Just In
- 13 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 3 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- Movies
సీనియర్ డైరెక్టర్‌తో అను ఇమ్మాన్యుయేల్ అఫైర్.. డేటింగ్ జోష్‌లో ఉన్న దర్శకుడు ఎవరంటే!
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి అరేనా కస్టమర్ల కోసం స్పెషల్ ఆన్‌లైన్ ఫైనాన్స్ స్కీమ్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, గడచిన డిసెంబర్ నెలలో తమ నెక్సా కస్టమర్ల కోసం ప్రారంభించిన ఆన్‌లైన్ కార్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'స్మార్ట్ ఫైనాన్స్'ను ఇప్పుడు తమ అరేనా కస్టమర్లకు కూడా విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కంపెనీ ఈ సేవలను ముందుగా దేశంలోని 30 ప్రధాన నగరాల్లో ప్రారంభించింది. ఇందులో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, కోల్‌కతా, కొచ్చి, ముంబై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్‌లతో పాటుగా మరిన్ని నగరాలు ఉన్నాయి. ఈ నగరాలకు చెందిన కస్టమర్లు ఆన్‌లైన్‌లోనే అరేనా కార్ మోడళ్ల కొనుగోలు కోసం రుణ సదుపాయాన్ని పొందవచ్చు.

ఈ స్మార్ట్ ఫైనాన్స్ సదుపాయానికి సంబంధించి మారుతి సుజుకి ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, ఈ ఆన్‌లైన్ స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా, కస్టమర్లు షోరూమ్‌లను సందర్శించాల్సిన అసరం లేకుండానే రుణం తీసుకోవటానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారానే చేయవచ్చు.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

ప్రస్తుతం మారుతి సుజుకి ఈ స్మార్ట్ ఫైనాన్స్ సేవల కోసం మొత్తం 12 బ్యాంకులు మరియు వివిధ ఫైనాన్షియర్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఫైనాన్షియర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, చోళమండలం ఫైనాన్స్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్, కోటక్ మహీంద్రా ప్రైమ్ వంటి సంస్థలు ఉన్నాయి.

మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడం చాలా సులభం. దీని సాయంతో ఈఎమ్ఐని లెక్కించడం మరియు దానిని కస్టమర్లకు నచ్చిన రీతిలో మార్పులు చేసుకోవటం, ప్రత్యేకమైన ఆఫర్ల గురించి తెలుసుకోవటం, ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయటం మరియు ధ్రువీకరణ పొందటం అలాగే ఆన్‌లైన్ ద్వారా రుణాన్ని పొందటం వంటి వాటిని కేవలం కొన్ని క్లిక్‌లలోనే చేయవచ్చు.
MOST READ:డాకర్ ర్యాలీ 2021 ఫైనల్ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్.. ర్యాలీ ఛాంపియన్ ఎవరో తెలుసా..!

అలాగే, ఈ స్మార్ట్ ఫైనాన్న్ ప్లాట్‌ఫామ్‌లో వివిధ ఫైనాన్స్ కంపెనీలు ఆఫర్ చేసే రుణ ఆఫర్లకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది. ఈ ఆఫర్ల గురించి కస్టమర్లు వివిధ ఫైనాన్స్ కంపెనీల వ్యక్తిగత వెబ్‌సైట్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండానే, అన్ని వివరాలను ఒకేచోట పొందవచ్చు.

మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ మీ ప్రొఫైల్, అవసరాలు మరియు లొకేషన్ ఆధారంగా వివిధ ఫైనాన్స్ భాగస్వాములు మరియు రుణదాతలు అందిస్తున్న అన్ని ఆఫర్లను ఒకే ప్లాట్‌ఫామ్‌పై తెలుసుకోవచ్చు.
MOST READ:ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి

ఈ ప్లాట్‌ఫామ్ సాయంతో లోన్ ఈఎమ్‌ఐని సులువుగా లెక్కించవచ్చు. కస్టమర్ కార్ లోన్‌కి కావల్సిన బడ్జెట్ గురించి ఒక అంచనా ఉంటే చాలు, ఈ స్మార్ట్ ఫైనాన్స్ ద్వారా మీరు చెల్లించే డౌన్ పేమెంట్, ఈఎమ్ఐ, పదవీకాలం మరియు వడ్డీ రేటు మొదలైన అంశాలను కస్టమైజ్ చేసుకుని ఈఎమ్ఐకి సంబంధించి ఒక అంచనాకు రావచ్చు.

కస్టమర్ బడ్జెట్ మరియు ప్రాధాన్యతల ఆధారంగా కావల్సిన కార్ లోన్ మొత్తాన్ని ఎంచుకున్న తర్వాత స్మార్ట్ ఫైనాన్స్ సిస్టమ్‌లో ఉన్న లోన్ అప్లికేషన్‌ను పూర్తి చేయటం మరియు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయటం ద్వారా మీరు రుణానికి అర్హత పొందింది లేనిది తెలుసుకోవచ్చు.
MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

ఇలా ధరఖాస్తు చేసుకున్న లోన్ అప్లికేషన్‌ను ట్రాక్ చేసేందుకు ఓ ట్రాకింగ్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. లోన్ మంజూరు అయిన తర్వాత, సదరు రెఫరెన్స్ నెంబరుతో మీ సమీపంలోని మారుతి సుజుకి అరేనా షోరూమ్‌ని సందర్శించిన సులువుగా కారును సొంతం చేసుకోవచ్చు.