Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 11 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
మారుతి సుజుకి ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కొత్త 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం కంపెనీ ఇప్పుడు అధికారిక యాక్ససరీలను కూడా వెల్లడి చేసింది. కంపెనీ అందిస్తున్న ఈ అఫీషియల్ యాక్ససరీస్ ప్యాక్‌లతో కస్టమర్లు తమ స్విఫ్ట్ కారును మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

మార్కెట్లో కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ.5.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే, ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ జెడ్‌ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్ (ఏఎమ్‌టి) ధర రూ.8.41 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త స్విఫ్ట్ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది.

ఎక్స్టీరియర్ యాక్ససరీస్‌లో భాగంగా, స్విఫ్ట్ హుడ్ మరియు రూఫ్‌ను కాంట్రాస్ట్ కలర్‌లో ర్యాప్ మరియు గ్రాఫిక్ డిజైన్‌తో హైలైట్ చేసుకోవచ్చు. అలాగే, మొత్తం ఎనిమిది రంగులలో అందించబడే ముందు, వైపు మరియు వెనుక అండర్బాడీ స్పాయిలర్‌ను కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు.

క్రోమ్ గార్నిష్ ఇష్టపడే వారి కోసం కూడా కంపెనీ ప్రత్యేకమైన యాక్ససరీలను అందిస్తోంది. ఫాగ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్, గ్రిల్, బ్యాక్ డోర్ మరియు టెయిల్ ల్యాంప్స్‌పై క్రోమ్ గార్నిష్ పొందవచ్చు. అలాగే, డోర్ విజర్స్, సైడ్ బాడీ మోల్డింగ్ మరియు ఓఆర్‌విఎమ్ కవర్లు ఈ బ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్టీ రూపాన్ని మరింత పెంచడానికి సహకరిస్తాయి.

బేస్ వేరియంట్లను కొనుగోలు చేసే కస్టమర్ల తమ కారులోని స్టీల్ వీల్స్‌ను అందంగా కనిపించేలా చేయటం కోసం మిడ్నైట్ బ్లాక్ లేదా ఫైర్ రెడ్ కలర్‌లో అందుబాటులో ఉన్న వీల్ కవర్లను జోడించుకోవచ్చు. అండర్‌బాడీ స్కర్టింగ్‌తో సరిపోలడానికి ఎనిమిది గ్లోస్ షేడ్స్‌తో కూడిన రూఫ్ స్పాయిలర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

కంపెనీ అందిస్తున్న వివిధ రకాల యాక్ససరీలు, వాటి ధరలు ఇలా ఉన్నాయి:
వేవ్ ర్యాప్ - రూ.9,990, కార్బన్ రెడ్ ర్యాప్ - రూ.9,990, రెడ్ డిస్కో ర్యాప్ - రూ.10,990, స్ప్రింటర్ గ్రాఫిక్స్ - రూ.39999, ఎలక్ట్రిక్ డాష్ గ్రాఫిక్స్ - రూ.2,090, గ్లైడర్ గ్రాఫిక్స్ - రూ.2,990, అండర్‌బాడీ స్పాయిలర్ కిట్ (అన్ని రంగులు) - రూ.15,990 మరియు డోర్ వైజర్ - రూ.1,250 లకు అందుబాటులో ఉన్నాయి.

ఇవే కాకుండా, ప్రీమియం డోర్ వైజర్ - రూ.2,090, రియర్ అప్పర్ స్పాయిలర్ (ఆల్ కలర్స్) - రూ.3,490, బాడీ సైడ్ మోల్డింగ్ (పెయింటెడ్) - రూ.2,290, బాడీ సైడ్ మోల్డింగ్ (కలర్డ్) - రూ.2,790, ఫాగ్ లాంప్ గార్నిష్ - రూ.590, ఫాగ్ లాంప్ - రూ.3,490 మరియు ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ (బ్లాక్) - రూ.1,990 కు లభిస్తున్నాయి.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

ఇంకా, ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ (ఫెయిర్ రెడ్) - రూ.1,490, బ్యాక్ డోర్ గార్నిష్ - రూ.790, టెయిల్ ల్యాంప్ (బ్లాక్ గార్నిష్) - రూ.1,090, సిల్వర్ యాక్సెంట్ అల్లాయ్ వీల్స్ - రూ.25,160 (4 చక్రాలు), వీల్ కవర్ (బ్లాక్ / రెడ్) - రూ.1,960 మరియు ఓఆర్‌విఎమ్ కవర్ (కార్బన్ ఫినిష్) - రూ.2,390 లకు అందుబాటులో ఉన్నాయి.

అలాగే, ఓఆర్‌విఎమ్ కవర్ (కార్బన్ ఫినిష్, ఇండికేటర్స్ లేకుండా) - రూ.2,350, ఓఆర్‌విఎమ్ కవర్ (పియానో బ్లాక్ ఫినిష్) - రూ.1,790, ఓఆర్‌విఎమ్ కవర్ (పియానో బ్లాక్ ఫినిష్, ఇండికేటర్స్ లేకుండా) - రూ.1,750, బాడీ కవర్ (జనరల్) - రూ.1,090, బాడీ కవర్ (టైవెక్) - రూ.2,690 మరియు విండో ఫ్రేమ్ కిట్ - రూ.1,590 లకు అందుబాటులో ఉన్నాయి.
MOST READ:45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే

ఇంజన్ పరంగా కొత్త 2021 మోడల్ మారుతి స్విఫ్ట్ కారులో నెక్స్ట్ జనరేషన్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్ 12ఎన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మునుపటి ఇంజన్ కన్నా ఇది మరింత శక్తివంతమైనది (7 బిహెచ్‌పిల అదనపు శక్తిని అందిస్తుంది).