ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

మహీంద్రా థార్ ఎస్‌యూవీ పోటీగా ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ (Force Motors) విడుదల చేసిన కొత్త తరం 2021 ఫోర్స్ గుర్ఖా (2021 Force Gurkha) ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం అయ్యాయి. దేశంలోని ఎంపిక చేసిన డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా కంపెనీ ఈ ఎస్‌యూవీని కస్టమర్లకు అందిస్తోంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఫోర్స్ మోటార్స్ గత నెలాఖారులో (సెప్టెంబర్ 28 న) భారత మార్కెట్లో తమ హార్డ్ కోర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ 2021 ఫోర్స్ గుర్ఖా ను కేవలం రూ. 13.59 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్) విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఫోర్స్ గుర్ఖా కేవలం ఒకే ఒక వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. కాకపోతే, కంపెనీ ఈ వేరియంట్‌ ను కంపెనీ అన్ని అవసరమైన ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందిస్తుంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

బుకింగ్స్ పరంగా ఇది మహీంద్రా థార్ ని బీట్ చేయలేకపోయినప్పటికీ, ఈ మోడల్ కోసం వస్తున్న బుకింగ్స్ మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, ఈ వాహనం లభ్యత పరిమితంగా ఉండటం మరియు ఈ కంపెనీ యొక్క సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ చాలా పరిమితంగా ఉండటంతో కస్టమర్లు ఎక్కువగా ఫోర్స్ గుర్ఖా పై ఆదరణ చూపడం లేదని తెలుస్తోంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఏదేమైనప్పటికీ, రాబోయే రోజుల్లో దశలవారీగా భారతదేశం అంతటా తమ విక్రయాల నెట్‌వర్క్‌ను విస్తరింపజేస్తామని ఫోర్స్ మోటార్స్ తెలిపింది. ఇందులో భాగంగానే, ఫోర్స్ మోటార్స్ కంపెనీ ఆటో యూరోపా ఇండియా అనే సంస్థతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఆటో యూరోపా ఇండియా సంస్థ ఆన్-రోడ్ అసిస్టెన్స్ కోసం దేశవ్యాప్తంగా 6,200 టచ్‌పాయింట్‌ లను కలిగి ఉంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఈ ఆటో యూరోపా ఇండియా టచ్‌పాయింట్ ల సాయంతో ఫోర్స్ గుర్ఖా కస్టమర్లు అవసరమైనప్పుడు దాని నుండి ఆన్-రోడ్ అసిస్టెన్స్ ను పొందవచ్చు. ఇక కొత్త తరం 2021 ఫోర్స్ గుర్ఖా విషయానికి వస్తే, ఫోర్స్ మోటార్స్ ఈ ఎస్‌యూవీని దాని మునుపటి తరం మోడళ్ల కంటే చాలా మోడ్రన్‌ గా మరియు ఫీచర్ లోడెడ్ గా తీర్చిదిద్దింది. అయితే, దీని ఓవరాల్ బాక్సీ టైప్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ఎప్పటిలానే ఉంటుంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఫోర్స్ గూర్ఖా - డిజైన్

కొత్త తరం 2021 ఫోర్స్ గూర్ఖాలో కొత్తగా రూపొందించబడిన వృత్తాకారపు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు ఎల్ఈడి స్టాప్ లైట్ మొదలైనవి ఉన్నాయి. దీని ఫ్రంట్ బంపర్ పై పెద్ద అక్షరాలతో వ్రాసిన గూర్ఖా అనే బ్యాడ్దింగ్ ఉంటుది. అంతే కాకుండా, రెండు బంపర్లపై బ్లాక్ క్లాడింగ్ మరియు హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

