2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధమవుతున్న Mahindra.. వివరాలు

దేశీయ విఫణిలో ఇంధన ధరలు రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో చాలామంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. కావున దేశీయ మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు తమ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి గణనీయమైన వృద్ధిని సొంతం చేసుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు అడుగులు వేస్తోంది.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

నివేదికల ప్రకారం మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లో తన స్థానాన్ని బలపరచుకోవడం కోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కంపెనీ వచ్చే 2027 నాటికి మొత్తం 16 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

మహీంద్రా ప్రారంభించనున్న ఈ 16 ఎలక్ట్రిక్ వాహనాలలో SUV లు మరియు లైట్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఉండనున్నాయి. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ వాహనాలలో ఎనిమిది బ్యాటరీతో నడిచే ఎస్‌యూవీలు ఉంటాయి.

మహీంద్రా వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ, 2027 నాటికి 16 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోందని. ఇందులో దాదాపు 8 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఉంటాయి అన్నారు. 2027 నాటికి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీల నుంచి 20 శాతం విక్రయాలు సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV విభాగంలో చాలా వేగవంతమైన అభివృద్ధిని సాధించడానికి కంకణం కట్టుకున్నట్లు మనకు తెలుస్తుంది.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

ఇందులో భాగంగానే దేశీయ వాహన తయారీ సంస్థ Mahindra 2025 మరియు 2027 సమయంలో భారత మార్కెట్లో నాలుగు కొత్త ఎలక్ట్రిక్ SUV లను పరిచయం చేయనుంది. అంతే కాకుండా లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్ విభాగంలో కూడా 2027 నాటికి ఎనిమిది ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తుంది.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం ఇప్పటికే కంపెనీ విడుదల చేసిన కొన్ని మోడల్స్ ఎలక్ట్రిక్ వెర్షన్లో రానున్నత్కు తెలిసింది. మరికొన్ని వాహనాలు పూర్తిగా కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలుగా రానున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కంపెనీ దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలనే సంకల్పంతో, ఎలక్ట్రిక్ వాహన విభాగం కోసం ఏకంగా రూ. 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా మహీంద్రా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త బ్రాండ్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మహీంద్రా తన EV వ్యాపారంలోకి ప్రైవేట్ పెట్టుబడిదారులను స్వాగతిస్తున్నట్లు కూడా ధృవీకరించింది. భవిష్యత్ మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది, కావున కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా కంపెనీ తన ఉనికిని చాటుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

మహీంద్రా కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త మహీంద్రా XUV700 కి కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మహీంద్రా XUV700 కోసం కంపెనీ ఇప్పటివరకు 65,000 కంటే ఎక్కువ యూనిట్ల బుకింగ్‌లను పొందింది. మహీంద్రా XUV700 యొక్క పెట్రోల్ మోడల్ డెలివరీలు అక్టోబర్ 30 నుండి ప్రారంభం కాగా, డీజిల్ మోడల్స్ డెలివరీలు నవంబర్ చివరి వారం నుండి ప్రారంభమవుతాయి.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

మహీంద్రా XUV 700 ఐదు-సీట్ల వేరియంట్ యొక్క బుకింగ్ యొక్క ప్రారంభ ధర రూ. 11.99 లక్షలతో ప్రారంభించబడింది. ఈ ధరను కేవలం 25,000 యూనిట్ల బుకింగ్ వరకు మాత్రమే నిర్ణయించబడి ఉంది. ఆ తర్వాత బుకింగ్ చేఉకునేవారికి ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు ఉంటుంది.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

మహీంద్రా XUV700 ఆధునిక ఫీచర్లతో మరియు కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. XUV700 అనేది డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. అంతే కాకుండా XUV700 ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ డ్రైనెస్ అలర్ట్ సిస్టమ్ వంటి కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. XUV700లో లెవెల్ 1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) అందించబడింది. ఈ సిస్టమ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్, అటానమస్ బ్రేకింగ్ మరియు లేన్-లీప్ అసిస్ట్ వంటి ఫీచర్లను నియంత్రిస్తుంది.

2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాల విడుదలకు సిద్ధం: Mahindra

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

మహీంద్రా కంపెనీ రానున్న కాలంలో SUV ల మాదిరిగానే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా మంచి ఆదరణ పొందుతుందని మేము భావిస్తున్నాము.

NOTE: ఇక్కడ ఉపయోగించిన చిత్రాలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Mahindra to launch 16 electric vehicles by 2027 details
Story first published: Thursday, November 11, 2021, 9:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X