మంచి అమ్మకాలను కొనసాగిస్తోంది అంటే దానిపై ప్రజలకున్న అభిమానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

కొత్త మహీంద్రా బొలెరో ఉన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 75 బిహెచ్‌పి పవర్ మరియు 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మహీంద్రా తన బొలెరోను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో అందిస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కావున ఎటువంతో రోడ్డులో అయినా డ్రైవ్ చేయడానికి చాలా అనుకొల్లంగా ఉంటుంది.

MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్

మహీంద్రా & మహీంద్రా కంపెనీ 2021 ఏప్రిల్ నెలలో తన ఎస్‌యూవీ కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెలలో వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్ దాదాపు రూ. 2.40 లక్షల వరకు ఆదా చేసే అవకాశాన్ని పొందుతారు. ప్రస్తుతం కొత్త మహీంద్రా థార్ మినహా మిగతా అన్ని మోడళ్లపై డిస్కౌంట్ పొందవచ్చు.

మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

మహీంద్రా రాబోయే రోజుల్లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మహీంద్రా ఎక్స్‌యూవీ 700 అనే కొత్త ఎస్‌యూవీని తీసుకువస్తున్నట్లు మహీంద్రా ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ మూడు కొత్త కార్లపై పనిచేస్తోంది. ఇటీవల, మహీంద్రా యొక్క కొత్త కార్ల చిత్రాలు కూడా లీక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కంపెనీ త్వరలో తమ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతుందని అర్థమవుతుంది.

Image Courtesy: CarDirector

Most Read Articles

English summary
Mahindra Bolero Accessories Package Launched Details. Read in Telugu.
Story first published: Monday, April 19, 2021, 9:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X