విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, నిన్న (గురువారం) భారత మార్కెట్లో విడుదల చేసిన తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ ఏ-క్లాస్ లిమోసిన్, వచ్చే రెండు నెలల వరకూ అమ్ముడైపోయినట్లు కంపెనీ ప్రకటించింది. మెర్సిడెస్ బెంజ్ ఈ కారును కేవలం రూ.39.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే మార్కెట్లో ప్రవేశపెట్టింది.

విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ మార్కెట్లో అత్యంత సరసమైన ధర మరియు అద్భుతమైన బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో కంపెనీ ఈ కారును ఆఫర్ చేస్తోంది. ఏ-క్లాస్ లిమోసిన్ విజయానికి ఇదే ప్రధాన కారణం. ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ మార్కెట్లో ఎ-క్లాస్ లిమోసిన్‌తో కంపెనీ ఓ కొత్త కస్టమర్ విభాగాన్ని సృష్టించింది.

విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

భారత మార్కెట్లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఏఎమ్‌ది పెర్ఫార్మెన్స్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

* మెర్సిడెస్ బెంజ్ ఏ200 - రూ.39.90 లక్షలు

* మెర్సిడెస్ బెంజ్ ఏ200డి - రూ.49.90 లక్షలు

* ఏఎమ్‌జి ఏ 34 4మ్యాటిక్ - రూ.56.24 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

MOST RAED:ఒకే ఛార్జ్‌తో 150 కి.మీ మైలేజ్ అందించే టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్.. వివరాలు

విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

ఆకస్తికరమైన విషయం ఏంటంటే, మెర్సిడెస్ బెంజ్ ప్రవేశపెట్టిన ఈ లేటెస్ట్ ఏఎమ్‌జి మోడల్ (ఏఎమ్‌జి ఏ 34 4మ్యాటిక్)ను కంపెనీ భారతదేశంలోనే అసెంబుల్ చేస్తోంది. దేశీయ మార్కెట్లో ఈ బ్రాండ్ అసెంబుల్ చేస్తున్న రెండవ ఏఎమ్‌జి మోడల్ కూడా ఇదే కావటం విశేషం. దీని కారణంగా కంపెనీ ఏ-క్లాస్ ఏఎమ్‌జి ధరను సహేతుకంగా ఉంచగలిగింది.

విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ వేరియంట్‌ను మొత్తం బట్టి మూడు ఇంజన్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మొదటి ఏ200 మోడల్‌లో లభించే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 1620 ఆర్‌పిఎమ్ వద్ద 161 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

ఇక ఇందులో రెండవ ఇంజన్ ఏ200డిలో ఉపయోగించిన డీజిల్ ఇంజన్. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 1400 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3200 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

ఈ సిరీస్‌లో అన్నింటి కన్నా శక్తివంతమైన ఏఎమ్‌జి ఏ 35 4మ్యాటిక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 304 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇంజన్ నుండి వెలువడే శక్తిని 4మ్యాటిక్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ కారు కేవలం 4.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారులో కంపెనీ యొక్క లేటెస్ట్ డ్యూయల్ స్క్రీన్ ఎమ్‌బియూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్ కమాండ్, పార్క్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. క్రోమ్ ఫినిష్ ఎయిర్ వెంట్స్, క్రోమ్ ఫినిష్ ఎయిర్-కాన్ స్విచ్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

విడుదైలన మొదటిరోజే అమ్ముడైపోయింది; ఇక రెండు నెలల తర్వాతనే..

ఈ కారులో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ మరియు ఎంటరైన్‌మెంట్ కోసం రెండు 10.25 ఇంచ్ స్క్రీన్లు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్‌స్పాట్ మోనిటరింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబిఎస్ విత్ ఇబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, పెరీమీటర్ / వాల్యూమెట్రిక్ అలారం, మెర్సిడెస్ మి బ్రేక్‌డౌన్ అండ్ క్రాష్ అసిస్ట్ మరియు ప్రీ-సేఫ్ హెడ్ కంట్రోల్స్ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

MOST READ:ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

Most Read Articles

English summary
Mercedes A-Class Limousine Sold Out For Next 2 Months. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X