EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఇంధనంతో నడిచే వాహనాలను వదిలిపెట్టి ఎలక్ట్రిక్ ద్వారా నడిచే వాహనాలపై వినియోగదారులు కూడా ఎక్కువ ఆకర్షించబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన ధరలు కావచ్చు, లేదా కొత్త వాహనాల వినియోగంపై ఏర్పడిన ఆసక్తి కావచ్చు.

EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

ఇందులో భాగంగానే ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 2030 నాటికి తన బ్రాండ్ నుంచి వచ్చే వాహనాలు దాదాపు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే అవుతాయని ఇటీవల తెలిపింది. దీనికి కావలసిన అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం తన ఈక్యూ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని విస్తరిస్తోంది. ఈ కారణంగా కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి మరియు ఈక్యూసి యొక్క కొత్త ఈక్యూఈ పోర్ట్‌ఫోలియోలో చేరడానికి సమయం ఆసన్నమైంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు త్వరలో రానున్న కొత్త ఈక్యూఈ కారు యొక్క టీజర్‌ను విడుదల చేసింది.

EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

టీజర్ ఇమేజ్ లో మీరు గమనించినట్లయితే, ఇది చూడటానికి భిన్నంగా లేదు. కానీ కానీ ఇంటీరియర్ మాత్రం ఈక్యూఎస్ లో చూసినట్లుగా ఉంటుంది. రాబోయే 2021 ఐఏఏ మ్యూనిచ్ మోటార్ షోలో కొత్త మెర్సిడెస్ బెంజ్ EQE ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడుతుంది.

EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

కొత్త ఈక్యూఈ కారు, మెర్సిడెస్ ఈక్యూఎస్ బ్యాటరీ ఎలక్ట్రిక్ AMG ఎడిషన్ మరియు ఎలక్ట్రిక్ మెర్సిడెస్-మేబాచ్ SUV కాన్సెప్ట్‌ను ప్రదర్శిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి కూడా స్టాండ్స్‌లో ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ విడుదలైన టీజర్ ఇమేజ్ లో ఒకే గ్లాస్ పేన్, మరియు మూడు ఈక్యూఈ యొక్క ఇన్-డాష్ డిస్‌ప్లేలను చూడవచ్చు.

EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

కొత్త ఈక్యూఈ యొక్క మూడు ఇన్-డాష్ డెక్‌లు ఒకే గ్లాస్ పేన్ లో అమర్చబడి ఉండటం మీరు ఇక్కడ గమనించవచ్చు. చూపిస్తుంది. ఇది ఈక్యూఎస్ తరహాలో మొత్తం డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు ఆకర్షణీయంగా ఉన్నట్లు మీరు ఇక్కడ గుర్తించవచ్చు.

EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

ఈ కొత్త వెర్షన్ యొక్క బూట్ లైన్‌లోని ఎల్ఈడీ బార్ టెయిల్‌లైట్‌లకు కనెక్ట్ అవ్వదు. ఈక్యూఎస్ డ్యూయల్ టోన్ కలర్‌ని కలిగి ఉంది, ఇది మేబాచ్ మోడళ్లలో సాధారణంగా ఉంటుంది. ఈక్యూసి లగ్జరీ సెడాన్ ఎలక్ట్రిక్ మోడల్ వంటి హెడ్‌లైట్ల చుట్టూ పెద్ద గ్రిల్ అందించే అవకాశం ఉంది.

EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

ఈక్యూసి సెడాన్‌కు శక్తినిచ్చే అదే బ్యాటరీ ప్యాక్‌లను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇది 90 కిలోవాట్ మరియు 108 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఇది 200 కిలోవాట్ హైస్పీడ్ ఛార్జర్‌ని ప్లగ్ చేస్తుంది మరియు 15 నిమిషాల్లో 300 కిమీ వెళ్ళడానికి కావలసిన ఛార్జ్ చేసుకోగలదు.

EQE ఎలక్ట్రిక్ సెడాన్ టీజర్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ పవర్‌ట్రెయిన్ గురించి మెర్సిడెస్ బెంజ్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది రెండు యాక్సెల్స్ పై ఎలక్ట్రిక్ మోటార్‌లను ఇన్‌స్టాల్ చేయగలదని భావిస్తున్నారు, కనుక ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో 4 మ్యాటిక్ కావచ్చు. ఏది ఏమైనా ఈ వెర్షన్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Mercedes Benz Releases EQE Electric Sedan Teaser. Read in Telugu.
Story first published: Saturday, July 31, 2021, 12:51 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X