కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో భారతదేశంలో విక్రయిస్తున్న డస్టర్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో డాసియా బ్రాండ్ క్రింద విక్రయిస్తోంది. తాజాగా, డాసియా తమ కొత్త తరం 2022 డస్టర్ ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

డాసియా బ్రాండ్ రెనో యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసినదే. అంతర్జాతీయ మార్కెట్లో డాసియా బ్రాండ్ క్రింద రెనో తమ బడ్జెట్ కార్లను విక్రయిస్తుంది. ప్రీమియం కార్లను రెనో బ్రాండ్ క్రింద విక్రయిస్తుంది. తాజాగా డాసియా ఆవిష్కరించిన డస్టర్ రెండవ తరానికి చెందినది.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

ఈ ఎస్‌యూవీని రెనో బ్రాండ్ కింద భారత మార్కెట్లో కూడా అదే పేరుతో విక్రయిస్తున్నారు. మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌లో భాగంగా, కొత్త 2022 డస్టర్‌లో డిజైన్ మరియు టెక్నాలజీ పరంగా అనేక అప్‌డేట్స్ చేశారు. ఇది కొత్త డాసియా సాండెరో వంటి సరికొత్త కార్లకు అనుగుణంగా ఉంటుంది.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

కొత్త 2022 డస్టర్ ఎస్‌యూవీలో Y-ఆకారపు హెడ్‌లైట్ డిజైన్‌తో పాటు సరికొత్త క్రోమ్ గ్రిల్ ఉంటుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడల్‌తో పోలిస్తే, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అలాగే, కొత్త డస్టర్‌లో మరో పెద్ద మార్పు దాని ఎల్‌ఈడీ ఫ్రంట్ ఇండికేటర్ల రూపంలో ఉంటుంది, ఇవి ఈ ఎస్‌యూవీకి అమర్చడం ఇదే మొదటిసారి.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

ఇంకా, ఇందులో కొత్త ఏరో-ఆప్టిమైజ్ 15 ఇంచ్ మరియు 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్లను అందిస్తున్నారు. రియర్ స్పాయిలర్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. అయితే, ఓవరాల్‌గా డస్టర్ డిజైన్ సిల్హౌట్ మాత్రం అలానే ఉంటుంది. కొత్త 2022 డస్టర్ ఇంటీరియర్‌ను కూడా అప్‌డేట్ చేశారు.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

ఈ కారు ఇంటీరియర్స్‌లో లోపలివైపు కొత్తగా అప్‌డేట్ చేసిన డ్యాష్‌బోర్డ్‌తో ఇది కొత్త క్యాబిన్ లేఅవుట్‌ని కలిగి ఉంటుంది. రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, కొత్త మెటీరియల్‌లు మరియు 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ మరియు స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు ఈ ఎస్‌యూవీలో స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది. ఇంకా ఇందులో టాప్-ఎండ్ వేరియంట్లలో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్లు మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త డస్టర్ మార్కెట్‌ను బట్టి వివిధ రకాల ఇంజన్ ఆప్షన్లతో విక్రయించబడుతుంది. యూరప్‌లో కొత్త డస్టర్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

అలాగే, ఇందులో 128 బిహెచ్‌పి లేదా 148 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేసే 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 113 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు పెట్రోల్ లేదా ఎల్‌పిజితో నడిచే 1.0-లీటర్ బై-ఫ్యూయల్ ఇంజన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఫుల్ డీటేల్స్

ఈ కొత్త తరం 2022 డస్టర్ ఎస్‌యూవీని రెనో భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ ప్రస్తుతం మొదటి తరం డస్టర్‌ను భారత మార్కెట్లో విక్రయిస్తుంది. రెనాల్ట్ ప్రస్తుతం సిఎమ్ఎఫ్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్-ఆధారంగా కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ వంటి మోడళ్లను తయారు చేస్తోంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
New 2022 Second Generation Dacia Duster Revealed; Will It Come To India? Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X