మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్, ప్రపంచ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ యొక్క ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో మంచి అమ్మకాలను సాగిస్తున్నాయి. ఈ తరుణంలో బెంజ్ కంపెనీ నిరంతరం అనేక కొత్త కాన్సెప్ట్ మోడళ్లను విడుదల చేస్తుంది.

మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

బెంజ్ కంపెనీ ఏప్రిల్‌ నెలలో అనేక మోడళ్లను విడుదల చేసింది. ఇటీవల కంపెనీ ఈక్యూఎస్ సెడాన్ మరియు ఈక్యూబి SUV లను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈక్యూటి కాన్సెప్ట్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. మెర్సిడెస్ ఇక్యూటి ఎంపివి మే 10 న ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

ప్రస్తుతం దాదాపు అన్ని వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి. కావున మెర్సిడెస్ బెంజ్ కూడా అనేక ఎలక్ట్రిక్ మోడళ్లను ఆవిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈక్యూ బ్రాండ్ క్రింద అనేక మోడళ్లను ప్రవేశపెట్టింది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

ప్రస్తుతం ఒక ఈక్యూ మోడల్ భారతదేశంలో విక్రయానికి కూడా ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఈ విభాగంలోనే కాకుండా, అన్ని విభాగాలలో వినియోగదారుల అవసరకు అనుగుణంగా ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో టెస్లా, ఫోక్స్ వ్యాగన్, ఫోర్డ్ మరియు వోల్వో వంటి వాటికీ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు సెడాన్ మరియు ఎస్‌యూవీ తరువాత, ఫ్యామిలీ వాన్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ కారణంగా మెర్సిడెస్ బెంజ్ ఇక్యూటిని తీసుకురానుంది. బెంజ్ యొక్క ఈ మోడల్ ఐరోపాలో అనేకసార్లు టెస్ట్ చేయబడింది. ఇది ఒక చిన్న వ్యాన్, కంపెనీ ఒక చిన్న కుటుంబానికి అనుకూలంగా ఈ మోడల్ ప్రవేశపెట్టనుంది.

MOST READ:కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

ఈ ఫ్యామిలీ వ్యాన్ నగరంలో మరియు హైవేపై రెండింటికీ మంచి ఎంపిక కానుంది. ఇటీవల ఈ EQT కాన్సెప్ట్ యొక్క టీజర్ విడుదలైంది మరియు మే 10 న ప్రవేశపెట్టిన తరువాత, దాని అసలైన వెర్షన్ ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ప్రస్తుతం దాని ఫీచర్స్ మరియు కెపాసిటీ వంటి విషయాల గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

ఇది మాత్రమే కాకుండా దాని విడుదల తేదీ కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు, అయినప్పటికీ ఈ సంవత్సరం చివరి నాటికి దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇది ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్‌కు మాత్రమే పరిమితం అవుతుంది. తరువాత ఇతర దేశాల్లో అడుగుపెట్టనుంది.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

మెర్సిడెస్ కంపెనీ ఇటీవల లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ఇక్యూఎస్‌ను ప్రవేశపెట్టింది. మెర్సిడెస్ బెంజ్ ఇక్యూఎస్ రెండు ట్రిమ్లలో లభిస్తుంది. అవి ఇక్యూఎస్ 450 ప్లస్ మరియు ఇక్యూఎస్ 580 మోడల్స్. ఈ రెండు ట్రిమ్‌లలో 108.7 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు ఉపయోగించబడ్డాయి. ఇవి చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Mercedes EQT MPV Concept To Be Unveiled On 10th May. Read in Telugu.
Story first published: Wednesday, April 21, 2021, 15:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X