మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్.. ఇప్పుడు మరింత కాస్ట్లీ

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తన సి-క్లాస్ సెడాన్ ధరను పెంచినట్లు అధికారికంగా ప్రకటించింది. మెర్సిడెస్ సి-క్లాస్ లో సి 200 ప్రోగ్రెసివ్, సి 220 డి ప్రోగ్రెసివ్ మరియు టాప్ స్పెక్ సి 300 డి ఎఎమ్‌జి కలిగి ఉంది. కంపెనీ ఇందులో మొదటి రెండు వేరియంట్ల ధరను పెంచింది. అదే సమయంలో దాని టాప్ వేరియంట్ ను వెబ్‌సైట్ నుండి తొలగించబడింది. మెర్సిడెస్ సి-క్లాస్ ధర ఇప్పుడు రూ .3.14 లక్షల వరకు ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్.. ఇప్పుడు మరింత కాస్ట్లీ

మెర్సిడెస్ బెంజ్ తన సి 200 ప్రోగ్రెసివ్ ధరను రూ. 59,863 వరకు పెంచింది. ఈ వేరియంట్లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 201 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్.. ఇప్పుడు మరింత కాస్ట్లీ

ఇక సి 220 డి ప్రోగ్రెసివ్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 192 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ దాని సి 300 డి ఎఎమ్‌జిలో వ్యవస్థాపించబడింది. ఇది 245 బిహెచ్‌పి శక్తిని మరియు 370 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

MOST READ:ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్.. ఇప్పుడు మరింత కాస్ట్లీ

మెర్సిడెస్ బెంజ్ తన సి క్లాస్ క్యాబ్రియోలెట్ ధరను కూడా పెంచింది. దీని సింగిల్ వేరియంట్ సి 300 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ కన్వర్టిబుల్‌ మోడల్‌ ధర రూ. 3.14 లక్షల వరకు పెరిగింది. ఈ వేరియంట్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది, ఇది 258 బిహెచ్‌పి శక్తిని 370 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్.. ఇప్పుడు మరింత కాస్ట్లీ

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ చాలా కాలంగా అప్డేట్ అవ్వలేదు. అయితే కొత్త వెర్షన్ సి-క్లాస్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబడింది. కావున ఇది భారత మార్కెట్లో త్వరలో అడుగుపెట్టే అవకాశం ఉంది. కానీ కంపెనీ దీని గురించి అధికారికంగా ఎటువంటి సమాసీజరం ఇవ్వలేదు.

MOST READ:ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్.. ఇప్పుడు మరింత కాస్ట్లీ

ఈ కొత్త కారు దాని పాత మోడల్ కంటే ఎక్కువ స్పోర్టి లుక్‌తో వస్తుంది. మధ్యలో ఉన్న మెర్సిడెస్ లోగోను దాని ముందు భాగంలో కంపెనీ ఐకానిక్ గ్రిల్‌తో పాటు ఇచ్చారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్.. ఇప్పుడు మరింత కాస్ట్లీ

ఈ కారు కొత్త డిజైన్ చాలా వరకు అప్డేట్ చేయబడిన గ్రిల్‌ను కలిగి ఉంది. కావున ఇది మరింత స్లిమ్ హెడ్‌లైట్ మరియు టైల్ లైట్స్ కలిగి ఉంది. ఈ కారులో గమనించదగ్గ అతిపెద్ద మార్పు దాని డాష్‌బోర్డ్‌లో గుర్తించవచ్చు. ఈ సి-క్లాస్‌లో కొత్త డాష్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసింది. దీనిలో టాబ్లెట్ లాంటి టచ్‌స్క్రీన్ ఉంటుంది.

MOST READ:కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్.. ఇప్పుడు మరింత కాస్ట్లీ

ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఫుల్లీ డిజిటల్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వబడింది. ఇందులో ఉన్న రెండు ఇంజన్లు 48 వోల్ట్ బెల్ట్-ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ను ఉపయోగిస్తున్నప్పటికీ, కంపెనీ ఈ కారును పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో ఆవిష్కరించింది.

Most Read Articles

English summary
Mercedes C-Class Price Hike Upto Rs. 3.14 Lakh. Read in Telugu.
Story first published: Wednesday, May 19, 2021, 13:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X