మీకు తెలుసా.. రూ. 1.15 కోట్ల మసెరటి ఘిబ్లి భారత్‌లో విడుదలైంది

ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ మసెరటి భారత మార్కెట్లోకి తన ఘిబ్లి హైబ్రిడ్ సెడాన్ విడుదల చేసింది. ఘిబ్లి హైబ్రిడ్ అదే స్పోర్ట్స్ సెడాన్ యొక్క అప్డేటెడ్ వెర్షన్. దేశీయ మార్కెట్లో కొత్త మసెరటి ఘిబ్లి ప్రారంభ ధర రూ. 1.15 కోట్లు (ఎక్స్-షోరూమ్).

మీకు తెలుసా.. రూ. 1.15 కోట్ల మసెరటి ఘిబ్లి భారత్‌లో విడుదలైంది

కొత్త 2021 మసెరటి ఘిబ్లి లగ్జరీ సెడాన్ వి 6, వి 8 మరియు కొత్త మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో లభిస్తుంది. 2021 మసెరటి ఘిబ్లి హైబ్రిడ్ సెడాన్ 3200 జిటి నుండి ప్రేరణ పొందిన రీస్టైల్డ్ గ్రిల్ మరియు కొత్త టెయిల్ లాంప్ క్లస్టర్స్ వంటి కొన్ని మార్పులను పొందుతుంది.

మీకు తెలుసా.. రూ. 1.15 కోట్ల మసెరటి ఘిబ్లి భారత్‌లో విడుదలైంది

మసెరటి ఘిబ్లి లగ్జరీ సెడాన్ యొక్క ముందు భాగంలో, ఇప్పుడు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో పాటు పుల్ ఎల్‌ఈడీ అడాప్టివ్ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇందులో సాఫ్ట్-క్లోజ్ డోర్స్, కిక్ సెన్సార్‌తో పవర్ ట్రంక్ మరియు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ హెడ్-యూనిట్ మరియు మసెరటి కనెక్ట్‌లో భాగంగా కనెక్టెడ్ కార్ ఫీచర్లను కలిగి ఉంది.

MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

మీకు తెలుసా.. రూ. 1.15 కోట్ల మసెరటి ఘిబ్లి భారత్‌లో విడుదలైంది

కొత్త 2021 మసెరటి ఘిబ్లి హైబ్రిడ్ సెడాన్ కూడా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ పొందుతుంది. ఘిబ్లిలో 50:50 బరువు పంపిణీతో తేలికపాటి నిర్మాణం ఉంది మరియు ఈ కారులో స్కైహూక్ సస్పెన్షన్ మరియు బ్రెంబో బ్రేక్‌లు ఉన్నాయి, ఇవి సూపర్ కార్‌ను చాలా బాగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి.

మీకు తెలుసా.. రూ. 1.15 కోట్ల మసెరటి ఘిబ్లి భారత్‌లో విడుదలైంది

2021 మసెరటి ఘిబ్లికి 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 325 బిహెచ్‌పి శక్తిని, 450 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

MOST READ:భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

మీకు తెలుసా.. రూ. 1.15 కోట్ల మసెరటి ఘిబ్లి భారత్‌లో విడుదలైంది

మసెరటి ఘిబ్లి గంటకు 255 కి.మీ వేగంతో ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంద. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్‌ను కూడా పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న తేలికపాటి-హైబ్రిడ్ సిస్టం ఇంధన వినియోగాన్ని 20 శాతం తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది.

మీకు తెలుసా.. రూ. 1.15 కోట్ల మసెరటి ఘిబ్లి భారత్‌లో విడుదలైంది

2021 ఘిబ్లి మరో రెండు పవర్‌ట్రైన్‌లతో కూడా అందుబాటులో ఉంది. ఒకటి 3.0-లీటర్ వి 6 ఇంజిన్, ఇది 424 బిహెచ్‌పి శక్తిని మరియు 580 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. మరొకటి 4.0-లీటర్ వి 8 మోటారు, ఇది 572 బిహెచ్‌పి శక్తిని మరియు 730 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

మీకు తెలుసా.. రూ. 1.15 కోట్ల మసెరటి ఘిబ్లి భారత్‌లో విడుదలైంది

కొత్త 2021 మసెరటి ఘిబ్లి కారులో అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. దీనికి యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌కు 5 స్టార్ రేటింగ్ లభించి అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఇది చూడటానికి చాలా ఆక్షర్షణీయంగా మరియు చాలా లగ్జారీగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #maserati
English summary
2021 Maserati Ghibli Hybrid Launched In India. Read in Telugu.
Story first published: Saturday, February 6, 2021, 13:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X