స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫిబ్రవరి 2021 అమ్మకాల వివరాలను వెల్లడించింది. గత నెలలోకంపెనీ దేశీయంగా 15,391 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో మహీంద్రా దేశీయ అమ్మకాలు 10,938 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 40.7 శాతం వార్షిక వృద్ధిని కనబరిచాయి.

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

ఫిబ్రవరి 2021లో అమ్మకాల పరంగా భారతదేశపు టాప్ 10 కంపెనీలలో మహీంద్రా ఐదవ స్థానంలో ఉంది. ఈ జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మరియు కియా కంపెనీల తర్వాత మహీంద్రా నిలిచింది. మహీంద్రా నుండి బొలెరో మరియు స్కార్పియో మోడళ్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి.

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

గత నెలలో మహీంద్రా బొలెరో అమ్మకాలు స్కార్పియో అమ్మకాలను అధిగమించాయి. ఈ సమయంలో బోలెరో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో స్కార్పియో, ఎక్స్‌యూవీ300 మరియు థార్ మోడళ్లు నిలిచాయి. ఫిబ్రవరి 2021లో మహీంద్రా మోడల్ వారీగా అమ్మకాలు ఇలా ఉన్నాయి.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

మహీంద్రా బొలెరో ఫిబ్రవరి 2021 నెలలో 4,843 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకుంది. గతేడాది ఫిబ్రవరి 2020లో ఈ మోడల్ అమ్మకాలు 4067 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బొలెరో అమ్మకాలు 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే, జనవరి 2021లో విక్రయించిన 7,567 యూనిట్లతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 36 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

గత నెలలో 3,532 యూనిట్ల విక్రయాలను నమోదు చేసిన మహీంద్రా స్కార్పియో ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే సమయంలో స్కార్పియో విక్రయాలు 1,505 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో స్కార్పియో అమ్మకాలు 135 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే, జనవరి 2021లో విక్రయించిన 4,083 యూనిట్లతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 13 శాతం తగ్గాయి.

MOST READ:జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు ఫిబ్రవరి 2021 నెలలో 3,174 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ మోడల్ అమ్మకాలు 2,431 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఎక్స్‌యూవీ300 అమ్మకాలు 31 శాతం పెరిగాయి. జనవరి 2021లో విక్రయించిన 4,612 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 31 శాతం క్షీణించాయి.

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

మహీంద్రా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన నెక్స్ట్ జనరేషన్ థార్ ఎస్‌యూవీ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. గత ఫిబ్రవరి నెలలో 2,842 థార్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. జనవరి 2021లో ఈ మోడల్ అమ్మకాలు 3,152 యూనిట్లుగా ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ500 అమ్మకాలు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. గడచిన ఫిబ్రవరిలో 829 యూనిట్ల ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.

MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

గత సంవత్సరంతో పోలిస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ500 అమ్మకాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, జనవరి 2021తో పోల్చితే ఇవి 7 శాతం తగ్గాయి. ఈ సంవత్సరం స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 మోడళ్లలో కంపెనీ సరికొత్త తరం మోడళ్లను విడుదల చేయనుందనే వార్తతో వీటి అమ్మకాలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

మహీంద్రా అందిస్తున్న ఎమ్‌పివి మరాజ్జో గడచిన ఫిబ్రవరిలో కేవలం 120 యూనిట్ల విక్రయాలను మాత్రమే నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 90 శాతం తగ్గాయి. ఫిబ్రవరి 2021 నెలలో మహీంద్రా ఆల్టురాస్ జి4 ప్రీమియం ఎస్‌యూవీ అమ్మకాలు 36 యూనిట్లుగా ఉన్నాయి.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

స్కార్పియోని ఓవర్‌టేక్ చేసిన బొలెరో; నాల్గవ స్థానంలో మహీంద్రా థార్

గత నెలలో కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ మహీంద్రా కెయూవీ100 అమ్మకాలు కేవలం 4 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి. మహీంద్రా నుండి ఈ ఏడాది కొత్తగా రానున్న నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా స్కార్పియో మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడళ్లతో భవిష్యత్తులో కంపెనీ అమ్మకాలు జోరందుకునే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra February 2021 Sales Report: Bolero Tops The List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X