2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీ కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా, ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ కంపెనీలలో ఒకటి. మహీంద్రా కంపెనీ ఇప్పుడు 2022 మహీంద్రా రోక్సర్‌ (2022 Mahindra Roxor) ను యునైటెడ్ స్టేట్స్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మహీంద్రా రోక్సర్‌ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

యునైటెడ్ స్టేట్స్ మార్కెట్‌లో విడుదలైన కొత్త మహీంద్రా రోక్సర్‌ బేస్ వేరియంట్ ధర US$ 18,899 (భారత కరెన్సీ ప్రకారం రూ. 14.04 లక్షలు) మరియు ఆల్-వెదర్ ట్రిమ్ ధర US$ 26,299 (భారత కరెన్సీ ప్రకారం రూ. 19.54 లక్షలు). అయితే మహీంద్రా రోక్సర్‌ యొక్క టాప్-స్పెక్ మోడల్ కొంచెం ఖరీదైనదిగా పరిగణించబడుతుంది. ఇది జీప్ రాంగ్లర్ కంటే USD 4,000 లేదా దాదాపు రూ. 2.97 లక్షలు ఎక్కువ ఖరీదైనది.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

ఎఫ్‌సిఎతో న్యాయస్థానంలో జరిగిన పోరాటంలో అంతా సజావుగా సాగకపోవడంతో రోక్సర్ మహీంద్రాకు వివాదాస్పద వ్యవహారంగా మారింది. అయితే 2019 లో తిరిగి జీప్ డిజైన్‌ను ఉల్లంఘించిందని మహీంద్రాను కోర్టు ఆదేశించింది. ఈ కారణంగానే ప్రధానంగా ముందు భాగంలో ఉన్న స్టైలింగ్‌ను మార్చాల్సి వచ్చింది. అయితే కొత్త డిజైన్ కోసం వర్టికల్ గ్రిల్ స్లాట్‌లు కొంతవరకు తొలగించబడ్డాయి.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ US లో కొంత కాలం మహీంద్రా రోక్సర్ యొక్క రిటైల్ అమ్మకాలను నిలిపివేసింది. అప్డేటెడ్ మోడల్ జీప్ డిజైన్‌కు భిన్నంగా ఉందని చట్టబద్ధంగా చెప్పబడింది. తరువాత 2021 సంవత్సరానికి ఫాస్ట్ ఫార్వార్డింగ్, ఫేస్‌లిఫ్ట్‌లో కాస్మొటిక్ అప్డేట్స్ చేయబడ్డాయి.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

అయినప్పటికీ ఈ కొత్త మోడల్ యొక్క అండర్ సైడ్ మార్చకుండా ఉంచబడింది. కావున ఇక్కడ మీరు కొత్త మహీంద్రా రోక్సర్‌లో పాత-తరం మహీంద్రా థార్ ఆధారిత ఆఫ్-రోడర్ యొక్క స్థాయిని మీరు కొంత వరకు చూడవచ్చు. ఇప్పుడు కొత్త 2022 మహీంద్రా రోక్సర్ కొత్త ఫ్రంట్ ఫాసియాతో విడుదల చేయబడింది. ఇది చూడటానికి చాలా దూకుడుగా ఉంటుంది. కావున ఎక్కువమంది వాహన ప్రియులను ఆకర్షించడంలో ఇది చాలా సహాయపడుతుంది.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

కొత్త 2022 మహీంద్రా రోక్సర్ యొక్క ముందు భాగంలో, రెండు వైపులా గుండ్రని ఆకారపు హెడ్‌ల్యాంప్‌లతో పాటు ప్రత్యేక బ్లాక్ గ్రిల్ బార్ ఉపయోగించబడింది. ఇది కాకుండా, ఇది మరింత ఆకర్షణ కోసం పొందికైన క్లస్టర్, ఫ్లాట్ బానెట్ స్ట్రక్చర్, ఎక్స్‌పోజ్డ్ ఫెండర్లు, బలమైన ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు, ఫ్రంట్ విండ్‌షీల్డ్ కింద మహీంద్రా బ్యాడ్జింగ్, ఆల్-వెదర్ టైర్లు, వించ్ మరియు టోయింగ్ ప్రొవిజన్ మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

మహీంద్రా కంపెనీ జీప్ క్లెయిమ్ చేసినట్లుగా ఏదీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు కనిపించకుండా ఉండటం కోసం ఫ్రంట్ ఫెండర్‌లు కూడా రీడిజైన్ చేయబడ్డాయి. ఇది ఎంట్రీ మోడల్ కోసం ఓపెన్ క్యాబ్‌గా కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు ఆల్-వెదర్ మోడల్‌లో ఒక క్లోజ్డ్ క్యాబిన్ వస్తుంది.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

అయితే మహీంద్రా యొక్క కొత్త 2022 మహీంద్రా రోక్సర్ యొక్క పనితీరులో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కావున కొత్త 2022 మహీంద్రా రోక్సర్ కూడా పాత 2.5-లీటర్ టర్బోచార్జ్డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 62 బిహెచ్‌పి పవర్ మరియు 195 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

2022 మహీంద్రా రోక్సర్ కఠినమైన భూభాగాల్లో ప్రయాణించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మంచి ఆఫ్ రోడింగ్ సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. కావున ఎక్కువ మంది సాహసాలు చేసే వాహన ప్రియులు ఈ ఆఫ్ రోడర్ ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మహీంద్రా యొక్క వాహనాలు ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.

2022 Mahindra Roxor: ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో.. అదుర్స్ కదా..

ఎందుకంటే మహీంద్రా వాహనాలు ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండటం మాత్రమే కాదు, మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి. ఈ కారణాల వల్ల మహీంద్రా వాహనాలు ఇప్పటికీ మన్నికైనవిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు యునైటెడ్ మార్కెట్లో విడుదలైన ఈ మోడల్ మహీంద్రా కారు మంచి అమ్మకల్టీతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
New 2022 mahindra roxor launched in us market with updated front fascia details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X