Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) భారతీయ మార్కెట్లో కొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ (Mercedes AMG A 45 S) ను ఆవిష్కరించింది. అయితే ఈ కొత్త మోడల్ భారతీయ మార్కెట్లో 2021 నవంబర్ 19 న అధికారికంగా విడుదలకానుంది. దేశీయ మార్కెట్ కి ఈ కొత్త లగ్జరీ కార్ కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) గా దిగుమతి చేసుకోబడుతుంది. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) విడుదల చేయనున్న ఈ కొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ అవుతుంది. ఇది భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో మెర్సిడెస్ A-క్లాస్ కుటుంబంలో చేరిన సరికొత్త మోడల్ ఈ ఏఎమ్‌జి ఏ45 ఎస్. Mercedes-AMG A-క్లాస్‌లో ఇప్పటికే A-క్లాస్ లిమోసిన్, GLA, AMG A 35 4MATIC మరియు AMG GLA 35 4MATIC వంటివి ఉన్నాయి.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది, అంతే కాకుండా ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఇందులో పనామెరికానా గ్రిల్ అప్ ఫ్రంట్, హుడ్‌పై షార్ప్ లైన్స్, సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఎయిర్ డ్యామ్, ఇంటిగ్రేటెడ్ స్ప్లిటర్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, లో ప్రొఫైల్ టైర్లు మరియు రియర్ డిఫ్యూజర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులోని క్వాడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఈ కొత్త కారుకి మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. కావున మరింత దూకుడుగా ఉంటుంది.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో బకెట్-స్టైల్ స్పోర్టీ సీట్లు ఇవ్వబడ్డాయి, ఇది బ్లాక్ ఆర్టికో లెదర్ కవర్‌ను పొందుతుంది. సీట్లపై కాంట్రాస్ట్ స్టిచింగ్ మరియు ట్రిమ్ ప్యాటర్న్‌తో డిన్మికా మైక్రోఫైబర్ కలయికతో వస్తాయి.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

అంతే కాకుండా ఇందులో స్పోర్టీ స్టీరింగ్ వీల్‌తో స్పోర్టీ డిజైన్‌తో నప్పా లెదర్/డైనమికా మైక్రోఫైబర్ కవర్‌ను పొందుతుంది. దీనితో పాటు, కాంట్రాస్ట్ ఎల్లో టాప్ స్టిచింగ్, AMG స్టీరింగ్ వీల్ బటన్లు, AMG లోగో, యాంబియన్స్ లైటింగ్ మొదలైనవి ఈ స్టీరింగ్‌పై ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కారుని మరింత ఆధునికంగా చేస్తాయి.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

ఏఎమ్‌జి ఏ45 ఎస్ కారు అద్భుతమైన ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం రెండు వేర్వేరు స్క్రీన్‌లతో మెర్సిడెస్ సిగ్నేచర్ సింగిల్ యూనిట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో టచ్‌స్క్రీన్ యూనిట్ మరియు MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది, దీనిని సెంటర్ కన్సోల్‌లోని ట్రాక్‌ప్యాడ్, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్టీరింగ్ కంట్రోల్స్ లేదా వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి 'హే మెర్సిడెస్' అని చెప్పడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ కారులో ప్రీమియం బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కస్టమర్‌లు మూడు AMG డిస్‌ప్లే స్టైల్‌లను ఎంచుకోవచ్చు. అవి క్లాసిక్, స్పోర్ట్ మరియు సూపర్‌స్పోర్ట్. ఏఎమ్‌జి ఏ45 ఎస్ ఆరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, స్లిప్పరీ, ఇండివిజువల్ మరియు రేస్ మోడ్స్. కారు హెడ్స్-అప్ డిస్ప్లే, బ్లైండ్-స్పాట్ అసిస్ట్ మరియు యాక్టివ్ లేన్ కీప్ అసిస్ట్ కూడా పొందుతుంది.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ మోటార్. ఈ ఇంజన్ 416 బిహెచ్‌పి పవర్ శక్తిని మరియు 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

ఇది సాధారణ A 45 కంటే 30 బిహెచ్‌పి పవర్ మరియు A 35 సెడాన్ కంటే 114 బిహెచ్‌పి పవర్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 4 మ్యాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 270 కిలోమీటర్లుగా అంచనా వేయబడింది. ఈ హ్యాచ్‌బ్యాక్ కేవలం 3.9 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది.

Mercedes AMG A 45 S ఆవిష్కరించిన Benz.. లాంచ్ ఎప్పుడంటే?

భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన Mercedes AMG A 35 సెడాన్ కాకుండా, AMG A 45 S హ్యాచ్‌బ్యాక్ CBU మార్గం ద్వారా భారతదేశానికి తీసుకురాబడుతుంది. అందువల్ల, దీని ధర AMG A35 కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దిగుమతులు అధిక స్థాయి కస్టమ్ డ్యూటీని ఆకర్షిస్తాయి, కాబట్టి కొత్త AMG A45 S యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 75 లక్షల నుండి రూ. 80 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ కొత్త కారు యొక్క ధర గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇడుదల సమయంలో ఇవన్నీ వెలువడతాయి.

Most Read Articles

English summary
Mercedes amg a 45 s performance hatchback to launch on 19th november details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X