విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ700'ను కంపెనీ ఈనెల 14వ తేదీన అధికారికంగా ఆవిష్కరించనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్లను వెల్లడించే టీజర్‌ను ఆవిష్కరించింది.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

ఈ టీజర్‌లో కంపెనీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క లోపలి భాగాన్ని వెల్లడి చేసింది. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్‌లో సరికొత్త అడ్రినాక్స్ టెక్నాలజీతో కూడిన డ్యూయెల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. మన దేశంలో లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లలో ఈ తరహా టెక్నాలజీని చూడవచ్చు.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

ఇంటీరియర్‌లో బ్లాక్ మరియు బేజ్ కలర్‌తో కూడిన డ్యూయెల్ టోన్ థీమ్ డాష్‌బోర్డ్, లెదర్ సీట్లు మరియు డోర్ ప్యాడ్‌లపై లెథర్ ఇన్సెర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను కూడా ఆఫర్ చేయనున్నారు.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

అంతేకాకుండా, ఈ కారులో క్యాబిన్‌ లోపల సెంటర్ ఎయిర్ కండిషన్ వెంట్‌లను ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింద ఉంచబడ్డాయి, దీనికి క్రోమ్ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి. ఫలితంగా ఇవి క్యాబిన్‌కు మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తాయి.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

ఇందులో ఇచ్చిన ఎయిర్ కండిషన్ రెండు రోటరీ బటన్లతో నియంత్రించబడుతుంది. ఇందులో కొత్త పుష్ స్టార్ట్/స్టాప్ బటన్‌ను ఫ్లాట్-బాటమ్ లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ పక్కన ఉంచబడుతుంది. ఈ కారులోని మరికొన్ని ఫీచర్లను కంపెనీ తమ ఇదివరటి టీజర్ల ద్వారా తెలియజేసిన సంగతి తెలిసినదే.

మహీంద్రా ఎక్స్‌యూవ700లో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పానోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, నాలుగు సౌండ్ మోడ్‌లతో కూడిన సోనీ స్టీరియో సిస్టమ్, వాయిస్-ఎనేబుల్డ్ కమాండ్‌లు మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

ఇదిలా ఉంటే, మహీంద్రా తాజాగా తమ సరికొత్త లోగోను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. సీతాకోక చిలుక రెక్కల మాదిరిగా ఉండే ఈ కొత్త లోగో మొదటిసారిగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీపై కనిపించనుంది. ఆ తర్వాత మహీంద్రా విడుదల చేయబోయే అన్ని భవిష్యత్ ఎస్‌యూవీలపై ఈ కొత్త లోగో కనిపిస్తుంది.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700ను కంపెనీ తమ పాపులర్ ఎక్స్‌యూవీ500 ఆధారంగా రూపొందించింది. అయితే, దీనిని పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నారు. ఈ ఎస్‌యూవీ మహీంద్రా యొక్క అత్యంత ఆధునిక డిజైన్‌తో కూడిన ఎస్‌యూవీగా ఉంటుందని చెబుతున్నారు.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

అంతేకాకుండా, ఈ కారులో కంపెనీ యొక్క లెటెస్ట్ టెక్ మరియు స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లను అందించనున్నారు. ఇది పూర్తిగా సరికొత్త లుక్ మరియు స్టైల్‌లో కనిపించనుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700లో ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి ఫాగ్‌లాంప్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్లను ఆఫర్ చేస్తున్నారు.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700ని పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లతో విక్రయించనున్నారు. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విడుదలకు ముందే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్స్ లీక్!

అలాగే, పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 suv interiors revealed in new teaser details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X