భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ బ్రాండ్ మెక్‌లారెన్, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, మెక్‌లారెన్ ఇప్పుడు భారత్ కోసం మూడు కొత్త మోడళ్లను మరియు వాటి ధరల వివరాలను వెల్లడి చేసింది.

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

ఈ మేరకు కంపెనీ తమ వెబ్‌సైట్ జాబితాలో భారతదేశాన్ని కూడా చేర్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు తమ ఫేవరేట్ మెక్‌లారెన్ కారును తమకు నచ్చినట్లుగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

మెక్‌లారెన్ జిటి, 720ఎస్ మరియు 720ఎస్ స్పైడర్ అనే మూడు సూపర్ కార్లను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా రివ్యూ వీడియో.. లేటెస్ట్ ఫీచర్స్ & సూపర్ పర్ఫామెన్స్

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

వాటి ధరలు మరియు ఇతర వివరాలు ఇలా ఉన్నాయి:

మెక్‌లారెన్ జిటి - ధర రూ.3.73 కోట్లు

మెక్‌లారెన్ జిటి సంస్థ నుండి రానున్న గ్రాండ్ టూరర్ సూపర్ కార్. ఈ కారులో శక్తివంతమైన 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 611 బిహెచ్‌పి శక్తిని మరియు 630 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు 9 సెకన్లలోనే 0 - 200 కిమీ వేగాన్ని సాధిస్తుంది.

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

ఈ సూపర్ కార్ గరిష్టం వేగం గంటకు 327 కిమీ. ఈ కారులోని ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంజన్ నుండి వెలువడే శక్తి ఈ గేర్‌బాక్స్ ద్వారా వెనుక పంపబడుతుంది. దీని వెనుక భాగంలో 420 లీటర్ల కార్గో స్థలం మరియు బోనెట్ క్రింద 150 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

మెక్‌లారెన్ 720ఎస్ - ధర రూ.4.64 కోట్లు

మెక్‌లారెన్ 720ఎస్ ఇదివరకు కంపెనీ ఆఫర్ చేసిన 650ఎస్ స్థానాన్ని రీప్లేస్ చేస్తుంది. ఈ కారు హార్డ్ టాప్‌ను కలిగి ఉండి, మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడి ఉంటుంది. ఇందులో 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ ఉంటుంది, ఇది గరిష్టంగా 710 బిహెచ్‌పి శక్తిని మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

ఈ ఇంజన్ 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుంచి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ సూపర్ కారు కేవలం 2.9 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, కేవలం 7.8 సెకన్లలోనే 0-200 కి.మీ వేగాన్ని సాధిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 341 కి.మీ.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

మెక్‌లారెన్ 720ఎస్ స్పైడర్ - ధర రూ.5.03 కోట్లు

మెక్‌లారెన్ 720ఎస్ స్పైడర్ అనేది స్టాండర్డ్ 720ఎస్ యొక్క కన్వర్టిబుల్ వెర్షన్‌గా ఉంటుంది. దీని హార్డ్ టాప్ రూఫ్ స్థానంలో కన్వర్టిబల్ టాప్ ఉంటుంది. మిగిలిన అన్ని విషయాల్లో మెక్‌లారెన్ 720ఎస్ మాదిరిగానే ఉంటుంది. ఈ కారులో కూడా అదే 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ ఉంటుంది.

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

ఈ ఇంజన్ గరిష్టంగా 710 బిహెచ్‌పి శక్తిని మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ సూపర్ కారు కేవలం 2.9 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, కేవలం 7.8 సెకన్లలోనే 0-200 కి.మీ వేగాన్ని సాధిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 341 కి.మీ. ఇందులో మెరుగైన సస్పెన్షన్ కోసం ప్రోయాక్టివ్ చాస్సిస్ కంట్రోల్ II సెటప్ ఉపయోగించబడింది.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

భారత్‌కు వస్తున్న మూడు కొత్త మెక్‌లారెన్ సూపర్ కార్లు మరియు వాటి ధరలు ఇవే!

దేశంలో లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్, బిఎమ్‌డబ్ల్యూ మరియు మినీ డీలర్‌షిప్‌లను నడుపుతున్న 'ఇన్ఫినిటీ కార్స్' డీలరే మెక్‌లారెన్ డీలర్‌షిప్‌ను కూడా నిర్వహించనున్నట్లు సమాచారం మరియు ఇది ముంబైలో ఉంది. మెక్‌లారెన్ కార్ల అమ్మకాలు, బుకింగ్‌లు మరియు కాబోయే కస్టమర్లకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, త్వరలోనే ఈ కార్లు భారత మార్కెట్లో అమ్మకానికి రావచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
McLaren Reveals GT, 720S And 720S Spider Prices For India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X