కొత్త గూర్ఖా యొక్క సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ఇందులో కొత్త 16 ఇంచ్ స్టీల్ వీల్స్ (ఆప్షనల్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి), బ్లాక్ సైడ్ మిర్రర్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, ఫంక్షనల్ రాక్‌లు మరియు టర్న్ ఇండికేటర్‌లు కూడా ఉన్నాయి. ఫోర్స్ మోటార్స్ ఈ కొత్త తరం గూర్ఖాను రెడ్, గ్రీన్, వైట్, ఆరెంజ్ మరియు గ్రే అనే 5 రంగులలో అందుబాటులో ఉంచింది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఈ 2020 గుర్ఖా ఎక్స్టీరియర్ లో చేసిన మార్పుల కన్నా ఇంటీరియర్లలో చేసిన మార్పులే ఎక్కువగా ఉన్నాయి. కారులోపల కొత్త బ్లాక్ థీమ్ తో కూడిన క్యాబిన్ ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులోని వెనుక వరుసలో మునుపటి మాదిరిగా బెంచ్ సీట్లు కాకుండా రెండు వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ఇవ్వబడ్డాయి. ఈ మార్పు కారణంగా ఈ కారు ఇప్పుడు లోపలి వైపు మునుపటి కన్నా మరింత ప్రీమియంగా మారింది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఫోర్స్ గూర్ఖా - ఫీచర్లు,

గుర్ఖా ఎస్‌యూవీ ఫుల్లీ లోడెడ్ టెక్ అండ్ స్మార్ట్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో Apple CarPlay మరియు Android Auto ను సపోర్ట్ చేసే కొత్త 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే, ఇందులో స్పీడ్ మరియు ఆర్‌పిఎమ్ గురించి సమాచారాన్ని అందించే సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఉంటుంది. ఇంకా ఈ కారులో సర్దుబాటు చేయగల త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, తక్కువ NVH (నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్) స్థాయిలు, ఫోర్స్ పవర్ విండోస్ మరియు కప్ హోల్డర్స్ మొదలైనవి ఉన్నాయి.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఫోర్స్ గూర్ఖా - ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు

కొత్త తరం గుర్ఖా ఎస్‌యూవీ ఎప్పటి మాదిరిగానే ఉత్తమమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ మెకానికల్ లాక్ డిఫరెన్షియల్ ఉంటుంది. దీని సాయంతో డ్రైవర్ నడిపే టెర్రైన్ ను బట్టి వాహనాన్ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇది 35 డిగ్రీల గ్రేడబిలిటీని కూడా కలిగి ఉంటుంది. ఎత్తైన కొండలు, వాలుగా ఉండే రోడ్లను సునాయాసంగా అధిగమించడంలో ఇది సహాయపడుతుంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

అలాగే, ఫోర్స్ గుర్ఖా మంచి వాటర్ వేడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. నీటితో నిండిన వాగులను దాటడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ 700 మిమీ లోతు ఉండే నీటి ప్రవాహానాన్ని సులువుగా ఎదుర్కోగలదు. వాటర్ వాడింగ్ కోసం ఇందులో ముందు వైపు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ స్నోర్కెల్ కూడా ఉంటుంది. ఇది కంబషన్ లోకి ఫ్రెష్ ఎయిర్ ను పంపడంలో సహకరిస్తుంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఫోర్స్ గూర్ఖా - ఇంజన్

కొత్త 2021 ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుండి గ్రహించిన 2.6 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది కేవలం డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

మహీంద్రా థార్ ఇంజన్ తో పోలిస్తే (130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్) గుర్ఖా ఇంజన్ పరిమాణంలో పెద్దదైనప్పటికి, పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం చిన్నదిగానే ఉంటుంది. అంతేకాకుండా, మహీంద్రా థార్ ఎస్‌యూవీలో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గుర్ఖా ఎస్‌యూవీలో 63 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది.

ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో కొత్త 2021 Force Gurkha డెలివరీలు ప్రారంభం!

ఫోర్స్ గూర్ఖా - సేఫ్టీ ఫీచర్లు

ఇక చివరిగా, ఫోర్స్ గుర్ఖా సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ ఈ కొత్త తరం మోడల్ లో అనేక కొత్త మరియు స్టాండర్డ్ సేఫ్టీర్లను అందిస్తోంది. ఇందులో ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
New gen 2021 force gurkha deliveries started in selected dealerships details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X